అన్నమయ్య: మదనపల్లి మండలంలో ఆదివారం ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా అమర్చేందుకు వెళ్లగా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయిన ఆయనను స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
MDCL: ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా వారం రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకుని, వాహనాలు సైతం సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.
కోనసీమ: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇవాళ పేర్కొన్నారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీలు కూటమి పార్టీలపై నమ్మకం నుంచి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
ATP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆదివారం పాల డైరీలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఇటివల కల్తీ పాల ఘటన వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ ఆధ్వర్యంలో సిబ్బంది అనంతపురంలోని 6 డైరీలను తనిఖీ చేసి శాంపిల్ సేకరించారు. పరిశుభ్రత లేకుండా నిల్వ ఉంచిన పాలను పారద్రోలించారు.
TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములను BJP చీఫ్ రామచందర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భూదన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లను కూలగొట్టి ప్రభుత్వం ఏం సాధించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు BJP పోరాడుతుంది’ అని అన్నారు.
సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన వాహనంపై స్వామివారి వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. మంగళవాయిద్యాలు, భజనల మధ్య ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది.
MDK: మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలన్నారు.
SRD: రేపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వికారాబాద్ నుంచి తాండూర్‌కు అనంతగిరి గుట్ట మార్గంలో వచ్చే వాహనాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి రోడ్డు, మెరినాట్స్ మీదుగా జైదుపల్లికి వెళ్లే రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగించాలని సూచించారు.
అన్నమయ్య: రాయచోటిలోని చెన్నముక్కపల్లి లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత శిబిరంలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా, అర్హులైన 14 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 25 మందికి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. రోగులు, సహాయకులకు ఎన్నారై దాత ఎర్రగొండ గోవర్ధన్ రెడ్డి సహకారంతో అన్నదానం నిర్వహించారు.
ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 105 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రతికా రావల్ (27), స్మృతి మందాన (0), జెమీమా (42) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్‌ప్రీత్ (15*), హర్లిన్ (10*) ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 105 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 409/7 పరుగులు చేసింది.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటికి సోలార్ సదుపాయం అందేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సోలార్ వినియోగంతో విద్యుత్ ఖర్చు తగ్గి గ్రామం స్వయం సమృద్ధిగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.
పెళ్లిపై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే’ అని చెప్పింది. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని విడాకుల వరకు వెళ్లడం ఇష్టం లేదని, జీవితాన్ని పంచుకోగలిగే మంచి భాగస్వామి కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కేవలం ప్రేమలో పడటం కంటే, సంతోషకరమైన వైవాహిక జీవితమే తన లక్ష్యమని పేర్కొంది.
RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఇవాళ శంకర్ పల్లి మండల పరిధిలో దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
TG: పేదలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మాజీమంత్రి KTR ఆరోపించారు. ‘పేదల ఇళ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కడతారంటా. రూ.150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం కట్టాం.. గాంధీ విగ్రహానికి రూ.5 వేల కోట్లు ఎందుకు? అంబేద్కర్‌ను పట్టించుకోనివారు.. గాంధీకి గౌరవం ఇస్తారా. ఒక్క ఇళ్లు కూడా పడగొట్టకుండా మూసీ ప్రక్షాళన చేయాలి. ఈ సర్కార్ ఎన్నో ఇళ్లు కూలగొట్టింది’ అని అన్నారు.
ELR: జిలుగుమిల్లిలో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి చిట్టి బొమ్మ కొండలరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలు అమలు చేయాలని కోరారు. సహజంగా చనిపోయిన కార్మికులకు రూ.60 వేలు ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ ఆర్థిక సహాయం మరింత పెంచాలని కోరారు.