• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా అదనపు కలెక్టర్ గా హరిప్రియ

MBNR: జిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీ అయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అదనపు కలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హౌసింగ్ PDగా పనిచేస్తున్న శ్రీనివాసరావు RDOగా నియామకంకాగా, RDOగా పనిచేస్తున్న అలివేలు హౌసింగ్ PDగా నియమితులయ్యారు.

February 26, 2026 / 05:13 AM IST

ఉద్యోగ మేళాలో 69 మంది ఎంపిక

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.

February 26, 2026 / 05:10 AM IST

అంగన్వాడీల సమస్యలపై మంత్రికి వినతి

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిశారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల దుస్థితిని వివరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, అసంపూర్తి పనులు, కాంపౌండ్ గోడల లేమి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త కేంద్రాల ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 26, 2026 / 05:09 AM IST

డ్రైవింగ్ శిక్షణ పత్రాలు పంపిణీ చేసిన కలెక్టర్

SS: ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సర్టిఫికెట్లు అందజేశారు. హిందూపురం డిపోలో శిక్షణ పొందిన పది మంది నిరుద్యోగ యువతకు బుధవారం కలెక్టరేట్‌లో వీటిని పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

February 26, 2026 / 05:07 AM IST

అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్

KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రవి, రాములును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశారు.

February 26, 2026 / 05:06 AM IST

విస్తృతంగా పోలీసుల తనిఖీలు

JGL: కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై అరైవ్ ఆలైవ్‌లో భాగంగా బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షలు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు.

February 26, 2026 / 04:41 AM IST

గన్నవరంలో రూ.58 లక్షలతో అభివృద్ధి పనులు

BPT: యద్దనపూడి మండలం గన్నవరంలో రూ. 58 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో రూ. 94 లక్షలతో ‘జలసిరి’ పథకం కింద గ్రామంలోని 357 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు రంగయ్య చౌదరి బుధవారం తెలిపారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు.

February 26, 2026 / 04:38 AM IST

నరసరావుపేటలో పర్యటించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జనసేన నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

February 26, 2026 / 04:32 AM IST

ప్రజల భద్రతే పోలీసులకు కర్తవ్యం: సీఐ

PDPL: సురక్షిత ప్రయాణం, ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యమని గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీ చౌక్,కార్ టాక్సీ అడ్డా వివిధ ప్రాంతాలలో బుధవారం భారీ వాహనదారుల సీటు బెల్టు తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

February 26, 2026 / 04:29 AM IST

బలుసుపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటన

PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ‘ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు 100 గ్రామాలు’ కార్యక్రమం బుధవారం రాత్రి బలుసుపాడు గ్రామానికి చేరుకుంది. పర్యటనలో భాగంగా ఆయన నేరుగా ప్రజల సమస్యలు విని, పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ పర్యటన కొనసాగించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 04:25 AM IST

అమరావతి అభివృద్ధి పనులకు రూ.1,400 కోట్లు విడుదల

GNTR: రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.1,400 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాల ద్వారా వచ్చే ఈ నిధులను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేటాయించారు. ఈ మొత్తాన్ని సీఆర్డీఏ పీడీ ఖాతాలో జమ చేయనున్నారు.

February 26, 2026 / 04:18 AM IST

T20 WC: మళ్లీ ఓడిన శ్రీలంక

పొట్టి మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తమ రెండో సూపర్ 8 మ్యాచులోనూ శ్రీలంక ఓడింది. తొలుత కివీస్ 168/7 స్కోర్ చేయగా..  లక్ష్యచేధనలో లంక ఆరంభం నుంచే తడబడుతూ వచ్చి 115/9 మాత్రమే చేయగలిగింది. టోర్నీ తొలి 3 మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత మూడింటిలోనూ పరాజయంపాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

February 25, 2026 / 10:30 PM IST

కరివేపాకుతో జుట్టు రాలడానికి చెక్..!

కరివేపాకును కేవలం పోపులో వాడి పక్కన పడేయకుండా, పొడి రూపంలోనో లేదా పచ్చిగానో తీసుకోవడం వల్ల జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

February 25, 2026 / 10:20 PM IST

అప్రెంటిన్షిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

నల్లగొండ రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ / డిప్లొమా అభ్యర్థులు NATS వెబ్‌సైట్ https://nats.education.gov.in ను మార్చి 5 వరకు సందర్శించి నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 75691 18549 సంప్రదించాలన్నారు.

February 25, 2026 / 10:09 PM IST

క్రీడలతోనే ఆరోగ్యం, ఆనందం: పుల్లారావు

PLD: యువతలో ఆసక్తి పెంచేందుకే సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ శాసనసభ క్రీడాపోటీల్లో ఆయన పాల్గొన్నారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి వాలీబాల్ ఆడారు. ప్రజలను సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతికత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలే ఉత్తమ మార్గమన్నారు.

February 25, 2026 / 10:00 PM IST