• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ

కోనసీమ: లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిభిరాన్ని ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ శిబిరంలో సుమారు 600 వందల మందికి వివిధ ఆరోగ్య సమస్యలపై పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.

March 3, 2026 / 04:40 PM IST

పన్ను చెల్లించాలంటూ లబ్ధిదారుల కోరిన ఎంపీడీవో

ELR: ఉంగుటూరు మండలంలో మంగళవారం మూడు గ్రామాల్లో ఎంపీడీవో మనోజ్ ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఉంగుటూరు, చేబ్రోలు, నారాయణపురం గ్రామాలలో ఆయన లబ్ధిదారులు ఇంటికెళ్లి ఇంటి పన్ను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపర్డెంట్ ఆంజనేయ బాబు పంచాయతీ గుమస్తా రంగు స్వరూప పాల్గొన్నారు.

March 3, 2026 / 04:37 PM IST

మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA PO రాహుల్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపిక జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 18 వరకు, అటు తుది ఎంపికలు ITDA (ఉమ్మడి జిల్లా) స్థాయిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 3, 2026 / 04:36 PM IST

వన్యప్రాణులతోనే భవిష్యత్తు: ఎఫ్ఆర్ఓ

MNCL: వన్యప్రాణులు మనిషి భవిష్యత్తుకు ఆధారమని జన్నారం అటవీశాఖ ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్ఆర్ఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తుకు ఆధారం అడవులు, వన్యప్రాణులే అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు ఉన్నారు.

March 3, 2026 / 04:36 PM IST

కనీస వేతనాలు పెంచాలని నిరసన చేపట్టిన CITU

PLD: అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్‌పై కూటమి ప్రభుత్వం దుర్మార్గ అక్రమ అరెస్టులను ఖండిస్తూ అమరావతిలో CITU నిరసన చేపట్టింది. జిల్లా ఉపాధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్దంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కనీస వేతనం పెంచాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.

March 3, 2026 / 04:35 PM IST

విగ్రహం ధ్వంసం.. అదుపులోకి నిందితుడు

ADB: భీంపూర్ మండలం పిప్పలకోటిలోని పెద్దమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విక్రం దర్యాప్తు చేపట్టగా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా చిరంజీవి అనే వ్యక్తిని గుర్తించారు. విచారణలో నిందితుడు మతిస్థిమితం లేక చికిత్స పొందుతున్నట్లు వెల్లడైంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, సమన్వయం పాటించాలన్నారు.

March 3, 2026 / 04:33 PM IST

అంగన్వాడీల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం: నిమ్మల

AP: అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప.గో.జిల్లా పాలకొల్లు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. రూ.5.80 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అంగన్వాడీల 9 డిమాండ్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చిందన్నారు. అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘటన చంద్రబాబుదని కొనియాడారు.

March 3, 2026 / 04:33 PM IST

మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

MHBD: కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామానికి చెందిన గుజ్జ కమలాకర్ ఇటీవల తాడ్వాయి – పస్రా రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో 1996-97 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి మిత్రులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మొత్తం రూ.55,500 సేకరించి, మంగళవారం ఆ కుటుంబానికి డబ్బు అందించి, మనోధైర్యాన్ని కల్పించారు.

March 3, 2026 / 04:33 PM IST

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి సుభాష్

కోనసీమ: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రవాస ఆంధ్రులతో మంగళవారం వీడియో కాల్ మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న పరిస్థితులు వలన అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

March 3, 2026 / 04:33 PM IST

‘డాక్టర్ గూడూరి వైద్య సేవలు YCPకి బలం’

E.G: రాజమండ్రి పార్లమెంటరీ YCP ఇంఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అందిస్తున్న వైద్య సేవ YCPకి ఎంతో బలాన్ని ఇస్తున్నాయని YCP రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజవర్గ నాయకులు మంగళవారం రాజమండ్రిలో డాక్టర్ శ్రీనివాస్‌ను కలిశారు. రానున్న ఎన్నికల్లో YCP అఖండ విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు.

March 3, 2026 / 04:33 PM IST

T20 WC: న్యూజిలాండ్‌పై సఫారీల ఆధిపత్యం

T20 ప్రపంచకప్‌ చరిత్రలో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికాకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. T20 WCలో న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సౌతాఫ్రికాను ఓడించలేకపోయింది. ఈ రెండు జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 సార్లు తలపడగా.. అన్ని సార్లూ సౌతాఫ్రికానే గెలిచింది. దీంతో రేపు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో కూడా సఫారీ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

March 3, 2026 / 04:32 PM IST

అంతర్రాష్ట్ర బైక్ దొంగలు అరెస్ట్

అన్నమయ్య: అంతర్రాష్ట్ర బైక్ దొంగ షేక్ ఆరిఫ్‌ను పీలేరు పోలీసులు అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.40 లక్షల విలువైన 24 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ముగ్గురు రిసీవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం వెల్లడించారు. ప్రజలు వాహనాల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

March 3, 2026 / 04:31 PM IST

ఉరివేసుకొని సింగరేణి కార్మికుడు ఆత్మహత్య

PDPL: గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన భార్గవ్ (27) సింగరేణి కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న భార్గవ్ గత కొంతకాలంగా విధులకు హాజరు కాకపోవడంతో డిస్మిస్ అయ్యాడు. మద్యానికి బానిసై అప్పు చేసి, వీటిని తీర్చలేక మానసిక ఆవేదనకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 3, 2026 / 04:29 PM IST

పెంబర్తిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

JN: పెంబర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన అజ్మీర గణేష్ (21)గా స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

March 3, 2026 / 04:28 PM IST

కాజీపేట రైల్వేట్రాక్ కుంభకోణం.. కేసు నమోదు

TG: కాజీపేట రైల్వేట్రాక్ మెయింటెనెన్స్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నలుగురిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

March 3, 2026 / 04:27 PM IST