• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ధర్మకర్తలు, అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మానకొండూర్ MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించారు.

February 26, 2026 / 04:30 PM IST

పన్ను వసూళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం వసూళ్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీకి చెల్లించే పన్నులు ప్రధాన ఆదాయ వనరులు అని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో శుభ్రత, వీధి దీపాలు,తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంటి పన్ను చెల్లించాలన్నారు.

February 26, 2026 / 04:27 PM IST

నేటి ఇంటర్ పరీక్షకు 338 మంది గైర్హాజరు

ATP: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 20,855 మంది విద్యార్థులకు గాను 20,517 మంది హాజరుకాగా, 338 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో 1,931 మందికి 1,901 మంది హాజరయ్యారని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు.

February 26, 2026 / 04:26 PM IST

కంభంలో స్మశాన వాటికలకు నేమ్ బోర్డులు ఏర్పాటు

ప్రకాశం: కంభం పట్టణంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పలు స్మశాన వాటికలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ముస్లిం యూత్ సభ్యులు తెలిపారు.

February 26, 2026 / 04:26 PM IST

‘ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ దాడులు సిగ్గు చేటు’

కోనసీమ: ఏపీ శాసన మండలిలో గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని కొత్తపేటకు చెందిన బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం దుయ్యబట్టారు. సీనియర్ సభ్యుడిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. ప్రజలు వైసీపీ పార్టీకి చరమగీతం పాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.

February 26, 2026 / 04:25 PM IST

‘తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి’

ATP: గుంతకల్లు మున్సిపల్ నాన్ పీహెచ్ వర్కర్స్‌తో మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ గురువారం సమావేశం నిర్వహించారు వేసవి కాల దృశ్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోని ఫిల్టర్ బ్లేడ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలో పైప్లైన్ లీకేజీలు, పైప్ లైన్ లలో మురుగునీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 26, 2026 / 04:24 PM IST

‘వాల్టా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి’

VZM: వాల్టా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యావరణ వేత్త, న్యాయవాది బి. రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎస్.కోటలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సమీపంలో అనుమతులు లేకుండా కొంతమంది జెసిబితో భారీ వృక్షాలు తొలగించారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా వృక్షాలు తొలగింపు విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.

February 26, 2026 / 04:24 PM IST

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు రూ.20 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం రూ.5 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని,నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు.

February 26, 2026 / 04:20 PM IST

పూరి జగన్నాథ్, సూర్య కాంబోలో మూవీ?

తమిళ స్టార్ హీరో సూర్య, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో  సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పూరి మార్క్ మేనరిజమ్స్‌తో సిద్ధం చేసిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫలితాల తర్వాత పూరి ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారట. విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమా ముగిశాక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్.

February 26, 2026 / 04:20 PM IST

స్వర్ణాంధ్ర, పీ4 లక్ష్యాల సాధనకు కలెక్టర్ దిశానిర్దేశం

ATP: స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ4 కార్యక్రమాలపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లాలో కీలక అభివృద్ధి సూచికల్లో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

February 26, 2026 / 04:19 PM IST

వనపర్తి ఎంసీహెచ్ తనిఖీ

వనపర్తి పట్టణ శివారులోని నరసింగాయపల్లి ఎంసీహెచ్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో వైద్య సేవలను పరిశీలించారు. అత్యవసర సమయంలో వినియోగించే వెంటిలేటర్ సదుపాయం పనిచేస్తుందో లేదో ఆరా తీశారు. చిన్నపిల్లలకు వెంటిలేటర్ సద్వినియోగం కల్పించాలని ఆదేశించారు.

February 26, 2026 / 04:19 PM IST

యాంకిలో ఘనంగా క్రికెట్ టోర్నీ ప్రారంభం

VKB: దౌల్తాబాద్ మండలంలోని యాంకిలో గురువారం క్రికెట్ టోర్నమెంట్‌ను గ్రామ పెద్దలు వైభవంగా ప్రారంభించారు. సర్పంచ్ ఏ.మాణిక్యప్ప, రవీందర్ రెడ్డి, కోట్ల హన్మంతు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

February 26, 2026 / 04:18 PM IST

మైదుకూరులో నూతన HPCL పెట్రోల్ బంక్ ప్రారంభం

KDP: మైదుకూరులోని బద్వేల్ రోడ్డుపై నూతన HPCL పెట్రోల్ బంకును ఎమ్మెల్యే సుధాకర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రవీంద్ర, 7వ వార్డు కౌన్సిలర్ సుమలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ వెంకటయ్య ఫిల్లింగ్ స్టేషన్‌ను రిబ్బన్ కట్ చేసి, టెంకాయ కొట్టి ప్రారంభించారు. నూతన వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 04:18 PM IST

‘విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి’

AKP: విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది సూచించారు. గురువారం కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలన్నారు. బజార్లో దొరికే జింక్ ఫుడ్స్ జోలికి వెళ్ళవద్దన్నారు. ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 04:17 PM IST

పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేసిన ఎస్పీ

MDK: పోలీస్ శాఖకు IOC ద్వారా రెండు పెట్రోల్ బంకులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ఇందులో భాగంగా ఆవుసులపల్లి వద్ద పెట్రోల్ బంకుకు ఎస్పీ గురువారం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే శంకరంపేట్ (ఆర్)లో ఒక బంకు నిర్మాణం కొసాగుతుందని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

February 26, 2026 / 04:17 PM IST