ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 50 వేల మంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహ్రెయిన్‌లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తలస్నానం తర్వాత జుట్టు విషయంలో జాగ్రత్తలు అవసరం. తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల చిక్కులు పడి వెంట్రుకలు రాలుతాయి. అలాగే కుదుళ్లు బలహీనంగా ఉన్నప్పుడు దువ్వడం, జడ వేయడం మంచిది కాదు. హెయిర్ స్ప్రేలను నేరుగా జుట్టుపై వాడకూడదు. వాటిలోని ఆల్కహాల్ హాని చేస్తుంది. కాబట్టి స్ప్రేను ముందుగా చేతుల్లోకి తీసుకుని, ఆపై జుట్టుకు రాసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
MNCL: డీజే సౌండ్స్ వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో అమల్లో మద్యపానం ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు CP అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కూడా ఏప్రిల్ 1వ తేది వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో జరిగిన సద్గురు శబరిమాత ఆశ్రమ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. శబరిమాత భక్తుడిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు భక్తి మార్గంలోనే నడవాలని ఆన్‌లైన్ యుగాలకు పిల్లల్ని దూరం ఉంచాలని అన్నారు.
HYD: బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్టు ప్రకారంగా వారం రోజుల్లో 24 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తించి, కఠిన చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం కారణంగా ప్రాణాలే పోవచ్చన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రాథమిక పాఠశాలలో రామా గౌడ్ సేవలు మరువలేనివని MEO హనుమంతు కొనియాడారు. ఆదివారం జరిగిన పదవీ విరమణ మహోత్సవంలో MEO పాల్గొన్నారు. విద్యార్ధుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో రామా గౌడ్ కీలక పాత్ర పోషించారన్నారు. వృత్తిలో చేసిన మంచి పనులే ఎల్లకాలం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
కడప: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. అలాగే ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ఉంటుంది. కడప జిల్లా వినియోగదారులు 08562-242457కు సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వల్లూరి హాసిని ప్రియ ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైనట్లు హెచ్ఎం పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. పాఠశాలలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. మెట్రో రైలులో అగ్ని ప్రమాదం నివారణ చర్యలు అనే అంశంపై అవార్డుకు ఎంపికైన హాసినికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ రూ.10 వేలు బహుమతిగా అందిస్తారన్నారు.
MDCL: జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాకపోవడంపై పోలీసులు వాహనదారులను ప్రశంసించారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన రిపోర్టును విడుదల చేశారు. ఏ ఒక్కరు మద్యం సేవించి వాహనం నడపలేదన్నారు. ఇదేవిధంగా కొనసాగాలని సూచించారు.
అన్నమయ్య: మదనపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్‌కు 53 మెట్రిక్ టన్నుల టమాటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమాటాలు 10 కిలోలకు రూ.125, రెండో రకం రూ.100, మూడో రకం రూ.90 ధర పలుకుతున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో ఆదివారం గోల్డెన్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రాజు ఎల్తూరి సమక్షంలో ప్రజలకు ఉచిత గుండె, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండారు నరేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
BHPL: మల్హర్రావు మండలం నాచారం గ్రామంలోని 1వ వార్డులో కొద్దిరోజుల క్రితం మంచినీటి బోరు బావిలో విద్యుత్ మోటార్ చెడిపోవడంతో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆదివారం సర్పంచ్ వనమ్మ ఆధ్వర్యంలో కొత్త మోటార్ బిగించి సమస్యను త్వరగా పరిష్కరించారు. వేసవి కాలంలో వార్డు ప్రజలకు నీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న సర్పంచుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోనీ ఆర్మూర్ మండలం ఫతేపూర్‌లో మానవ హక్కుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సర్పంచ్ ప్రణుక-నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సామాన్యులకు చట్టాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
KMM: చింతకాని మండలం తిమ్మినేనిపాలెం మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూ నాగులవంచ వద్ద మరొక వాహనాన్ని ఓవర్టేక్ చెయ్యబోయి ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్న ఇంటర్ విద్యార్థి శ్రీరాం (17) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీరాం బోనకల్ మండల పరిధిలోని గార్లపాడు వాసిగా గుర్తించారు.
NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయ పురోగతికి సహకారం అందిస్తామన్నారు.