• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ

WNP: ఏఐసీసీ అధ్యక్షులు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఇంద్ర భవన్‌లో ఖర్గేకు పూల బొకే ఇచ్చి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని ఖర్గే అభినందించినట్లు చిన్నారెడ్డి తెలిపారు.

February 20, 2026 / 03:31 PM IST

గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకం: కలెక్టర్

NGKL: గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీలో కల్వకుర్తి డివిజన్‌కు చెందిన 116 మంది నూతన సర్పంచులకు రెండో విడత శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు.

February 20, 2026 / 03:30 PM IST

ఎండిపోతున్న పొలాలకు సాగునీరు: ఎమ్మెల్యే

NLR: ఎండిపోతున్న 400 ఎకరాలకు రూ. 10 లక్షల వ్యయంతో పైపులు ద్వారా పంపింగ్ చేసి పొలాలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నామని MLA సోమిరెడ్డి అన్నారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలోని పొట్టేళ్ల కాలువ వద్ద చెక్ డ్యామ్ నుంచి వేస్తున్న పైప్ లైన్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పొట్టేళ్ల కాలువ వద్ద నిర్మించిన చెక్ డ్యాంతో 2500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

February 20, 2026 / 03:30 PM IST

8 వేల మందితో వైసీపీ ప్లాన్

PLD: వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 7 నుంచి 8వేల మందితో వైసీపీ క్రియాశీలక సైన్యాన్ని సిద్ధం చేస్తుంది. ఈ విషయాన్ని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యకర్తలకు ఐడీ కార్డులు జారీ చేయడంతో పాటు, వారికి ప్రమాద, సహజ మరణ బీమా సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

February 20, 2026 / 03:30 PM IST

ఆదరిస్తే మరింత అభివృద్ధి: MLA

KNR: జనహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తే ప్రజలు మరింత పురోభివృద్ధి సాధిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో శుక్రవారం తిమ్మాపూర్ మండలానికి చెందిన 57 మందికి సీఎంఆర్ఎఫ్, 67 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

February 20, 2026 / 03:30 PM IST

11,127 ఉద్యోగాలు.. వారంలో నోటిఫికేషన్?

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెన్త్, ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. సీబీటీ 1, సీబీటీ 2, సీబీఏటీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

February 20, 2026 / 03:30 PM IST

జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం

E.G: ఏపీ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నద్ధత, శిక్షణా కార్యక్రమాలు ఎంపిక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం అని కలెక్టర్ స్పష్టం చేశారు.

February 20, 2026 / 03:30 PM IST

శ్మశానవాటి పనులు నాణ్యతతో చేపట్టాలి: కౌన్సిలర్

VKB: స్మశాన వాటిక పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తిచేయాలని కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ మున్సిపల్లోని రెండో వార్డులో కొనసాగుతున్న శ్మశానవాటి పనులను కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్మశానవాటికలు మంచినీటి వసతితో పాటు అన్ని సౌకర్యాలు తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 03:30 PM IST

నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలి: డీఐవో

WGL: నిబంధనల మేరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించాలని వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఇతరులకు ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 26 థియరీ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడుతాయని DIEO తెలిపారు.

February 20, 2026 / 03:29 PM IST

‘ఆరోగ్యకర పంటల సాగుతో అధిక మద్దతు ధర సాధ్యం’

VZM: ఆరోగ్యకర పంటల సాగుతో రైతులకు అధిక మద్దతు ధర లభిస్తుందని గజపతినగరం ఏడీఏ నిర్మల జ్యోతి అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని కొత్తబగ్గంలో పొలంబడి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేలైన సాగు పద్ధతిలో పంటలు పండించాలన్నారు. వరి సాగు చేస్తున్న రైతులకు పలు అంశాలపై వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ శిక్షణ కల్పించారు.

February 20, 2026 / 03:28 PM IST

వెన్నం రాఘవేందర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి నివాళి

మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో ఓ టీవీ ఛానల్ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సవిందాన్ కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెడ్యాల గ్రామానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

February 20, 2026 / 03:27 PM IST

‘శ్రీకాకుళం తీరంలో రేర్ ఎర్త్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి’

శ్రీకాకుళం తీరంలో అపారంగా ఉన్న ఇల్మెనైట్, సిల్లిమనైట్, జిర్కాన్, రూటైల్, గార్నెట్, మోనాజైట్ వంటి అరుదైన ఖనిజాలను పూర్తిస్థాయిలో వినియోగించి, స్థానికంగానే ‘రేర్ ఎర్త్’ ప్లాంట్ ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శాసనసభలో కోరారు. దేశం చైనా తదితర దేశాల నుంచి భారీగా రేర్ ఎర్త్ మూలకాలను దిగుమతి చేసుకుంటోందని గుర్తుచేసారు.

February 20, 2026 / 03:26 PM IST

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

NGKL: తెల్కపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలి

పార్వతీపురం ఐటీడీఏలో భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భాషా పండిట్లకు పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్రియ ముందుకు సాగడం లేదని అన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

ఎన్టీఆర్, నీల్ మూవీకి టైటిల్ ఖరారు!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ టైటిల్‌పై ఉత్కంఠ నెలకొంది. మొదట ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. అయితే, గతంలో రామ్ చరణ్ ‘బ్రూస్లీ’ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్...

February 20, 2026 / 03:26 PM IST