• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి వివాహ వేడుక

TG: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక ఇవాళ వైభవంగా జరగనుంది. ఈ శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సీఎంలు, మాజీ సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ రంగ ప్రముఖులు భారీగా హాజరుకానున్నారు. ప్రముఖుల రాకతో వివాహ వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

March 5, 2026 / 06:50 AM IST

అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

WGL: కలెక్టర్ డా. సత్య శారద బుధవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

March 5, 2026 / 06:49 AM IST

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి

ASF: రెబ్బెన మండలం ఇంద్రానగర్ సమీపంలో రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్ళు ఉంటుందని, తెల్లని షర్ట్, నీలి జీన్స్ ధరించి, మెడలో తాయత్తు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలన్నారు.

March 5, 2026 / 06:49 AM IST

లడ్డూపై నేడు మండలిలో చర్చ కొనసాగింపు

AP: తిరుమల లడ్డూ అంశంపై శాసనమండలిలో ఈరోజు కూడా చర్చ కొనసాగనుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని గతంలో వినియోగించడంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన చేయనున్నారు. మరోవైపు వ్యవసాయంపై లఘుచర్చను ఎజెండాలో పొందుపరిచారు. అలాగే, దీంతోపాటు రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

March 5, 2026 / 06:47 AM IST

‘లడ్డూ అంశంపై మండలిలో మంత్రి వ్యాఖ్యలు సరికావు’

SKLM: ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ‌పై చర్చ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మండలి ఛైర్మన్ మోషేను రాజులను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అనుచితమని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని, సభ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అన్నారు.

March 5, 2026 / 06:47 AM IST

కూసుమంచిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

KMM: కూసుమంచి మండలం నాయకన్జూడెం గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ముఖ్యంగా బొడ్రాయి బజార్లోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని, దీనివల్ల వ్యాధులు దరిచేరవని గ్రామస్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

March 5, 2026 / 06:45 AM IST

మదనాపురంలో భారీగా ఇసుక డంపుల సీజ్!

WNP: మదనాపురం మండలం కరివేన గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 30 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను తరలించి డంపు చేస్తున్నారన్న సమాచారంతో తహశీల్దార్ జె.కె. మోహన్ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుకను తదుపరి చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.

March 5, 2026 / 06:45 AM IST

అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్.. సీఐ హెచ్చరిక

మహబూబాబాద్ పట్టణంలోని ముత్యాలమ్మ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

March 5, 2026 / 06:44 AM IST

సుగంధ ద్రవ్యాలతో అభిషేకం.. మహా మంగళ నీరాజనం

HNK: హనుమకొండ చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సందర్భంగా విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేశారు. అలంకరణ అనంతరం మహా మంగళ నిరాజనం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

March 5, 2026 / 06:44 AM IST

‘పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృషి సారించాలి’

PDPL: మంథని పట్టణ కేంద్రంలోని ఆర్టీసీబస్ స్టేషన్‌లో బుధవారం పోలీసులు సైబర్ నేరాలు, అలాగే గంజాయి మత్తుపదార్థాల వినియోగంపై వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని ఏఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృషి సారించాలని, పిల్లలు చేసే ప్రతి చర్యను గమనించాలని సూచించారు. అదే విధంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

March 5, 2026 / 06:43 AM IST

వంద శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

GDWL: ​పదో తరగతి మీ జీవిత గమ్యాన్ని మార్చే కీలక మలుపు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం గద్వాల ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ పదవ తరగతి పరీక్షలు అధిగమించే మెలకువలను మోటివేషన్ క్లాస్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల ప్రశ్నాపత్రాలను సాధన చేయాలని, స్పష్టమైన చేతివ్రాతతో సమాధానాలు రాయాలని సూచించారు.

March 5, 2026 / 06:43 AM IST

ఉపాధి హామీ పనులపై ‘ప్రజావేదిక’

NLG: చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ, ‘ప్రజావేదిక’ నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.37 కోట్ల వ్యయంతో జరిగిన పనులపై ఈ ఓపెన్ ఫోరంలో సమీక్షించారు. పనుల పారదర్శకత, అమలు తీరును అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

March 5, 2026 / 06:43 AM IST

నేటి నుంచి IAT-2026 దరఖాస్తుల స్వీకరణ

IISER(ఐసర్) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు(2026-27)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఐసర్ ఆప్టిట్యూట్ టెస్ట్(IAT)కి దరఖాస్తు ప్రక్రియ  ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నాలుగేళ్ల BS, BTech, ఐదేళ్ల BS-MS ఇంటిగ్రేటెడ్  కోర్సులు అందుబాటులో ఉండగా.. ఇంటర్‌లో MPC,BiPC చదివిన విద్యార్థులు ఏప్రిల్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్7న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

March 5, 2026 / 06:42 AM IST

మాధవరాయుడుపాలెం స్మశానవాటికకు కొత్త శోభ

E.G: కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ సర్పంచ్ అన్నదేవుల చంటి ఆధ్వర్యంలో అక్కడి స్మశానవాటిక అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా స్మశానవాటికలో కాటికాపరి విగ్రహాన్ని చంటి తన సొంత నిధులతో అత్యంత సుందరంగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించనున్నారు.

March 5, 2026 / 06:42 AM IST

రూ.4 వేల అప్పు కోసం కత్తితో దాడి

KMM: జిల్లాలో రూ. 4 వేల అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఉదయ్, విక్రమ్‌కి కొంత నగదు బాకీ ఉన్నాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి గొడవ జరగగా.. విక్రమ్ తన స్నేహితులు మహేష్, లింగరాజుతో కలిసి ఉదయ్‌పై కత్తితో దాడి చేశాడు. నిందితులు ముగ్గురిని ఎస్సై జగదీష్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

March 5, 2026 / 06:41 AM IST