• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీ.. శవరాజకీయాలు మానుకోవాలి: రామ్మోహన్

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వైసీపీ హయాంలో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే పనులు చేసుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

February 26, 2026 / 04:14 PM IST

రీ సర్వే అవగాహన సమావేశం

ASR: రంపచోడవరం మండలం తామరపల్లి సచివాలయంలో రీ-సర్వే అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి, ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం మాట్లాడుతూ.. గ్రామంలో త్వరలో రీ సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తమ భూముల సరిహద్దులు శుభ్రంగా ఉంచి, అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

February 26, 2026 / 04:14 PM IST

మక్తల్ ఆంజనేయ ఆలయం పరిసరాలు

NRPT: మక్తల్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలిగించే కట్టడాలు నిర్మించవద్దని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రామ్ లీలా మైదానంలో భక్తుల సౌకర్యార్థం టాయిలెట్లు నిర్మించి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

February 26, 2026 / 04:13 PM IST

మక్తల్–పాతర్చెడ్ రోడ్డు ప్రమాదం

NRPT: మక్తల్ మండలం మంథనోడ్ నుంచి పాతర్చెడ్‌కు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. వర్షాలప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారుతోందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులు ప్రజల సమస్యను దృష్టిలో ఉంచి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

February 26, 2026 / 04:10 PM IST

ఒకే చోట భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

TG: రాష్ట్రంలో ఇవాళ జరిగిన IASల బదిలీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహా శబరీష్ బదిలీ కాగా.. అదే జిల్లాకు ఆమె భర్త శబరీష్ ఎస్పీగా పనిచేస్తుండటం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం తెలంగాణలో ఇదే రికార్డ్. స్నేహ గతంలో హన్మకొండ కలెక్టర్‌గా పనిచేశారు.

February 26, 2026 / 04:10 PM IST

ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 కానుక అందజేత

NLG:చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డు కు చెందిన కాంగ్రెస్ నాయకులు మన్నెం సైదులు తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఐదేళ్ల వరకు వార్డులోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 కానుకగా అందజేస్తామన్న మాటను నెరవేర్చుకుంటున్నారు. ఇవాళ జరిగిన ముప్పా ముత్తిరెడ్డి-మంజుల దంపతుల కుమార్తె అఖిల వివాహానికి హాజరై ఆయన ఈ కానుకను అందజేశారు.

February 26, 2026 / 04:10 PM IST

రంజీ ఫైనల్: మయాంక్ అగర్వాల్ సెంచరీ

రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదాడు. స్టార్ ప్లేయర్లు రాహుల్(13), పడిక్కల్(11), కరుణ్ నాయర్(0) విఫలమైనప్పటికీ అగర్వాల్ 110 పరుగులతో ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రంజీల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్(584) తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కర్నాటక(174/5) మరో 410 పరుగులు వెనుకబడి ఉంది.

February 26, 2026 / 04:09 PM IST

బాధ్యతలు స్వీకరించిన.. తొర్రూర్ మున్సిపల్ ఛైర్మన్

MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఛైర్మన్ తునం శ్రవణ్ కుమార్, వైస్ ఛైర్‌పర్సన్ సోమ రజిని రాజశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి MLA యశస్విని రెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

February 26, 2026 / 04:09 PM IST

దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

ATP: రాప్తాడు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రిని ప్రత్యేకంగా కలిసి ఆలయాల పరిస్థితి గురించి చర్చించి, నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.

February 26, 2026 / 04:08 PM IST

‘మార్చి 14న జాతీయ లోక్ అదాలత్’

E.G: ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 26, 2026 / 04:07 PM IST

టీమిండియాలో ముగ్గురిపై వేటు..!

జింబాబ్వేతో ఇవాళ జరగబోయే కీలక మ్యాచ్‌లో భారత్ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తుది జట్టు అంచనా: అభిషేక, శాంసన్, ఇషాన్, సూర్య, దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్

February 26, 2026 / 04:07 PM IST

ఆంజనేయస్వామి దేవాలయ కొండ నిర్మాణం

WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని అతి పురాతన ఆంజనేయస్వామి దేవాలయ కొండ నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణానికి మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎండోమెంట్ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేశారు. దేవాలయ గర్భగుడి గడప ముహూర్తం ఈ నెల 28న గ్రామ దాతల నిధులతో నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.

February 26, 2026 / 04:06 PM IST

ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వెల్లడించారు.

February 26, 2026 / 04:05 PM IST

గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

JGL: గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. 2027 సంవత్సరంలో జూన్ 26-జూలై 7వరకు జరిగే పుష్కరాల దృష్ట్యా ఘాట్ నిర్మాణం, రోడ్లు, లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

February 26, 2026 / 04:05 PM IST

పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించాలి: ఛైర్మన్

MNCL: బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న గోదావరి పైప్ లైన్ పనులను మున్సిపల్ ఛైర్మన్ దావా స్వాతి-రమేష్ బాబు గురువారం పరిశీలించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్య తలెత్తకుండా పైప్ లైన్ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని సూచించారు.

February 26, 2026 / 04:05 PM IST