KDP: పులివెందుల రూరల్ సీఐగా శాంతి లాల్ నియమితులయ్యారు. ఆయన శనివారం పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో ఉన్న వెంకటరమణ ఏసీబీ అధికారులకు పట్టుబడి రిమాండులో ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
సిద్దిపేట: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పుల్ల కార్తీక్ శనివారం సిద్దిపేట పర్యటనకు విచ్చేశారు. హరిత మినర్వా హోటల్లో కలెక్టర్ కె.హైమావతి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా కోర్టులో న్యాయశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి న్యాయపరమైన అంశాలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జడ్జి పాల్గొన్నారు.
BDK: ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా శనివారం అశ్వరావుపేట మండల కేంద్రంలో యూనియన్ సభ్యులు నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై టైలర్ లను అభినందించారు. MLA జారే ఆదినారాయణ హాజరై టైలర్ లను అభినందించారు. పేద కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరలక్ష్మి, ఉమాదేవి ఇరువురికి తన సొంత నిధులతో రెండు కుట్టు మిషన్లు అందజేశారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం తెలిపారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం అర్చకులు అందజేయగా, స్వామివారి లడ్డు ప్రసాదం ఆలయ అధికారులు అందజేశారు.
కోనసీమ: గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లిలో రూ. కోటి 20 లక్షలతో నూతనంగా చేపట్టిన ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీర మల్లిబాబు, జెడ్పీటీసీ దొండపాటి అన్నపూర్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
VKB: తాండూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా విజ్ఞానోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు శాస్త్రీయ నమూనాలు, వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలతో ఆకట్టుకున్నారు. పర్యావరణం, సాంకేతికత, ఆరోగ్య అవగాహన అంశాలపై ప్రాజెక్టులు ప్రశంసలు అందుకున్నాయి.
HNK: భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కాజీపేట బాలవికాసలో నిర్వహించిన శుద్ధికరణ కమిటీల మహాసభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. బాలవికాస ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
TPT: తూకివాకం పంచాయితీ పరిధిలోని ఎస్.ఎన్.పురంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పెన్షన్లు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
SRPT: సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని మునగాల తహసిల్దార్ సరిత అన్నారు. శనివారం మునగాల గ్రామపంచాయతీ ఆవరణంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాల వారు సోదరభావంతో మెలగాలని సూచించారు.
CTR: పూతలపట్టు ఏఎస్సై శేఖర్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఇవాళ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్‌లో శనివారం నిర్వహించారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పదవీ విరమణ అనంతరం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎప్పటికీ పోలీసు కుటుంబంలో భాగమేనని, ఏ అవసరమొచ్చిన తాము అండగా ఉంటామని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ADB: నార్నూర్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణలు, మోడల్స్, ప్రదర్శనలు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటారు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, శాస్త్ర సాంకేతిక ప్రగతిపై ఉపాధ్యాయులు వివరించారు. ‘విజ్ఞానమే అభివృద్ధికి పునాది’ అని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
NRML: ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం12 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఎంహెచ్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ పట్టణం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ఎస్సీలకు 12 లక్షల అభయ హస్తం ప్రకటించి నేటికి రెండు సంవత్సరాలు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు.
SRCL: రైతులకు రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం నాయకులు శనివారం తసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంటయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు పనులు ప్రారంభ దశలోనే రైతులకు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతు బంధు విడుదల చేసరన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌లుగా మునిసిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, డైరెక్టర్‌లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
SRD: మున్సిపాలిటీలో ఆస్తి, వాణిజ్య, కుళాయి పన్నులు మార్చి 31లోపు పూర్తిగా చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ ద్వారా కూడా పన్నులు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.