• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

E.G: పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనం నిర్మాణం చేస్తున్నామని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కొంతమూరులో కేటాయించిన స్థలంలో పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనం నిర్మాణానికి MLA శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.50 వేలు అందిస్తానని తెలిపారు.

February 28, 2026 / 06:39 PM IST

వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌ నగర్: జడ్చర్ల మండలం పోలేపల్లి ZPHS గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన గొప్ప క్రీడాకారుడు అమృత లింగం చిన్న వయసులో మరణించారు. వారి స్మారకార్థంతో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడలో రాణించాలన్నారు.

February 28, 2026 / 06:38 PM IST

T20 WC: పాకిస్తాన్‌పై టాస్ గెలిచిన శ్రీలంక

పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం 65 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కాగా, శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

February 28, 2026 / 06:38 PM IST

రాహుల్ గాంధీ, రేవంత్ రాక.. ఎస్పీ పటిష్ట బందోబస్తు..!

VKB: మార్చి 2న జిల్లాకు విచ్చేయనున్న వీఐపీల పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతగిరిలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

February 28, 2026 / 06:38 PM IST

పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!

CTR: గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 89.76% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశామని, మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు.

February 28, 2026 / 06:36 PM IST

‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి’

KMM: మధిర మండలం నాగవరప్పాడు ఎంపీపీఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం జరిపారు. సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు జరిపారు. ప్రధానోపాధ్యాయులు పురం సంగారావు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సీహెచ్వి రవికుమార్, లింగయ్య, వీవీఎన్ రాజు పాల్గొన్నారు.

February 28, 2026 / 06:34 PM IST

ట్రంప్ కు బానిసగా మారిన మోదీ

E.G: అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని.. ట్రంప్‌కు మోదీ బానిసగా మారారని CPI జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు.

February 28, 2026 / 06:34 PM IST

‘స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం’

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ శైలజ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. వారికి తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

February 28, 2026 / 06:33 PM IST

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలోని ఓడ్రుబంగి గ్రామానికి డోలి రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించడం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 06:32 PM IST

విమానాలు రద్దు.. ప్రయాణికుల ఇక్కట్లు

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 విమానాలు రద్దు అయినట్లు విమానాయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. విమానాలు హఠాత్తుగా రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

February 28, 2026 / 06:32 PM IST

‘విద్యా కమిషన్ నివేదికపై పునరాలోచన చేయాలి’

MLG: రాష్ట్ర విద్యా కమిషన్ నివేదికపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (TPUS) జిల్లా అధ్యక్షురాలు వాంకుడోతు జ్యోతి డిమాండ్ చేశారు. ఇవాళ MLG జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని కమిషన్ పేర్కొనడం ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆమె విమర్శించారు.

February 28, 2026 / 06:32 PM IST

వైఎస్ విజయమ్మను కలిసిన డిప్యూటీ సీఎం

AP: వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ఆర్‌తో అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

February 28, 2026 / 06:31 PM IST

చిత్తు బొత్తు ఆటపై పోలీసుల దాడులు

MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చిత్తుబొత్తు ఆటపై పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేశారు. చిత్తు బొత్తు ఆట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 24,570 లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నలుగురు వ్యక్తులు పారిపోయారని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

February 28, 2026 / 06:30 PM IST

రెవిన్యూ ప్రజలకు చేరువ కావాలి: MLA గంటా

VSP: ఆధునికీకరించిన భీమిలి ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌లో ఎక్కువ ఫిర్యాదులు రెవిన్యూపైనే వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు చేరువ కావాలని అధికారులకు సూచించారు. దివీస్ యాజమాన్యం కార్యాలయానికి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు.

February 28, 2026 / 06:30 PM IST

పలు పాఠశాలలో ఉత్సాహంగా సైన్స్ దినోత్సవం

SKLM: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జలుమూరు మండలం పలు పాఠశాలలో శనివారం ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు చూపించిన అత్యున్నత విజ్ఞానంతో అనేక పరికరాలను చేసి పదిమందికి ప్రదర్శించారు. విద్యర్థుల ప్రగతికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:30 PM IST