WGL: 37వ డివిజన్ తూర్పు కోటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, స్థానిక కార్పొరేటర్ సువర్ణ సురేష్ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని, లబ్ధిదారులకు వెనువెంటనే బిల్లులను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ స్పష్టం చేశారు.
JN: జనగాం జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
PDPL: పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఇవాళ 103 కిలోల 45 సంవత్సరాల మహిళకు గర్భకోశానికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు DCHS డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ముత్తారం మండలానికి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించి సర్జరీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
MDK: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో “మెకానికల్ బాజా సే ఇండియా 2026” గురువారం రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మెదక్ జిల్లా పోలీసులు జెండా ఊపి ప్రారంభించారు. 10 తెలంగాణ జట్లు పాల్గొని సాంకేతిక నైపుణ్యాలు, వాహన రూపకల్పన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. కొత్త హోండా జిక్స్ 430 ఇంజిన్ పరిచయం జరిగింది.
SKLM: మందస మండలం పల్లిబహడపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి అప్పలరాజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవులో అమ్మవారిని దర్శించుకున్నారు.
MNCL: బీసీలపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు బీసీలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వెంటనే బీసీల రక్షణ, భద్రతకు బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
AP: బాపట్ల జిల్లా వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర(20) ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న యువతి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. HYDకి చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.
తూ.గో: రాజానగరం మండలంలో 12 ఏళ్ల బాలికపై 44 ఏళ్ల కాళీకృష్ణ అత్యాచారయత్నం చేశాడని ఎస్ఐ మురళికృష్ణ గురువారం తెలిపారు. అనారోగ్యం వల్ల స్కూల్‌కు వెళ్లని బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించారు. కూలి పని నుంచి వచ్చిన తల్లి, స్థానికులు బాలిక అరుపులు విని రావడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
SRPT: జిల్లాలో అమలైన MGNREGA పనులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం VB-GRAMగా మారుస్తున్న నేపథ్యంలో Ministry of Rural Development (MORD) కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఏలూరు పార్లమెంటు పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసి, ప్రజాదర్బార్ నిర్వహించారు. 53 మంది లబ్ధిదారులకు 41,40,368 విలువైన CMRF చెక్కులు అందించారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసం AI ల్యాబులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ADB: గురుకులాల్లో ఉచిత వసతితో నాణ్యమైన విద్య అందుతుందని ఐటీడీఏ PO యువరాజ్ మర్మట్ అన్నారు. గురువారం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల, బోథ్ అడ్మిషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. శివకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
NTR: విజయవాడ మాచవరం పోలీసులు డ్రగ్స్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాలు ప్రకారం.. రాజేష్ అనే వ్యక్తి మరో ఇరువురుతో కలిసి డ్రగ్స్ కలిగి ఉన్నాడని, ఈ నేపథ్యంలో అతనిని డిసెంబర్ నెలలో అరెస్ట్ చేశారు. కాగా, రాజేష్ తప్పించుకుని పరారయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
W.G. ఆచంట మండలం కొడమంచిలి బీపీ చెరువులో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం స్లాబ్ పనులు మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఆధ్వర్యంలో సరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. అధికారం ఉన్న లేకపోయినా ఇచ్చిన మాట తప్పకుండ బీపీ చెర్వులో అంబెద్కర్ స్లాబ్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో క్రీడా మైదానంలా కనిపిస్తోంది. కొద్దిపాటి నీరు మాత్రమే మిగిలి ఉండగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. నీటిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. చెరువులో పూడికను తొలగించి పునరుద్ధరించాలని పట్టణవాసులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.
ATP: అనంతపురానికి పట్టిన శని విడిపోతోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, పద్మశాలి కార్పొరేషన్ పోతుల లక్ష్మీనరసింహులు అన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేయర్ సానుభూతి రాజకీయాలకు తెర లేపారన్నారు. అవినీతి ఎక్కడుందో నిరూపించాలని సవాల్ చేశారు.