• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం మరియు సత్తెనపల్లి రూరల్ మండలం కంటెపూడి గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆరాచక, రాక్షస పాలన సాగిందన్నారు.

March 2, 2026 / 06:00 PM IST

బాణాసంచా గోదామును ఆకస్మిక తనకి చేసిన ఎస్సై

కృష్ణా: గన్నవరం బాణా సంచా గోదామును రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎస్సై ప్రశాంతి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు నివారించేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యాలపై షాపు యజమానులకు సూచనలు అందించారు. భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

March 2, 2026 / 06:00 PM IST

ప్రతి గడపకు ‘వికసిత భారత్’ లక్ష్యాలు చేరాలి

SKLM: ఉపాధి హామీ కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘వికసిత భారత్‌ – జీ రామ్‌ జీ’ లక్ష్యాలను ప్రతి గడపకూ చేర వేయాలని జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఉన్నారు. స్థానిక జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో డ్వామా పీడీ బి.లవరాజుతో కలిసి ఈ పథకానికి సంబంధించిన నూతన అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు.

March 2, 2026 / 06:00 PM IST

అంబట్పల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NGKL: లింగాల మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామం కాలనీలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులు సోమవారం ప్రారంభించారు. నిధులు కేటాయించినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అచ్యుత రెడ్డి, మాజీ సర్పంచ్ రవిశంకర్, నాయకులు జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:00 PM IST

పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

W.G: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ఎల్ఆర్ పేటలో రూ.4.28 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు.

March 2, 2026 / 06:00 PM IST

అంబేద్కర్ విగ్రహాన్ని అందజేసిన మంత్రి సవిత

సత్యసాయి:పెనుకొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన హరిజనులకు మంత్రి సవిత అంబేద్కర్ విగ్రహాన్ని విరాళం అందజేశారు. ఎస్సీ కాలనీకి చెందిన హరిజనులు గ్రామంలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా తన తండ్రి ఎస్. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం విరాళంగా విగ్రహాన్ని అందజేశారు.

March 2, 2026 / 06:00 PM IST

LLB, పీజీ పరీక్షలు.. 107 మంది గైర్హాజరు

NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్ఎల్బీ 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థులకు 1,825 మంది హాజరు కాగా, 107 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

March 2, 2026 / 05:58 PM IST

మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు మండలం తోగుమ్మిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేసారు .HDBFS-WASHI ప్రోత్సాహంతో సుమారు రూ. 17లక్షల అంచనాతో నిర్మించబడనున్న డైనింగ్ రూమ్ నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించాలని సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

March 2, 2026 / 05:58 PM IST

స్వామివారి సేవలో బాంబే హైకోర్టు న్యాయమూర్తి

CTR: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజుషా దేశ్ పాండే కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ వాసు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి‌ పాల్గొన్నారు.

March 2, 2026 / 05:57 PM IST

తిరుపతిలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

TPT: మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. మహిళల సాధికారత, భద్రత, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళా రక్షణ, సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

March 2, 2026 / 05:55 PM IST

మేమంతా సేఫ్: మంచు విష్ణు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా సినీ నటుడు మంచు విష్ణు దుబాయ్‌లో చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో, తన కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు విష్ణు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికీ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ, ఇక్కడ జనజీవనం ప్రస్తుతం సాధారణంగానే ఉందంటూ ట్వీట్ చేశాడు. పరిస్థితులు చక్కబడిన వెంటనే వీలైనంత త్వరగా ఇండియాకు తిరిగి వస్తామని పేర్కొన్నాడు.

March 2, 2026 / 05:55 PM IST

‘రైతులు ఎరువులు కోసం ఆందోళన చెందవద్దు’

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు శ్రీ వెంకటలక్ష్మి ఫర్టిలైజర్స్‌లో 555 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు ఏవో వాణి సోమవారం తెలిపారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. మండలంలో సరిపడా నిల్వలు ఉన్నాయని అర్హులైన రైతులందరికీ ఎరువులు అందుతాయని ఆమె అన్నారు.

March 2, 2026 / 05:54 PM IST

‘ఆడపిల్లలకు న్యాయం చేయాలి’

AKP: నక్కపల్లి మండలం మూలపర్రు గ్రామానికి చెందిన నిర్వాసితుల కుటుంబాల్లో 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలు, వివాహం అయిన ఆడపిల్లలకు న్యాయం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం అప్పలరాజు, పార్టీ నాయకుడు ఎం రాజేష్ వినతిపత్రం అందజేశారు. వారికి పునరావాస ప్యాకేజ్ అందజేయాలన్నారు.

March 2, 2026 / 05:53 PM IST

‘రేణుక ఎల్లమ్మ తల్లి జాతరను జయప్రదం చేయండి’

BDK: చర్ల మండలం లక్ష్మి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుని గుట్టలపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆలయ పూజారి మడకం దేవ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివాసి సాంప్రదాయ నృత్యాలతో రంగ రంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

March 2, 2026 / 05:53 PM IST

సీతానగరంలో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు

SRPT: మునగాల మండలం సీతానగరం గ్రామంలో పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా సోమవారం డ్రైనేజీ పూడికతీత పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ వీరయ్య స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం, సాధారణ రోజుల్లో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించకుండా, దుర్వాసన రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

March 2, 2026 / 05:53 PM IST