BDK: భద్రాద్రి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో 18,685 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
KMM: డిప్యూటీ సీఎం నివాసాలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ మర్యాపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గ సమస్యలను వారికి వివరించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
CTR: కుప్పం రెసిడెన్షియల్ పాఠశాల నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను కుప్పం రూరల్ పోలీసులు 6 గంటల్లోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పోలీసు బృందం యొక్క వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయత్నాలను అభినందించారు. తల్లిదండ్రులు సకాలంలో చర్య తీసుకున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ (N.S.S) వాలంటీర్లు పాల్గొనవచ్చన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
MDK: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చూపి ఆరు రజత పతకాలు సాధించారు. పథకాలు సాధించిన రాథోడ్ రమేష్ (టెన్నిస్ సింగిల్స్, డబుల్స్), భవాని, వీణ, సుష్మ (కబడ్డీ)లను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించి, సన్మానించారు.
ఆసిఫాబాద్ మండలం కొఠారి గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రి తరలించమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్ మంగళవారం నర్వ మండలంలోని పెద్ద కడుమూరు, రాయికోడ్, పాతర్ చేడ్ గ్రామాల్లో పర్యటించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నీలో రేగొడ్ జట్టు విజయం సాధించింది. AIBESS నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రేగోడ్ ఆధ్యా, ఖేడ్ ర్యామ్ స్పోర్ట్స్ తలపడ్డాయి. రేగోడ్ జట్టు టోర్నీ కప్ సాధించింది. ఈ మేరకు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
KNR: తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
ATP: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పీఎంశ్రీ పథకం ఎంతో దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సచ్చిదానంద ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో జేసీ విష్ణుచరణ్‌తో కలిసి పీఎంశ్రీ పాఠశాలల పనితీరుపై ఆయన సమీక్షించారు. అనంతరం ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
WNP: ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్ నుంచి మంత్రి మాట్లాడుతూ.. ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలన్నారు.
GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి నివాసంలో జరిగిన చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, రూ.69.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్‌పై ఇప్పటికే 35 కేసులు ఉన్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్, వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
NZB: భీమ్‌గల్లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:05 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
NLG: బాలికల రక్షణ, అభివృద్ధి, విద్య ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని MPDO జయరాం పేర్కొన్నారు. నేరేడుగొమ్ము ఎంపీడీవో కార్యాలయంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నియంత్రణలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మొత్తం నాలుగు దశల్లో పూర్తవుతుందన్నారు.