ATP: తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో తోటలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ. 82,500 నగదు, ఒక మోటార్ సైకిల్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
GDWL: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రారంభించింది. గద్వాల డిపోలో డీఎం సునీత, లాజిస్టిక్స్ ఏటీఎం బద్రి నారాయణ పోస్టర్లు విడుదల చేశారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ (9154298609)ను సంప్రదించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
JN: రఘునాథపల్లి గ్రామంలో VOA భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ చేశారు. సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్ పేట్ డివిజన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్‌లో నూతనంగా నిర్మించిన తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
AKP: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది. 28వ తేదీ ఉదయం విశాఖ నుంచి రోడ్డు మార్గంలో పదిన్నర గంటలకు రాంబిల్లి మండలం లాలం కోడూరు శివారు సీతంపాలెం గ్రామం చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి రెండు గంటల వరకు బ్లూ జెట్ కంపెనీ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
WNP: క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘సీఎం-కప్’ 2వ ఎడిషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
NLG: శ్రీ శ్రీ శ్రీ భూసమేత తిరుమలనాధస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు గురువారం పున్న రాములు భారతమ్మ దంపతులు అన్న ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ముందు స్వామివారికి ‘నైవేద్యం’ సమర్పించారు. కళ్యాణానికి విచ్చేసిన దాదాపు 6,000 మంది భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. నిర్వహకులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: జిల్లాలోని బాల కార్మికులు పనికి కాదని బడికి వెళ్లాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల కార్మికుల నిర్ములనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మికుల నిర్ములన ఒక ఉద్యమంలా చేపట్టాలని బాల కార్మిక నిర్ములన శాఖ అధికారిని ఆదేశించారు.
పుదీనా ఆకు కేవలం సువాసనకే కాదు, ఆరోగ్యానికి ఒక వరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ తలనొప్పి, ఉబ్బసం, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నోటి దుర్వాసనను దూరం చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుదీనా ఒక ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది.
RR: వివేకానంద నగర్ డివిజన్ AS రాజు నగర్ కాలనీలో రూ.19 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలాన్ని ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు ఆస్తుల కంటే మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని అందించడమే మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలిలో వ్యాయామం అనివార్యమని గాంధీ తెలిపారు.
HNK: పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశాన్ని నేడు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ మార్కెట్‌కు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేద్దామని అన్నారు. అనంతరం నూతన పరకాల మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ ను మార్కెట్ పాలకవర్గ సభ్యులు సన్మానించారు.
NRML: మహిళల భద్రత ప్రజల రక్షణే నారిశక్తి ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లాలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న నారీ శక్తి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. మహిళా పోలీస్ సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వచ్చిన డయల్ 100 కాల్‌ను తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
WNP: మెడికల్ కళాశాల ఆవరణలో ఇతర నిర్మాణాలు చేపట్టడం ద్వారా కళాశాల ప్రమాణాలు పెంచడానికి అడ్డంకి అవుతుందని వెంటనే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి వేరే స్థలంలో కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేయగా.. ఆయన కలెక్టర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.
ATP: రాప్తాడులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ భద్రతపై జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం చట్టాలు, శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో సోదాలు చేపట్టింది. కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలో అధికారులు తనిఖీలు చేశారు. పాల నాణ్యతపై స్పాట్ టెస్ట్‌లు చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. లైసెన్స్ లేకుండా విక్రయిసస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.