• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆవుల మందపై పెద్దపులి దాడి

JGL: పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం మోత్కరావుపేట గ్రామ శివారులోని చెరువు వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, వారం రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో పులి మళ్లీ సంచరించడాన్ని ధృవీకరించారు. శనివారం తెల్లవారుజామున మోత్కరావుపేట సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది.ఈ ఘటనలో మూడు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి.

February 28, 2026 / 02:02 PM IST

లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు మరోసారి వ్యాఖ్యలు చేశారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి నైవేద్యం పెట్టారని ఆరోపించారు. ప్రజలకే కాదు దేవుడికి కూడా ద్రోహం చేయాలనుకున్నారని మండిపడ్డారు. దేవుడిని తాను బజారులోకి లాగాలనుకోలేదని పేర్కొన్నారు. కానీ, జరిగిన తప్పులను ప్రజలకు వివరించానని వెల్లడించారు. 

February 28, 2026 / 02:02 PM IST

టైలర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NZB: జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘టైలర్స్ డే’ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాదాసీదా వస్త్రానికి చక్కని ఆకారాన్ని ఇచ్చి, సమాజంలో మన అందాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే శిల్పులు టైలర్లు అని కొనియాడారు. వారి వృత్తి నైపుణ్యం అభినందనీయమన్నారు.

February 28, 2026 / 02:02 PM IST

‘పెన్షన్ల పంపిణీ 87 శాతం పూర్తి’

NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలో ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. నేడు నగదు అందని వారికి సోమవారం అందించనున్నారు. పట్టణ వ్యాప్తంగా నేడు 87 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

February 28, 2026 / 02:02 PM IST

‘ఇంటి వద్దకే భద్రాచలం తలంబ్రాలు’

NLG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక సేవలను తెచ్చినట్లు దేవరకొండ డిపో మేనేజర్ విజయకుమారి శనివారం తెలిపారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు. భక్తులు రూ. 151 చెల్లిస్తే ఇంటి వద్దకు అందించడమే లక్ష్యమని తెలిపారు. బుకింగ్ కోసం ఆర్టీసీ కార్గోలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 02:02 PM IST

జన్నారంలో జాతీయ సైన్స్ దినోత్సవం

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సివి.రామన్ ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన రోజు సందర్భంగా శనివారం జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడా, తదితర గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు.

February 28, 2026 / 02:01 PM IST

‘పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించాలి’

విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్, మధురవాడ ఐటీ పార్కులకు కార్మికుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని సూచించారు.

February 28, 2026 / 02:00 PM IST

విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాస పెంచాలి:జేసీ

SKLM: విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మంది విద్యార్థులు రూపొందించిన 175 వినూత్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, విద్యార్థుల మేధోసంపత్తిని అభినందించారు.

February 28, 2026 / 02:00 PM IST

బెస్తవారిపేటలో మీడియా సమావేశం నిర్వహించిన కేపీ

ప్రకాశం: బేస్తవారిపేటలో శనివారం కుందూరు నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మాజీ సీఎం జగన్ ఎప్పుడు చెప్పలేదని రెండు టన్నెల్స్ పూర్తయితే వాటిని జాతికి అంకితం చేశామన్నారు. అలానే మార్కాపురం జిల్లాని ప్రకటించినప్పుడు దర్శి నియోజకవర్గాన్ని జిల్లాలో కలుపుకోకపోవడంపై ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశ్నించలేదని కేపీ విమర్శించారు.

February 28, 2026 / 02:00 PM IST

ఎమ్మెల్యే నివాసంలో 3వ తేదీ హోలీ సంబరాలు

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో మార్చి 3న హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు, యువతి, యువకులు పాల్గొనవచ్చు. రంగులు తెచ్చుకునే వారు ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. హానికరమైన గంధం, శుద్ధ పొడి వాడొద్దని ఆయన కోరినట్లు సమాచారం.

February 28, 2026 / 01:59 PM IST

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?

గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువగా వచ్చే వాళ్లు వేగంగా తినడం మానేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. భారీగా ఒకేసారి తినడం కంటే రోజులో చిన్న చిన్న మోతాదులో తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం తిన్న వెంటనే పడుకోకుండా కనీసం కొద్దిసేపు నడవాలి. టీ, కాఫీ ఎక్కువగా తాగడం తగ్గించాలి. బంగాళాదుంప, క్యాబేజీ, బీన్స్ లాంటి గ్యాస్ పెంచే పదార్థాలు పరిమితిలోనే తీసుకుంటే కడుపు ప్రశాంతంగా ఉంటుంది.

February 28, 2026 / 01:55 PM IST

జామాయిల్ తోటలో చెలరేగిన మంటలు

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం కంపార్ట్మెంట్ 1139 ఆటవిలోని జామాయిల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో తోటలో దట్టమైన పొగతో మంటలు వస్తుండగా, సమీపంలోని లాలు తండా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

February 28, 2026 / 01:53 PM IST

హంద్రీనీవా కాలువలో గుర్తు తెలియని మృతదేహం

సత్యసాయి: కొత్తచెరువు మండలంలో హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన ఒక గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 01:52 PM IST

‘తల్లిదండ్రులు ప్రోత్సహించాలి’

CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సదుం ఎస్సై విష్ణు నారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో కలిసి శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నట్టు ఎస్సై చెప్పారు. బాలికలు ఉన్నత చదువులు చదివేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలన్నారు.

February 28, 2026 / 01:50 PM IST

అంబటి రాంబాబుకు నోటీసులు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కళ్యాణదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు 41ఏ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్ లలో రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. కాగా, ఇటీవల అంబటి జైలుకెళ్లి విడుదలైన విషయం తెలిసిందే.

February 28, 2026 / 01:49 PM IST