ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా పలువురు IAS అధికారులు గురువారం బదిలీ అయిన విషయం తెలిసిందే. WGL జిల్లా కలెక్టర్ సత్య శారద మాత్రం బదిలీ కాలేదు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ సమర్థవంతంగా విధులు నిర్వహించడమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీని పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 7 హోటల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 50-60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమన్నారు.
NRML: రానున్న గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, రహదారుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడాలని, అనుమతి లేకుండా వాహనాల నిలుపుదలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడిన దొంగలను గురువారం అరెస్ట్ చేసినట్లు SP నితిక పంత్ తెలిపారు. గత నెల 3న దండే మంగా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి 72 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.2,75,000 అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
ప్రతీ పది, పదిహేను నిమిషాలకు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా? అయితే ఇది శరీరంలో ఏదైనా సమస్య ఉందని చెప్పేందుకు సంకేతం. బ్లాడర్ కండరాలు తరచూ సంకోచించి, పూర్తిగా నిండకుండానే యూరిన్ వెళ్లేందుకు చాన్స్ ఉంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా కావొచ్చు. ఒకేసారి ఎక్కువ నీరు తాగకుండా.. రోజంతా కొంచెం కొంచెం తాగండి. టీ, కాఫీ, శీతల పానీయాలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20ల్లో 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఒక సిక్సర్ బాదడం ద్వారా ఇషాన్ ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో వేగంగా 300 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ (217 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో నిలిచాడు. అభిషేక్ (163 ఇన్నింగ్స్‌లు) తొలి స్థానంలో ఉండగా, రాహుల్ (205) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
AP: NTR భరోసా పింఛన్లను ఈ నెల 28న పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 1న ఆదివారం వచ్చినందున ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి పంపిణీ జరుగుతుందన్నారు. 28న 100 శాతం పింఛన్ నగదు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పింఛను పొందేందుకు పింఛనుదారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండాలని సూచించారు.
GDWL: గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో (రేపు) 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మీనాక్షి సీపీడీసీ సాయి శ్యామ్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు డిగ్రీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులే అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VZM: జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఫిబ్రవరి 28న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు 1 నుండి 7వ స్థాయి సంఘాల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు అందరూ హాజరై అభివృద్ధి పనులపై చర్చించాలని కోరారు.
దర్శకుడు అనిల్ రావిపూడిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి యాక్షన్ కామెడీ చేయడం ఒక సాహసమని అన్నారు. ఆ ప్రయత్నాన్ని అనిల్ విజయవంతంగా పూర్తి చేశాడని కొనియాడారు. చిరంజీవిలో ఎనర్జీ ఇప్పటికీ అలానే ఉందని, ఆయన ఎప్పటికీ తమ మెగాస్టారే అని పరుచూరి తెలిపారు.
JGL: పెగడపల్లి మండలానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.51.52 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ. 50 వేల నుండి రూ. ఆరు లక్షల వరకు మంజూరయ్యా యని, ఈ నిధులను ఆయా జీపీల్లో జమవుతాయన్నారు.
TPT: నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. వరదయ్యపాలెంలో సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామని చెప్పారు.
ADB: మార్చి 10న ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆవిష్కరించారు. జాబ్ మేళాలో 50కి పైగా పాల్గొననున్న కంపెనీలలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటులు అన్నపూర్ణ, రజిత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికి అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించిన వారు ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపారు. వీరి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.