• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గూళ్యం స్వామి జాతరలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ

KRNL: హలహర్వి మండలం, గూళ్యం గ్రామంలో నిర్వహించిన శ్రీ గాదిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివ ప్రసాద్ స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ.. సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ప్రార్థించారు.

February 23, 2026 / 07:17 PM IST

W.G: దివ్యాంగుని పింఛన్ కోసం విన్నపం..!

W.G: నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన చేరుగొండి రాజ్ కుమార్ సోమవారం ఆర్డీవో దాసిరాజుకు వినతిపత్రం సమర్పించారు. తన కుమారుడు ప్రభాకర్ (6)పుట్టుకతోనే 90 శాతం శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని, మెడికల్ బోర్డు ధ్రువీకరణ ఉన్నా పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం స్పందించి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.

February 23, 2026 / 07:17 PM IST

‘సేవ భావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం’

BHPL: జిల్లా BJP కార్యాలయంలో ఇవాళ BJP జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి అధ్యక్షతన ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026’ జిల్లా స్థాయి కార్యశాల జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ధర్మారావు హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ సంస్థకు మూలాధారమని, సిద్ధాంత నిబద్ధత, నిస్వార్థ సేవా భావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.

February 23, 2026 / 07:16 PM IST

4 గంటలకు పైగా కొనసాగుతోన్న కేబినెట్

TG: రాష్ట్ర మంత్రివర్గం భేటీ ఇంకా కొనసాగుతోంది. దాదాపు 4 గంటలకు పైగా మంత్రులు చర్చిస్తున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై, రైతు భరోసా నిధులు విడుదలపై మంత్రులు చర్చిస్తున్నారు. GHMC, MPTC, ZPTC ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. 

February 23, 2026 / 07:16 PM IST

విశాఖలో మాక్ డ్రిల్ విజయవంతం

VSP: అత్యవసర పరిస్థితుల్లో సమన్వయ స్పందనను పరీక్షించేందుకు హెచ్‌పీసీఎల్‌, విశాఖ డిస్పాచ్ స్టేషన్, విశాఖ రిఫైనరీ సంయుక్తంగా నరవగ్రామం వద్ద లెవల్–3 ఆఫ్‌సైట్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. అగ్నిప్రమాదం, ఉత్పత్తి లీకేజీ పరిస్థితులను అనుకరించి అలర్ట్ వ్యవస్థ అమలు, అగ్ని నియంత్రణ, ప్రజల తరలింపు చర్యలను సమన్వయంతో ప్రదర్శించారు.

February 23, 2026 / 07:15 PM IST

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వాష్ శిక్షణ

విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో APMAS ఎన్జీవో సహకారంతో మెప్మా ఆధ్వర్యంలో WASH (నీరు, పరిశుభ్రత, ఆరోగ్యం) పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.వి. చిట్టిరాజు పాల్గొని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రత ముఖ్యమని పేర్కొన్నారు.

February 23, 2026 / 07:15 PM IST

నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

WNP: జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణ పనులు, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సో మనం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో తలపెట్టిన నిర్మాణ పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

February 23, 2026 / 07:15 PM IST

‘విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుంది’

NRML: పట్టణంలోని ఓ పాఠశాలలో సోమవారం జిల్లా ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈవో భోజన్న హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని, కఠినతరమైన అంశాలపై నైపుణ్యత వస్తుందని అన్నారు.

February 23, 2026 / 07:15 PM IST

అష్టలక్ష్మి ఆలయ గుడి వద్ద అక్రమ తవ్వకాలు

 తూ.గో: గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని అష్టలక్ష్మి గుడి వెనుక గల ఎర్రమట్టి కొండలను మాఫియా ముఠాలు తవ్వి తరలిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో లారీల్లో మట్టిని రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని వాపోయారు. కొండల మీద చెట్లను నరికివేస్తుండటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 07:14 PM IST

NDL: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

NDL: ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు కొక్కంటి రామకృష్ణ (50) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాచర్ల ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో బూరుగుల గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం ఏర్పడింది, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 07:14 PM IST

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం హుండీ ఎంతంటే..?

CTR: చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ. 59లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. సోమవారం అమ్మవారి హుండీ లెక్కించారు. రూ.59,35,838 నగదు, 38 గ్రాముల బంగారు, 155 గ్రాములు వెండి, విదేశీ కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ వచ్చినట్టు తెలిపారు. ఈ మొత్తం 45 రోజుల్లో భక్తులు అమ్మవారికి హుండీ ద్వారా సమర్పించారన్నారు.

February 23, 2026 / 07:13 PM IST

రేపు విద్యుత్ సరఫరా బంద్

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఏరియా హాస్పిటల్ ఏరియా, వెలమ వీధి, తురకబడి, కొత్త వీధి, గవర వీధి, పాత సంత బయలు, ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. మెయింటినెన్స్ పనుల నిమిత్తం సరఫరా ఆపేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 23, 2026 / 07:13 PM IST

కార్యకర్తల సభకు వెళ్లేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాలీ

నెల్లూరు: కావలి పట్టణంలో RSR కల్యాణ మండపంలో సోమవారం నిర్వహిస్తున్న విస్తృతస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెంకి వెంకటరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో రామిరెడ్డి నివాసం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

February 23, 2026 / 07:12 PM IST

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అన్నమయ్య: PGRS అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో 348 అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి భూమి,దారి,విద్యుత్ సమస్యలపై విజ్ఞప్తులు అందగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

February 23, 2026 / 07:12 PM IST

ఓవర్సీస్ మార్కెట్‌లో ఎన్టీఆర్ సెన్సేషన్..!

NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వార్తలు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా, యూకే హక్కుల కోసం సుమారు రూ.55 కోట్ల అడ్వాన్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది భారీ ఓవర్సీస్ డీల్‌గా భావిస్తున్నారు.

February 23, 2026 / 07:12 PM IST