• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విజయ్ దేవరకొండ దంపతులకు విశేష్ తెలిపిన కలెక్టర్

సినీ హీరో విజయ్ దేవరకొండ రష్మికలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు విషెస్ చెప్పారు. బల్మూర్ మండలంలోని తుమ్మన్ పెట్ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ సతి సమేతంగా హాజరై విజయ్ దేవరకొండ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.

March 2, 2026 / 08:35 PM IST

ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: జేసీ

ATP: జిల్లాకు కేటాయించిన హౌసింగ్ లక్ష్యాన్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16,702 ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల బిల్లుల నమోదు చేయాలని సూచించారు.

March 2, 2026 / 08:34 PM IST

ఏటుకూరు బైపాస్ వద్ద పీడీఎస్ బియ్యం స్వాధీనం

GNTR: ఏటుకూరు బైపాస్ జంక్షన్ వద్ద విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మినీ లారీతో పాటు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై 6A కింద కేసు నమోదు చేయాలని అధికారుల ఆదేశాలతో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో లారీ యజమాని, డ్రైవర్ మరియు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

March 2, 2026 / 08:33 PM IST

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

MDK: శివంపేట కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాల వార్షికోత్సవ వీడ్కోలు వేడుకలను నిర్వహించగా, పాఠశాల విడిచి వెళ్లే సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ వారికి ప్రేరణాత్మక సందేశం అందించారు.

March 2, 2026 / 08:33 PM IST

‘ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలి’

VKB: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లతో పాటు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం,పెన్షన్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

March 2, 2026 / 08:33 PM IST

ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన అమృత్ స్వచ్ఛ కృష్ణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ బ్లాటింగ్ ప్లాంట్‌ను కలెక్టర్ బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వం లక్ష్యమని, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తుందన్నారు.

March 2, 2026 / 08:31 PM IST

ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరిన వృద్ధురాలు

WGL: వరంగల్ నగరానికి చెందిన మీసాల కళావతి అనే వృద్ధురాలు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారదకు వినతిపత్రం అందజేశారు. తాను గత 25 సంవత్సరాలుగా స్వంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద తనకు గృహం మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

March 2, 2026 / 08:30 PM IST

‘పెదప్రోలులో పాత విద్యుత్ స్థంభాలు తొలగించండి’

కృష్ణా: మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలులో పాత ఇనుప విద్యుత్ స్థంభాలు ఎక్కడివి అక్కడే వంచి వదిలేశారు. ప్రధాన రహదారి పక్కన నూతన సిమెంట్ స్థంభాలు వేయించిన విద్యుత్ శాఖ అధికారులు పాత ఇనుప స్థంభాలు తొలగించలేదు. దీంతో రోడ్డు పక్కన ఇనుప స్థంభాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత స్థంభాలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 2, 2026 / 08:30 PM IST

రాహుల్ గాంధీని కలిసిన..MLG జిల్లా అధ్యక్షుడు

MLG: వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన జిల్లా DCC జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత, MP రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా MLG జిల్లా DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాటు పడే వారిని అనునిత్యం ఖండించాలని రాహుల్ గాంధీ అన్నారు.

March 2, 2026 / 08:28 PM IST

కంగ్టిలో కామ దహనం మహోత్సవం

SRD: కంగ్టిలో కామ దహన మహోత్సవం సోమవారం రాత్రి గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయ ప్రకారంగా స్థానిక పోలీస్ పటేల్ శివాజీ రావు ఇంటి నుంచి బాజా తో ఊరేగింపుగా స్థానిక ప్రధాన కూడలి కాముడి కంతకు వచ్చారు. ఇక్కడ పిడకలతో పేర్చిన కాముడికి పూజలు చేసి అనంతరం దహనం చేసి, కాముడి చుట్టు ప్రదక్షిణలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.

March 2, 2026 / 08:28 PM IST

ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ తరగతి చదువుతున్నారు భవిష్యత్తులో ఏమవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుసుకున్నారు. కొంతమందిని పాఠాలు చదివిస్తూ వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు.

March 2, 2026 / 08:26 PM IST

మైనారిటీ యువతకు ఉచిత టైలరింగ్ శిక్షణ

GDWL: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మైనారిటీ యువతులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి నుషిత తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్‌లోని మైనారిటీ శాఖ కార్యాలయం (రూమ్ F-8) వద్ద దరఖాస్తులు సమర్పించాలి.

March 2, 2026 / 08:26 PM IST

నల్గొండ క్రాస్ రోడ్ వద్ద జిగ్ జాగ్ బారికేడ్ల ఏర్పాటు

NLG: నార్కట్ పల్లిలోని నల్గొండ చౌరస్తా వద్ద భారీ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఇవాళ జిగ్ జాగ్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల క్రాస్ రోడ్డు వద్ద ఓ వాహనం షాపులోకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై విష్ణుమూర్తి ఈ చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని అధికారులు సూచించారు.

March 2, 2026 / 08:25 PM IST

ఈ- ఆఫీస్ ప్రారంభించిన జలమండలి ఎండీ

HYD: జలమండలి అన్ని కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఈ- ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.

March 2, 2026 / 08:24 PM IST

ఇరాన్.. బ్రహ్మాస్త్రాలు

ఇరాన్ తన అమ్ములపొదలోని బ్రహ్మాస్త్రాలను బయటకు తీస్తోంది. ఒక్కో ఆయుధం ఒక్కో ప్రత్యేకత ఉంది కావడమే కాకుండా.. ఎంతో గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్‌ని సైతం అవలీలగా చేధించే శక్తి ఉండటంతో ఇజ్రాయెల్ ఆత్మరక్షణలో పడింది. ఇరాన్ వద్ద 3 శక్తిమంతమైన క్షిపణులు ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లేవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఉపయోగించే పనిలో ఉందని సమాచారం.

March 2, 2026 / 08:24 PM IST