• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిత్తూరు నగర మేయర్ స్వగృహప్రవేశ కార్యక్రమం

చిత్తూరు నగర మేయర్ S. అముద వారి నూతన స్వగృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 20, 2026 / 03:42 PM IST

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్లు లాభపడి 82814.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116.90 పాయింట్ల లాభంతో 25571.25 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91గా ఉంది.

February 20, 2026 / 03:42 PM IST

లారీ ఢీకొని యువకుడు మృతి

కడప: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు సినీ హబ్‌కు వెళ్లే మలుపులో లారీ ఢీకొని మైదుకూరు మండలం, ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీ కొందని స్థానికులు తెలపారు.

February 20, 2026 / 03:41 PM IST

ఉచిత కంటి వైద్య పరీక్షలు…!

NZB: పోతంగల్ మండలం గన్నారం, లింగాపూర్ గ్రామాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 65 మందికి పరీక్షలు చేయగా, 14మందికి మోతెబిందు ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.

February 20, 2026 / 03:40 PM IST

విషగుళికలు సేవించి యువకుడి ఆత్మ హత్య

KDP: సిద్ధవటం మండలం పొన్నవోలు గ్రామంలోని మామిడి శివారెడ్డి తోటలో కాపలాదారుగా ఉన్న యానికుల గణేష్(19 ) మతిస్థిమితం, అనారోగ్యంతో బుధవారం విషగుళికలు సేవించాడు. బందువులు సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లుగా ధృవీకరించారు. తండ్రి యాణికుల రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై హారిక తెలిపారు.

February 20, 2026 / 03:39 PM IST

‘దళిత వాడల్లో స్మశాన వాటికలకు నిధులివ్వండి’

కృష్ణా: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పామర్రు ఎమ్మెల్యే, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ వర్ల కుమార్ రాజా కీలక విజ్ఞప్తి చేశారు. దళిత వాడలు, మైనారిటీ ప్రాంతాల్లో స్మశాన వాటికలు, కబరస్థాన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 03:37 PM IST

ఫైనల్‌ల్లో భారత్ VS బంగ్లాదేశ్

‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 16.4 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.

February 20, 2026 / 03:37 PM IST

ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయం: ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీలో శుక్రవారం నూతన పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నతమైందని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయమన్నారు.

February 20, 2026 / 03:37 PM IST

రైతులకు, కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం

ASR: జీ.మాడుగుల మండలంలోని వంజరి, గెమ్మెలి గ్రామాల్లో శుక్రవారం గిరిజన రైతులకు కోళ్ల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పశు వైద్యాధికారిణి రాగిణి, శాస్త్రవేత్త శ్రీహరి పాల్గొని, పౌల్ట్రీ ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. అనంతరం ఒక్కో రైతుకు 15 కోళ్ల చొప్పున పంపిణీ చేశారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

February 20, 2026 / 03:37 PM IST

సీఎం కప్.. కబడ్డీ పోటీలు ప్రారంభం

TG: భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడలను మక్తల్‌లో నిర్వహించేలా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం కప్‌లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను వెలికి తీస్తామన్న మంత్రి.. 33 జిల్లాల నుంచి 66 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు.

February 20, 2026 / 03:36 PM IST

‘హౌసింగ్ లే అవుట్ పనులు వేగవంతం చేయాలి’

ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం సమీపంలో గల హౌసింగ్ లేఅవుట్ను హౌసింగ్ ఏఈ శివప్రసాద్‌తో కలిసి ఎంపీడీవో వీరభద్రాచారి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నిర్మాణాలు వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించాలని సూచించారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ముఖ్యమని ఎంపీడీవో తెలిపారు.

February 20, 2026 / 03:35 PM IST

వివిధ సంస్థలతో సర్కార్ ఎంవోయూలు

AP: క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేవీ ఏఐ స్టాక్ నిర్మించేలా ఒప్పందం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఏపీతో వైజర్ సంస్థ ఒప్పందం చేసుకుంది.

February 20, 2026 / 03:34 PM IST

కేంద్ర గ్రంథాలయాన్ని సదర్శించిన ప్రాజెక్టు అధికారి

భద్రాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఈరోజు సందర్శించారు. గ్రంథాలయ పరిసరాలు, పుస్తకాలు, అందుబాటులో ఉన్న వనరులు, పని వేళలు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంచి గ్రంథాలయం మనకు అందుబాటులో ఉండటం అదృష్టకరమని, విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

February 20, 2026 / 03:33 PM IST

అమ్మవారిపల్లిలో రోడ్డు ప్రమాదం

సత్యసాయి: పెనుకొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలో కియా పోలీస్ స్టేషన్ ఎదురుగా శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు టైర్ ఒక్కసారిగా బరస్ట్ కావడంతో నియంత్రణ కోల్పోయి ముందుగా ప్రయాణిస్తున్న థార్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, అందులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

February 20, 2026 / 03:32 PM IST

AI- క్వాంటం రంగాల్లో శిక్షణపై ప్రభుత్వం దృష్టి 

AP: విద్యార్థులు, యువతకు ఏఐ -క్వాంటం రంగాల్లో శిక్షణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడంపై ఆలోచనలు చేస్తుంది. APలో ఏఐ- క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి 7 ఎంవోయూలు బాటలు వేయనున్నాయి. క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యూఎన్ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

February 20, 2026 / 03:31 PM IST