• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బీజేపీలో చేరిన సీనియర్ వైద్యులు

JGL: కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు, డాక్టర్ వై. అనూప్ రావు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, JGL అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబుల సమక్షంలో శుక్రవారం చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు.

February 28, 2026 / 04:12 AM IST

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘శుక్రవారం’ సభ

KNR: చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లె అంగన్వాడీ సెంటర్‌లో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. సర్పంచ్ మవురం సుగుణ అధ్యక్షత వహించగా సీడీపీఓ నర్సింగరాణి హాజరై మాట్లాడుతూ.. ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లులకు వివరించారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి మహిళా సాధికారత గురించి తెలిపారు.

February 28, 2026 / 04:06 AM IST

ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్ ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్తుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై కేసులు నమోదైనట్లు తెలిపారు.

February 28, 2026 / 04:05 AM IST

శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో సాగిన ఊరేగింపులో మహిళలు బోనాలు సమర్పిస్తూ పాల్గొన్నారు. డప్పులు, పూజా కార్యక్రమాలతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

February 28, 2026 / 04:04 AM IST

ఫిబ్రవరి 28: శనివారం పంచాంగం

శ్రీవిశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష ద్వాదశి: రా8-40 తదుపరి త్రయోదశి; పునర్వసు: ఉ9-43 తదుపరి పుష్యమి; వర్జ్యం: సా5-22 నుంచి 6-54 వరకు; అమృత ఘడియలు: రా7-27 నుంచి 8-58 వకు; దుర్ముహూర్తం: ఉ6-24 నుంచి 7-56 వరకు; రాహుకాలం: ఉ9 నుంచి 10-30 వరకు; సూర్యోదయం: ఉ6-24; సూర్యాస్తమయం: సా6-01.

February 28, 2026 / 02:20 AM IST

ఫిబ్రవరి 28: ప్రపంచ టైలర్ల దినోత్సవం

మనిషి ఆహార్యానికి నిండుదనంతోపాటు రూపానికి చక్కని ఆకృతిని ఇవ్వడంలో టైలర్ల సేవలు వెలకట్టలేనివి. వారంతా తమ నైపుణ్యం, ఓపికతో కత్తిరించిన బట్ట ముక్కలకే కాదు, మనిషిలోని ఆత్మవిశ్వాసానికీ ప్రాణం పోస్తుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి అవసరాలకు తగ్గట్లుగా రాత్రింబవళ్లూ కష్టపడుతూ అందరినీ అందంగా తీర్చిదిద్దే కుట్టుపని కళాకారులకు టైలర్ల దినోత్సవ శుభాకాంక్షలు.

February 28, 2026 / 02:00 AM IST

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై CBI సవాల్

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆ రాష్ట్ర మాజీ CM కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సహా పలువురికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ CBI ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చే క్రమంలో సదరు ట్రయల్ కోర్టు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని CBI పేర్కొంది.

February 28, 2026 / 01:40 AM IST

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తండ్రి

CTR: నగర పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్‌టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:02 AM IST

రింకూ తిరిగి వచ్చేస్తున్నాడు!

రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ స్వగ్రామానికి వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే శనివారమే అతను జట్టుతో కలుస్తాడని BCCI వర్గాలు తెలిపాయి. ఖాన్‌చంద్ తీవ్ర అనారోగ్యంతో మొన్న నోయిడాలో చికిత్స పొందుతుండగా..రింకూ జింబాబ్వే మ్యాచ్ ముందు కూడా జట్టును వీడాడు. మ్యాచ్ వేళకు వచ్చినా తుదిజట్టులో ఛాన్స్ రాలేదు.

February 28, 2026 / 12:59 AM IST

IAS బదిలీల్లో కీలక సవరణ

TG: 45 మంది IASలను బదిలీ చేస్తూ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో  రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. పరిశ్రమలు, ఐటీ శాఖల అదనపు బాధ్యతలను సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించింది. గురువారం వచ్చిన ఉత్వర్తుల ప్రకారం ఈ బాధ్యతలను ఎన్. శ్రీధర్‌కు అప్పగించగా.. దానిపై సవరణ చేస్తూ శుక్రవారం మరో జీవో జారీ చేసింది.

February 28, 2026 / 12:20 AM IST

ఫిబ్రవరి 28: చరిత్రలో ఈరోజు

➢ 1885: స్వాతంత్ర్య సమరయోధుడు బాబు చోటేలాల్ శ్రీవాత్సవ జననం➢ 1922: తెలుగు సాహితీవేత్త రాచమల్లు రామచంద్రారెడ్డి జననం➢ 1948: రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం➢ 1973: సినీ నటుడు సునీల్ జననం➢ జాతీయ విజ్ఞాసశాస్త్ర దినోత్సవం➢ ప్రపంచ దర్జీల దినోత్సవం

February 28, 2026 / 12:00 AM IST

యువతిగా ఫేక్ IDతో సైబర్ మోసాలు.. అరెస్ట్

AP: యువతిగా ఫేక్ IDతో పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిని HYD పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన నిందితుడు పెదపూడి ప్రసన్నకుమార్ ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో అమ్మాయిలా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని మోసాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. క్రిప్టో ఇన్వెస్ట్ మోసాలకూ పాల్పడ్డాడని, 400+ సిమ్ కార్డులతో ఫేక్ అకౌంట్లు తెరిచాడని గుర్తించారు.

February 27, 2026 / 11:40 PM IST

‘చిలుకూరు బాలాజీ’ ప్రధాన అర్చకుడు కన్నుమూత

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్(90) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంరాజన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఆలయంలో ప్రస్తుత అర్చకుడు రంగరాజన్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన.. ఎప్పుడూ భక్తులతో మమేకమై స్వామి వారి గురించి భక్తులతో ఎంతో ప్రశాంతంగా వివరించేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తంచేశారు.

February 27, 2026 / 11:20 PM IST

T20 WC: ఉత్కంఠ పోరులో ఓడిన న్యూజిలాండ్

ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన కీలక ‘సూపర్ 8’ మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్ బౌలర్లు చివరి ఓవర్లలో తడబడ్డారు. దీంతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన ఇంగ్లండ్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. ఈ ఓటమితో కివీస్ ‘సెమీస్’ ఆశలు రేపటి SL vs PAK పోరుపై ఆధారపడి ఉన్నాయి. అందులో పాక్ ఓడితేనే కివీస్ సెమీస్‌కు చేరుతుంది.

February 27, 2026 / 10:26 PM IST

సౌందర్ రాజన్ మృతి బాధాకరం: చంద్రబాబు

AP: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సౌందర్ రాజన్ చేసిన ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయం. ఆలయాల సంప్రదాయాలను, స్వతంత్రతను కాపాడేందుకు ఆయన విశేష కృషి చేశారు’ అని పేర్కొన్నారు.

February 27, 2026 / 10:10 PM IST