• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సాంబయ్య

KNR: శంకరపట్నం మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొలంగూర్‌కు చెందిన పెంట సాంబయ్యను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్యను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాంబయ్య మాట్లాడుతూ.. మండలంలో ఆర్ఎంపీ వ్యవస్థను బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

March 1, 2026 / 09:02 PM IST

‘అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టిబడి ఉంది’

NTR: నందిగామలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 5,000 మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.

March 1, 2026 / 09:00 PM IST

దారుణం.. భర్తను చంపిన భార్య

TG: ఓ మహిళ తన భర్తను హత్యచేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో జరిగింది. మద్యం తాగి హింసిస్తున్నాడని కట్టుకున్న భార్యే.. భర్తను హతమార్చింది. తాగి వచ్చిన భర్త గొడవకు దిగడం విచక్షణ కొల్పోయి దాడి చేసి దీంతో అతడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాని దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 08:57 PM IST

‘మహిళల పట్ల వివక్షత తగదు’

ASR: మహిళల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పాడేరు సీఐ దీనబంధు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్త్రీ రక్షణకు పటిష్ట చట్టాలు ఉన్నాయన్నారు.

March 1, 2026 / 08:55 PM IST

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం

NLG: మిర్యాలగూడలో రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇవాళ ఉత్సాహంగా జరిగింది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల హక్కుల కోసం INTUC ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారంతో పెయింటింగ్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

March 1, 2026 / 08:53 PM IST

ఛైర్ పర్సన్‌కు ఆరెకటిక సంఘం ఘన సన్మానం

BHNG: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆరెకటిక సంఘం అధ్యక్షులు హీరే కార్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకటిక సంఘం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మాలిక వసతుప అభివృద్ధిపై ఛైర్మన్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

March 1, 2026 / 08:53 PM IST

జనగామలో భరోసా, షీటీం కేంద్రాల ప్రారంభం

 జనగామ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, షీటీం కేంద్రాలను డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. డీజీపీకి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం భరోసా, షీటీం కేంద్రాల్లోని వివిధ విభాగాలను డీజీపీ పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

March 1, 2026 / 08:52 PM IST

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం అభినందనీయం

VZM: క్యాన్సర్ బాధితుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని అజ్మీర్ నుండి 14 ఏళ్లు దాటిన బాలికలకు ఉచితంగా అందించే హెచ్‌పీవీ టీకా కార్యక్రమం అభినందనీయమని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు ఆదివారం సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆడపిల్లలు టీకా వేసుకునేలా తల్లిదండ్రులు తగిన బాధ్యతలు తీసుకోవాలన్నారు.

March 1, 2026 / 08:51 PM IST

HYDలో కిలో లబ్బ మిర్చి రూ.100

HYDలో లబ్బ మిర్చికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో లబ్బ మిర్చి రూ.100కు విక్రయిస్తున్నారు. సాధారణంగా పచ్చళ్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ మిర్చి ధర ఉప్పల్, ఎల్బీనగర్, అత్తాపూర్, అల్వాల్ ప్రాంతాల్లో దాదాపుగా ఇదే ధర పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే ఎండాకాలంలో పచ్చళ్ల సీజన్ కానుండగా, ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

March 1, 2026 / 08:50 PM IST

మధ్యవర్తిత్వంతో సులువుగా కేసుల పరిష్కారం: సీజేఐ

AP: న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదన్నారు. కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలని సీజేఐ పేర్కొన్నారు.

March 1, 2026 / 08:50 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి

E.G: గోపాలపురం నల్లజర్ల మీనార్ మసీద్‌లో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో MLA మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సామాజిక ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆ అల్లా కరుణాకటాక్షాలతో గోపాలపురం నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి ప్రార్థనలు చేశారు.

March 1, 2026 / 08:49 PM IST

నాగమణి ఎక్స్‌లెన్స్ అవార్డు

W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కాప్పసా ఆధ్వర్వంలో వైజాగ్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో శశి హైస్కూల్ కరెస్పాండెంట్ ఖండాపు నాగమణికి “Most Eminent Women Excellence Award”ను జిల్లా జడ్జి మంగవాణి, RJD విజయ భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రాజు, కార్యదర్శి సుంకర మాణిక్యాలరావు పాల్గొన్నారు.

March 1, 2026 / 08:48 PM IST

మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించిన..MRPS నేతలు

BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఆదివారం MRPS ఆధ్వర్యంలో SC వర్గీకరణ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. SC వర్గీకరణ ఎమ్మార్పీఎస్, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన మిలిటెంట్ పోరాటాల ఫలితమేనని అన్నారు.

March 1, 2026 / 08:48 PM IST

BREAKING: టీమిండియా ముందు భారీ టార్గెట్

టీ20 ప్రపంచకప్ సూపర్‌-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పావెల్ (34*), హోల్డర్ (37*), రోస్టన్ చేజ్ (40), హెట్‌మయర్ (27), హోప్‌ (32) రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు.. వరుణ్, హార్దిక్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 196.

March 1, 2026 / 08:47 PM IST

సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలన

NLG: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మాడ్గులపల్లి మండలం భీమనపల్లిలో నూతనంగా ప్రతిష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతానన్నారు.

March 1, 2026 / 08:46 PM IST