• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాజమండ్రి వాసులకు అలర్ట్

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని 10 MLD విభాగం మరమ్మతుల కారణంగా 45, 46, 47, 48, 49వార్డుల్లో ఇవాళ్టి నుంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ రీటా తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం రేపటి నుంచి యథావిధిగా నీటి సరఫరా పునఃప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

February 23, 2026 / 09:10 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. టికెట్ల రూపంలో రూ.1,23,710, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.60,900, అన్నదానానికి రూ.28,412 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేవాలయానికి రూ.2,13,022 ఆదాయం లభించిందని వెల్లడించారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.

February 23, 2026 / 09:10 AM IST

కోసిగిలో ఉచిత కంటి శిబిరం..50 మందికి ఆపరేషన్లు

KRNL: కోసిగి మండలంలో ఎమ్మిగనూరు ఆర్కే కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 50 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేశారు. సీఐ మంజునాథ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డా. హేమంత్ కుమార్ నిరుపేదలకు సేవలు కొనసాగిస్తామని తెలిపారు.

February 23, 2026 / 09:10 AM IST

వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి: ఏఈఓ

MNCL: జన్నారం మండలంలోని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలని మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెండు రోజులుగా మబ్బు పట్టిన వాతావరణం ఉందన్నారు. రైతులు వేసిన పంటలు ఎదుగుదశలో ఉన్నాయని, మబ్బు పట్టడంతో చల్లటి వాతావరణం ఉంటుందన్నారు. ఈ సమయంలో పంటలకు వివిధ తెగులు సోకే ప్రమాదం ఉందని, వాతావరణ మార్పులను గమనించాలన్నారు.

February 23, 2026 / 09:10 AM IST

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ASF: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. కెరమెరి ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. కెరిమెరికి చెందిన గుర్నాలే వార్లు(74) బస్టాండ్ సమీపంలోని కిరాణా షాపునకు వెళ్తున్న ఆయను, వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

February 23, 2026 / 09:10 AM IST

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

CTR: పుంగనూరు నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

February 23, 2026 / 09:09 AM IST

సమాజంలో మహిళలు పాత్ర కీలకం: గోడం రేణుక

ADB: సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించాలని ఆదివాసి తుడుందెబ్బ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోడం రేణుక అన్నారు. మావల మండల కేంద్రంలో సంఘం నాయకులతో ఆదావారం సమావేశమై ఆమె మాట్లాడారు. మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు గణేష్, దాదీ రావు, మనోజ్, ఇందిర, రమేష్ తదితరులున్నారు.

February 23, 2026 / 09:09 AM IST

జాతర ఘటన.. NHRCకి ఫిర్యాదు

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2 నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.

February 23, 2026 / 09:09 AM IST

ఈనెల 26 నుంచి ఎల్లమ్మ తల్లి జాతర ప్రారంభం

VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఎల్లమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జాతర సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొమురక్క ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు గుడి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

February 23, 2026 / 09:08 AM IST

నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

SRCL: చందుర్తి మండలంలో ఇటీవల గెలుపొందిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం నుండి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. మొదటి విడతగా ఈనెల 23 -27 వరకు ఐదు రోజులు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చందుర్తి రైతు వేదికలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

February 23, 2026 / 09:07 AM IST

అంగన్వాడీ కేంద్రాల బాధ్యత సర్పంచులదే

KNR: గ్రామస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక సర్పంచ్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ 777, పెద్దపల్లి 706, జగిత్యాల 1065, సిరిసిల్ల 587 కేంద్రాల్లో పోషకాహార పంపిణీ, నాణ్యతను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 09:03 AM IST

కార్గో ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై చర్చా వేదిక

SKLM: పలాసలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌ పోర్ట్ కోసం భూసేకరణ అంశంపై మెట్టూరులో ఆదివారం రాత్రి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. గ్రామ ప్రజలు, భూములు కోల్పోయే రైతులు, మహిళలు, పాల్గొన్నారు. భూమి కోల్పోయే కుటుంబాలకు ప్రత్యేక రక్షణతో పాటు అదనపు రూ. 2.30 లక్షల సహాయం ఇవ్వాలని ప్రతిపాదించారు.

February 23, 2026 / 09:00 AM IST

నాటక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

కృష్ణా: మచిలీపట్నంలోని మహతి కళా వేదికలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ జల వాయు కాలుష్య నివారణపై నివేదిక అనే సందేశాత్మక నాటక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి సంరక్షణ, కాలుష్య నియంత్రణపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

February 23, 2026 / 09:00 AM IST

నేటి నుంచి వారికి శిక్షణా తరగతులు

RR: షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ పాలన-పంచాయితీ రాజ్ చట్టంపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బన్సీలాల్ తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 23 వరకు 4 విడతలుగా శిక్షణ కొనసాగనుందని, వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.

February 23, 2026 / 08:59 AM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

AKP: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భారీగా విద్యార్థులు తరలిరావడంతో పరిసరాలు కోలాహలంగా మారాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

February 23, 2026 / 08:57 AM IST