మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక ఎస్సై ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్పీ వెంట మునగాల సీఐ, ఎస్సై ఉన్నారు.
SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన షార్ట్ వీడియోపోటీల విజేతలకు సీపీ రష్మీ పెరుమాళ్ బహుమతులు అందజేశారు. ప్రముఖ వినోద సంస్థ ‘వండర్లా’ ఉచిత ప్రవేశ కూపన్లను స్పాన్సర్ చేయగా.. వాటిని విజేతలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0’ను ప్రారంభిస్తూ సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వీడియోలు రూపొందించి యువత భాగస్వాములు కావాలని అన్నారు.
PDPL: కార్మిక కుటుంబాలకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని, రామగుండం సింగరేణి సంస్థ GM లలిత్ కుమార్ అన్నారు. అధికారులతో కలిసి గోదావరి నది సమీపంలోని ఇంటెక్ వెల్‌ను పరిశీలించి మాట్లాడారు. మేడిపల్లి OCP నుండి నీటిని గంగానగర్ ఫిల్టర్ ఫిల్టర్ బెడ్‌కు పంపింగ్ చేస్తామని, OCP-5లో బోర్లు వేసి ఆ నీటిని సరఫరా చేస్తామన్నారు
PDPL: బాలికలు అన్ని రంగాలలో ముందుండాలని ఓదెల తహసీల్దార్ ధీరజ్ అన్నారు. ఓదెల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇవాళ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. సమాజంలో ఆడపిల్లల ప్రాముక్యాన్ని వివరించారు.
ASR: పాడేరు మండలం వంటలమామిడి పంచాయతీ పరిధిలోని మెట్టూరు గ్రామంలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలని స్థానికులు బుధవారం డిమాండ్ చేశారు. గ్రామంలో వేసిన కొళాయికి నీరు రాకపోవడంతో పాడుబడ్డ నుయ్యి నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రుల పాలవుతున్నామని తెలిపారు.
VZM: మహిళలకు ‘నానీ కేర్ సర్వీసెస్’ సర్టిఫికేట్ కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ బి. రెబెక్కా శామ్యూల్ తెలిపారు. శిక్షణ కోర్సు కాల పరిమితి 6 నెలలు, కోర్సు పూర్తి చేసిన వారికి విదేశాలలో ఉద్యోగవకాశాలు ఉంటాయాన్నారు. 10 పాసై, 25 నుండి 50 వయసు ఉన్న మహిళలు అర్హులన్నారు. వివరాలకు 8333921338 సంప్రదించాలన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలో జనసేన నేత మహేష్‌పై అద్దె బకాయిల వివాదం వెలుగుచూసింది. హోటల్, ఇంటి అద్దెలను లక్షల్లో చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారని బాధితులు సుధాకరరెడ్డి, మునిరత్నం ఆరోపించారు. అద్దె గురించి అడిగితే గొడవపడుతున్నారని పేర్కొంటూ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేశారు. లాడ్జిలో హోటల్‌కు, అలాగే నీరుగట్టుపల్లిలోని ఇంటికి అద్దె బకాయిలు ఉన్నట్లు తెలిపారు.
TG: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ వెంట డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి ఉన్నారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత దేశంగా మార్చడంపై చర్చిస్తున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్ జీ సహా పలువురు నేతల లొంగుబాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం.
HYD: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో మార్చి 6 నుంచి 31 వరకు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
VSP: కేజీహెచ్ ఆసుపత్రి పిల్లల విభాగానికి అవసరమైన పరికరాలను ఎగస్ట్రా మైల్ ఫౌండేషన్ డాక్టర్ నీతాష రూ.2 లక్షల విలువైన సామగ్రిని సూపరింటెండెంట్ వాణీకి అందజేశారు. ఈ పరికరాలు నవజాత శిశువులకు మెరుగైన శ్వాస సహాయక చికిత్స అందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. దాతల సహకారంతో కేజీహెచ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, ఆళ్లగడ్డ ఎస్డీపీవో ఆదేశాల మేరకు రుద్రవరం పోలీసులు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వివిధ మండలాల్లో రైతుల బోర్ల వద్ద విద్యుత్ వైర్లను కట్ చేసి దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ డీ. రాము వెల్లడించారు.
HNK: ఎల్కతుర్తి మండల కకేంద్రానికి చెందిన బొంకురి యాదగిరి దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో, స్వదేశానికి రావాల్సిన యాదగిరి అక్కడే ఉండిపోయినట్లు బుధవారం కుటుంబీకులు తెలిపారు.కొన్నేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆయన, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
VKB: బషీరాబాద్ మం. నవల్గలో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. బుధవారం ఉదయం నుంచే గ్రామ యువకులు, చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిన్న చంద్రగ్రహణం ఉండటంతో శాస్త్రోక్తంగా వేడుకలను వాయిదా వేసుకున్నట్లు గ్రామ యువకులు తెలిపారు. గ్రహణం వీడిన తర్వాత ఈరోజు ఉదయం హోలీ జరుపుకోవడం శుభపరిణామమని వారు పేర్కొన్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్‌లోని కొత్తబస్తీలో మురుగు కాలువలు తరచుగా బ్లాక్ అవుతూ, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్యలపై బుధవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు లైన్ తరచుగా మూసుకుపోతున్నందున కొత్త లైన్ వేయడానికి అంచనా (ఎస్టిమేట్) సిద్ధం చేసి ప్రాధాన్యతతో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
TG: తెలంగాణ పోలీసులకు మావోయిస్టు అగ్రనేత టచ్‌లోకి వచ్చారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవ్ జీ లొంగిపోయిన సమయంలో గణపతి ఆచూకీ పోలీసులు కనిపెట్టిన విషయం తెలిసిందే.