NLR: నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు వరికుంటపాడు నరసింహపురం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాసాన్ని ఆలయ నిర్వహకులకు బుధవారం అందజేశారు. గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవులను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు.
KMM: ముదిగొండలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఉన్నారు. భవనం దుస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు త్వరలోనే మరమ్మతులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టా ఉపేందర్ పాల్గొన్నారు.
SRD: దివ్యాంగులకు బడ్జెట్లో 5% నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్న 6000 పింఛన్ ఇస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు.
ELR: ముసునూరు(మం) సూరేపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ఈ దాడులలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, రూ. 8700 నగదు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
SDPT: దుబ్బాక మండలం ధర్మాజీపేటలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ కోనేరును గ్రామ యువత పునరుద్ధరించారు. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన కోనేరును, ఆలయ పరిసరాలను యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా శుభ్రం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ పునఃప్రక్షాళన చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుతారి సందీప్ తెలిపారు.
అన్నమయ్య: రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల వైపు మళ్లాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ వినియోగంపై సూచనలు చేసి, భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KRNL: తుగ్గలి(మం) రేల్లపాడు తాండలో రీ న్యూ ప్రైవేట్ విండ్ పవర్ కంపెనీ రైతులు నాగేంద్ర నాయక్, సురేష్ నాయక్‌ల పొలాల్లో హెన్డీ లైన్లు వేయడానికి ప్రయత్నించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. కంపెనీకి వత్తాసు పలుకుతున్న తుగ్గలి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
ASR: సిబ్బంది నియామకాలతో జీసీసీని బలోపేతం చేయాలని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన అమరావతి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ను కలిసి జీసీసీలోని సిబ్బంది కొరత, పరిపాలన, నిర్మాణాత్మక సమస్యలపై చర్చించారు. జీసీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జీసీసీ గోదాములు, డిపోలను మరమ్మత్తులు చేయాలని తెలిపారు.
BDK: జూలూరుపాడ్ మండలం గుండెపుడి గ్రామం నందు శిదిలావస్థలో ఉన్న పశువుల ఆసుపత్రి ని వెటర్నరీ డాక్టర్ సాయి సందీప్‌తో కలిసి దుద్దుకూరి సుమంత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో సుమంత్ చరవాణి ద్వారా ఆసుపత్రి భవనం స్థితిగతులను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన భవన నిర్మాణం చేపట్టాలని అధికారులు ఆదేశించారు.
AKP: రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ డీఆర్వో, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సేవలలో సమయపాలన, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను కట్టుదిట్టం చేయాలన్నారు.
MDK: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పి మహేందర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను మహేందర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, మెడికల్ ఎమర్జెన్సీ టీములు, విద్యార్థులకు కల్పించిన కనీస వసతులను పరిశీలించారు.
NZB: గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ప్రధానమైన ఈ పుష్కర ఘాట్‌ను బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.
ASR: యువతలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తుందని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ అన్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 83 మంది యువత పాల్గొని 50 ఇయర్స్ ఎమర్జేన్సీ, లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అంశంపై మాట్లాడారు.
TG: యాదగిరిగుట్ట ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి యాదగిరిగుట్టలో టెంట్లు కూలిపోయాయి. దీంతో అధికారులు మళ్లీ పునరుద్దరణ పనులను చేపట్టారు. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
KDP: బద్వేల్ పరిధిలోని పూల బావివీధిలో జరుగుచున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ కమిషనర్ వీ.వీ. నరసింహ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. డ్రైనేజ్లలో నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.