• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

JGL: కోరుట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లూరి నరేష్ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై నరేష్ డెకరేషన్ పనికి మెట్‌పల్లి వెళ్తుండగా.. కోరుట్ల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టాడు. దీంతో నరేష్ తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

February 23, 2026 / 08:50 PM IST

ఛత్రపతి శివాజీ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

KMR: మద్నూర్ మండల కేంద్రంలో సార్వజనిక శివ జన్మోత్సవ్ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శాలువాతో ఘనంగా సత్కరించారు.

February 23, 2026 / 08:49 PM IST

తిరుమలలో నాఖా బందీ

TPT: తిరుమలలో భక్తుల భద్రత దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయి నాఖాబందీ కార్యక్రమం నిర్వహించింది. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి మురళీ కృష్ణ ఆదేశాల మేరకు బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. సుమారు 90 మంది సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి అనుమతి లేని వ్యక్తులపై దృష్టి సారించారు.

February 23, 2026 / 08:48 PM IST

‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు’

VZM: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన “సిటీ రీజియన్స్ యాజ్ గ్రోత్ హబ్” ప్రాజెక్టులో భాగంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కింద అమలు చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 08:48 PM IST

బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు

WNP: జిల్లా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత విద్యార్థి సంఘాలు, మాదిగ జేఏసీ నాయకులు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డికి ఫిర్యాదు చేశారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఇతనిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వారు కోరారు.

February 23, 2026 / 08:48 PM IST

KUDA అనుమతులు తప్పనిసరి: ఛైర్మన్

KRNL: KUDA అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మంత్రాలయంలోని నాన్ లేఔట్ ప్లాట్లలో అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలను పరిశీలించి నిర్మాణదారులను హెచ్చరించారు. బీపీఎస్ విధానం ద్వారా దరఖాస్తు చేసి ప్రభుత్వానికి రుసుము చెల్లించి మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

February 23, 2026 / 08:44 PM IST

‘న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి’

కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు మానవహారం, ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది ఎం. పవన్ కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనను ఖండిస్తూ పెద్ద ఎత్తున న్యాయవాదులు ఆందోళనకు దిగారు.

February 23, 2026 / 08:44 PM IST

యాదగిరిగుట్ట శ్రీవారి నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,50,785, కార్ పార్కింగ్‌తో రూ.2,18,00, VIP దర్శనాలతో రూ.2,40,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,65,900, వ్రతాలతో రూ.1,06,000, కళ్యాణకట్ట రూ.65 వేలు, లీజులతో రూ. 2 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,56,844 ఆదాయం వచ్చింది.

February 23, 2026 / 08:44 PM IST

‘నాగర్ కర్నూల్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి’

MLG: నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా కార్యదర్శి కోయల నర్సింహారావు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెలిపారు.

February 23, 2026 / 08:44 PM IST

నేలకొండపల్లిలో బీజేపీ నాయకుల నిరసన

KMM: BJP రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అక్రమ అరెస్టు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ సోమవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకొని నిరసనను భగ్నం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నాయకులు తెలిపారు.

February 23, 2026 / 08:44 PM IST

కరాటేలో బంగారు పతకం సాధించిన విద్యార్థి

WG: విశాఖపట్నంలో నిర్వహించిన 31వ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. వేణు అండర్-17 విభాగంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సూర్య తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

February 23, 2026 / 08:43 PM IST

T20 WC: రేపు పాక్- ఇంగ్లండ్ మధ్య కీలక పోరు

సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే దాదాపు సెమీస్‌కు చేరుకుంటుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో పాక్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

February 23, 2026 / 08:43 PM IST

‘కుమ్మెర ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

NLG: అగ్రకుల దురహంకారంతో బీసీ కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు నిందితులను అందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ కలిసి విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 08:43 PM IST

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో రాణించడం అభినందనీయం: SP

SRD: జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో రాణించడం అభినందనీయమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులను సోమవారం కార్యాలయంలో సన్మానించారు. మొత్తం జిల్లాకు 21 పతకాలు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:42 PM IST

మహిళా అక్షరాస్యతపై కలెక్టర్ ఆదేశాలు

నంద్యాల: జిల్లాలో 1,00,686 మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు శాఖల సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఇవాళ ఆదేశించారు. ప్రతి వాలంటీర్‌కు 10 మంది చొప్పున అనుసంధానం చేసి మే 28న జరిగే ప్రీ–ఫైనల్ పరీక్షకు వంద శాతం హాజరు కల్పించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వెల్లడించారు.

February 23, 2026 / 08:41 PM IST