NZB: ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన సైక్లింగ్ సంఘం ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నలవేలి గ్రామానికి చెందిన కుంట గంగారెడ్డి, మైలారం కు చెందిన జితేందర్ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా నియమితులైనట్లు ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు తెలిపారు. క్రీడల పైన అనుభవం ఉన్నందువలన వీరికి అవకాశం కల్పించామని తెలిపారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
MNCL: బెల్లంపల్లి పాలిటెక్నీక్ కళాశాలలో కొత్తగా ఆటోమేషన్ & రోబోటిక్స్ కోర్సు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని ప్రిన్సిపాల్ దేవేందర్ ప్రకటనలో తెలిపారు. పాత కోర్సులను మేళవించి ఆధునీకరించడంతో పాటు పరిశ్రమల భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిపుణులు ఈ కోర్సుకు రూపకల్పన చేశారన్నారు. కొత్త కోర్సులో అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ. 8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 7,060గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ. 40 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
NTR: ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తు సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని MLA వసంత కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం(M) కిలేశపురంలో రూ.4.2 కోట్ల హడ్కో నిధులతో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఉపకేంద్రం వల్ల లో వోల్టేజ్, బ్రేక్‌డౌన్ సమస్యలు తగ్గి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన విద్యుత్తు అందుతుందని తెలిపారు.
ASR: వారణాసికి చెందిన ప్రముఖ కాశీ పీఠాధిపతులు శ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ మార్చి 1 న మండపేట విచ్చేస్తున్నట్లు మండపేట 15 వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. మార్చి1 నుంచి 5 వరకు మండపేట ధర్మ గుండం చెరువు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి పీఠం వద్ద ఉంటారని చెప్పారు. 5 రోజులు పాటు స్వామి వారు మండపేటలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ప్రసాదం స్వీకరిస్తే ఫలితం ఉంటుందని వేద పండితులు పేర్కొన్నారు. భక్తులు ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని వారు కోరారు.
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షకు హాజరయ్యారు. అధికారులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు.
SRPT: యాసంగి సీజన్‌కు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పెంచారు. 1,750 క్యూసెక్కులు వదులుతుండగా 1,810 క్యూసెక్కులకు పెంచారు. రెతులు నీటిని వృథా చేయవద్దని జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయన్న వాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.
CTR: జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా ఎంపీడీవో మనోహర్ గౌడ్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా గంగాధరనెల్లూరుకు చెందిన వి.శివయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా ముక్కళత్తూరుకు చెందిన పి. కిరణకుమార్ ఎంపికయ్యారు.
JGL: మెట్‌పల్లి ఆర్డీవోగా పనిచేస్తున్న నక్క శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్డీవో నరసింహారావును మెట్‌పల్లికి నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
NDL: అసెంబ్లీ ఆవరణలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో ఇవాళ నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి నారా లోకేష్ బాబు వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
PDPL: ధర్మారంలో గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 333 మంది, సాధన జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
VZM: గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వద్ద ఇవాళ గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో ఆర్మీ ఉద్యోగి దవలసింగి చంద్రమౌళి (29) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అతన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన వ్యక్తిగా అని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASR: అరకు రైల్వే ఆస్పత్రిలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీ నింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆస్పత్రి పీఆఓ్వ పీ.ఆనంద్ తెలిపారు. విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్, ఆరిలోవ మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. శిబిరంలో బీపీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాప్ స్మియర్ పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.
PPM: కొమరాడ మండలం వన్నాం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.