• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మార్చి 04: బుధవారం పంచాంగం

➠ తిథి: బహుళ పాడ్యమి సా.4:33 వరకు తదుపరి విదియ ➠ నక్షత్రం: పుబ్బ ఉ.7:37 వరకు, తదుపరి ఉత్తర ➠ శుభ సమయాలు: ఉ.6:17-8:14, ఉ.9:13-10:12, మ.12:33-మ.2:59, సా.4:39-5:02 వరకు ➠ రాహుకాలం: మ.12-1:30 వరకు ➠  యమగండం: ఉ.7:30-9 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.11:46-మ.12:32 వరకు ➠ వర్జ్యం: మ.3:00-సా.4:38 ➠ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు

March 4, 2026 / 12:25 AM IST

హ్యాపీ డేస్‌కి సీక్వెల్.. రెండు కథలు సిద్ధం

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘కుబేర’ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రెండు కథలను సిద్ధం చేస్తున్నాడట. అందులో ఒకటి ‘హ్యాపీడేస్ 2’ అని సమాచారం. ఇప్పటికే ఈ కథ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కథతోపాటు మరో రెగ్యులర్ కథను కూడా రెడీ చేస్తున్నాడట. ఈ రెండు కథల్లో ఏది ముందు ఓకే అయితే అదే కథతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడట.

March 4, 2026 / 12:15 AM IST

హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ దగ్గర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 11:42 PM IST

మనిషి వెంట్రుకలతో ఎరువు తయారీ!

యూపీ గోరఖ్‌పుర్‌కు చెందిన హృతిక్ పంజాబ్ యూనివర్సిటీలో మనిషి వెంట్రుకలతో ఎరువు తయారు చేశారు. హెయిర్ సెలూన్ల నుంచి వెంట్రుకలను పోగుచేసి వాటిని ఎంజైమ్‌లను జోడించి ఎరువును తయారు చేసినట్లు చెప్పారు. వెంట్రుకల్లో నత్రజని, ప్రొటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని, ఈ ఎరువు మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నయంగా తోడ్పడుతుందని పేర్కొన్నారు.

March 3, 2026 / 10:55 PM IST

టీడీపీలోకి 50 కుటుంబాలు చేరిక

CTR: కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన 50 కుటుంబాలు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీని వీడిన వారికి MLC పసుపు కండువాతో స్వాగతం పలికారు. కొత్తపేట నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

March 3, 2026 / 10:26 PM IST

సేతుపతి చిత్రంలో విలన్‌గా సంజయ్ దత్..!

విజయ్‌ సేతుపతి హీరోగా, సంజయ్‌ దత్‌ విలన్‌గా ఒక క్రేజీ కాంబినేషన్ తెరకెక్కబోతున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 3, 2026 / 10:26 PM IST

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

KRNL: పెద్దకడబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్నకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది. మెజిస్ట్రేట్ సుభాష్ ఈ మేరకు తీర్పు వెల్లడించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

March 3, 2026 / 10:22 PM IST

ప్రభ బండిని ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని స్వామి రావులపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని కోరారు.

March 3, 2026 / 10:20 PM IST

చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. నవీన్‌కుమార్‌(11), సాయి(16), వెంకటజోసఫ్‌(16)గా గుర్తించారు. హోలీ ఆడి, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌, వెంకటజోసఫ్‌ మృతదేహాలు లభ్యం కాగా.. సాయి మృతదేహం కోసం గాలింపు కొనసాగుత...

March 3, 2026 / 10:14 PM IST

అక్రమ బెల్ట్ షాపులు తొలగించాలి: సీపీఐ

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గ్రామాలు, మండలాల్లో విస్తరిస్తున్న ఈ షాపుల వల్ల మహిళలు, యువత నష్టపోతున్నారని అన్నారు. అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

March 3, 2026 / 10:02 PM IST

‘అనధికారికంగా బాణసంచా తయారు చేస్తే చర్యలు’

W.G: బాణసంచా విక్రయ దుకాణాలు, తయారీ దారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ హెచ్చరించారు. అనధికారికంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారంగా బాణసంచా విక్రయించినా, అమ్మినా, నిల్వ చేసినా 101కు, లేదా స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

March 3, 2026 / 09:44 PM IST

బొప్పాయి-పెరుగు ఫేస్ మాస్క్ ప్రయోజనాలివే!

✦ మృత చర్మాన్ని తొలగిస్తుంది✦ చర్మానికి సహజ కాంతి అందిస్తుంది✦ మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది✦ మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది✦ చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది✦ యాంటీఆక్సీడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి

March 3, 2026 / 09:42 PM IST

ఇల్లు దగ్ధమైన ఘటనలో మంత్రి పార్థసారథి చేయూత

ELR: నూజివీడు(మం) ముక్కొల్లుపాడులో మారుమూడి రాజుకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో మంగళవారం దగ్ధమయింది. ఉపసర్పంచ్ కలగర శివ సాయి మాట్లాడుతూ.. ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి పార్థసారథి బాధిత కుటుంబానికి రూ. 5వేలు, బియ్యం, నిత్యవసర సరుకులు తక్షణసాయంగా అందించినట్లు చెప్పారు. మంత్రి కొత్త ఇంటిని మంజూరు చేసేందుకు హామీ ఇచ్చినట్లు వివరించారు.

March 3, 2026 / 09:38 PM IST

జిల్లాలో వైన్స్ బంద్.. కలెక్టర్ కీలక ఆదేశం

హోలీ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు మెదక్ జిల్లాలో వైన్ షాపులు, బార్లను మూసివేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ ‘డ్రై డే’గా ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

March 3, 2026 / 09:35 PM IST

ఆత్మకూరు బస్టాండ్‌లో ఉచిత నీటి ట్యాంక్

NDL: ఆత్మకూరు APSRTC బస్టాండ్‌లో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ప్రభుత్వ హైస్కూల్ 1986-90 పూర్వ విద్యార్థులు స్టీల్ మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీశైలం టీడీపీ సమన్వయకర్త వై. యుగంధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నీటి ట్యాంకర్‌తో వేసవిలో ఉచిత త్రాగునీరు అందుబాటులో ఉండనుంది.

March 3, 2026 / 09:33 PM IST