• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మెడికల్ మాఫియాను అరికట్టాలంటూ కలెక్టర్‌కు వినతి

కృష్ణా: మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఏఐటీయుసీ జిల్లా కన్వీనర్ లింగం ఫిలిప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఫిలిప్ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తెలిపారు.

February 28, 2026 / 05:59 PM IST

ఐదేళ్ల చిన్నారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడుకు చెందిన కె.నారాయణస్వామి కుమార్తె ఐదేళ్ల భావన అనారోగ్యంతో విజయవాడలోని అనురాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆపరేషన్ కోసం అవసరమైన రూ.1.20 లక్షల ఎల్‌వోసీని ఎమ్మెల్యే పరిటాల సునీత మంజూరు చేయించారు. శనివారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ఈ పత్రాన్ని చిన్నారి తండ్రికి ఆమె అందజేశారు.

February 28, 2026 / 05:57 PM IST

వెలుగొండ ప్రాజెక్టును వేగవంతం చేసింది ఇద్దరే: దద్దాల

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పట్ల వైయస్సార్, జగన్ మాత్రమే శ్రద్ధ తీసుకొని వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్లు కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అబద్ధపు మాటలు తప్ప నిజాలు మాట్లాడిన దాకలు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

February 28, 2026 / 05:57 PM IST

నన్ను చంపాలని ప్రయత్నించారు: మంత్రి

TG: అభివృద్ధి చేయనీయకుండా ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తనను చంపాలని ప్రయత్నించారని వెల్లడించారు. కానీ, ఎంత మంది ప్రయత్నించినా దేవుడు కాపాడుతున్నాడన్నారు. ప్రతిరోజూ బతికి చస్తుంటానని, చావుకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు చేయాల్సిన అభివృద్ధి చేస్తుంటానని తెలిపారు.

February 28, 2026 / 05:54 PM IST

అంబటి రాంబాబును పరామర్శించిన అధ్యక్షురాలు

GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతీమా శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం వల్లే రాష్ట్రం రెడ్ జోన్‌లోకి వెళ్లిందని ఆమె విమర్శించారు. అంబటి ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని పేర్కొన్నారు.

February 28, 2026 / 05:53 PM IST

మార్చి3న ఆలయాలు మూసివేత

NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం, నందవరం చౌడేశ్వరి దేవి మాత ఆలయాలు మార్చి 3న మూసి వేస్తున్నట్లు ఇవాళ ఆలయ అధికారులు పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటలకు మూసివేసి బుధవారం స్వామివారికి యధావిధిగా పూజలు నిర్వహిస్తారు.

February 28, 2026 / 05:53 PM IST

‘కాంగ్రెస్ తోనే పేదలకు మంచి’

RR: నందిగామ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీని సర్పంచ్ కొమ్ము కృష్ణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. సొంత ఇల్లు అనేది నిరుపేదలకు ఓ కలలాంటిదని, ఇందిరమ్మ ఇళ్లతో తమ కల నెరవేరిందని, కాంగ్రెస్ తోనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 05:51 PM IST

సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

వేతనాలపై సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం డబుల్ కాల్‌షీట్, 9-9 కాల్‌షీట్, 4 గంటలకు అదనపు కాల్‌షీట్ ఇవ్వాలని కోరింది. అడిగిన వేతనాలు ఇచ్చినవారికే పనిచేస్తామని.. ఇది నిరసన కాదని, కొత్త వేతనాలపై తమ నిర్ణయమని తెలిపింది. మార్చి 1 నుంచి కొత్త వేతనాలకు పనిచేస్తామని పేర్కొంది. నిర్మాతలకు అభ్యంతరం ఉంటే యూనియన్లతో మాట్లాడాలని సూచించింది.

February 28, 2026 / 05:50 PM IST

ఏటూరునాగారం APOకు వినతిపత్రం అందజేత

MLG: ఏటూరునాగారం ITDA కార్యాలయంలో APO వసంతారావుకు శనివారం TPTF జిల్లా నాయకులు ఉప్పస్వామి, పల్లె నాగరాజు వినతిపత్రం అందజేశారు. ఏటూరునాగారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఉన్నతికరించి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్, కనీస వేతనం, పాఠశాలల అప్‌గ్రేడ్, 317 జీవో బాధ్యులకు న్యాయం చేయాలన్నారు.

February 28, 2026 / 05:50 PM IST

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం ఎమ్మెల్యే

BDK: అశ్వారావుపేట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్య మహిళా సాధికారత, వ్యవసాయం, మత్స్య రంగాలకు సంబంధించిన పనులకు శంఖుస్థాపనలు చేసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పాతగంగారం గ్రామంలో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.

February 28, 2026 / 05:50 PM IST

‘సమాజం అభివృద్ధికి బాల్య వివాహాలు నిర్మూలించాల్సిందే’

RR: షాద్‌నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బాబు నాయక్ బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాల్సిందేనని స్పష్టం చేశారు.

February 28, 2026 / 05:49 PM IST

ఉర్దూ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం)లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ అద్భుతమైన సైన్స్ ప్రదర్శనలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్సు ప్రాజెక్టులను కౌన్సిలర్ మురళి మోహన్ తిలకించి అభినందించారు. వివిధ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

February 28, 2026 / 05:48 PM IST

బాణసంచా పేలుడుపై కర్నూలు ఎంపీ దిగ్భ్రాంతి

KRNL: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై కర్నూలు MP బస్తిపాటి నాగరాజు ఇవాళ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 05:48 PM IST

‘ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలి’

MNCL: ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి పన్ను, నల్లా బకాయిలు మార్చి 31లోపు పూర్తిగా వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. పన్నులు చెల్లించని వారిపై తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

February 28, 2026 / 05:48 PM IST

దిగువ గొల్లపల్లిలో చామంతి తోట పరిశీలన

అన్నమయ్య: సదుం, సోమల మండలాల్లో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సదుం మండలం దిగువ గొల్లపల్లిలో రైతు సాగు చేస్తున్న చామంతి పూల తోటను పరిశీలించి, ఉద్యాన పంటల ద్వారా ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు.

February 28, 2026 / 05:48 PM IST