• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

APT PCAకు భూమి కేటాయింపునకు వినతి

SKLM: ఏపీ టాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సంఘ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. సంఘ కార్యకలాపాలకు కార్యాలయ నిర్మాణం అవసరమని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 08:15 PM IST

‘ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి’

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు, ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతున్నాయని చెప్పారు.

February 24, 2026 / 08:15 PM IST

నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి

JGL: వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ మంత్రిని కోరారు. ఆలయ ఛైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. అన్నదానం, కళ్యాణ కార్యక్రమాల కోసం రెండు షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.

February 24, 2026 / 08:15 PM IST

‘ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలి’

MDCL: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అన్ని విధాలుగా సిద్ధమై ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సూచించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తమ శ్రమకు తగిన ఫలితం అందుకోవాలని ఆకాంక్షించారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.

February 24, 2026 / 08:15 PM IST

ఉరుకుంద దేవస్థానం డైరెక్టర్‌గా జిలకర సావిత్రి

KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానం డైరెక్టర్‌గా పెద్దకడబూరుకు చెందిన చెందిన జిలకర సావిత్రి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. పెద్దకడబూరు మండల జనసేన పార్టీ నాయకులు జిలకర గణేష్ తల్లి జిలకర సావిత్రి జనసేన పార్టీ తరుపున ఉరుకుంద ట్రస్ట్ డైరెక్టర్ గా నియమిలయ్యారు.

February 24, 2026 / 08:14 PM IST

‘గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకం’

MNCL: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక జీపీవోల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

February 24, 2026 / 08:14 PM IST

హాస్పిటల్‌కు దివంగత డా. కిషన్ రావు పేరు: MLA

SRD: పటాన్ చెరువు పట్టణంలో భారీ CSR నిధులతో నిర్మాణంలో ఉన్న “సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్”కు దివంగత డా. కిషన్ రావు పేరు పెట్టేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, నూతన ఆసుపత్రికి కిషన్ రావు పేరు పెట్టించే దిశగా చర్యలు తీసుకుంటానని కస్బా బృంద సభ్యులతో ఆయన పేర్కొన్నారు.

February 24, 2026 / 08:13 PM IST

రన్‌రేట్ కంటే గెలుపే ముఖ్యం: అశ్విన్

టీమిండియాకు అశ్విన్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు ప్రస్తుతం నెట్ రన్‌రేట్‌ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై విజయం సాధించడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించాడు. అలాగే, బ్యాటర్లు కూడా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తమ షాట్ల ఎంపికపై శ్రద్ధ వహించాలని అశ్విన్ సూచించాడు.

February 24, 2026 / 08:13 PM IST

మదనపల్లిలో జరిగిన దారుణం బాధాకరం: మంత్రి

అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.

February 24, 2026 / 08:12 PM IST

‘ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి’

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో కమిషనర్ మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌లను తక్షణమే రెన్యువల్ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌కు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిబంధనల ప్రకారం 25% పెనాల్టీ విధిస్తామన్నారు.

February 24, 2026 / 08:12 PM IST

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ELR: షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో హౌరా వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయవాడ సమీపంలో ఒక్కసారిగా స్పృహ తప్పారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఏలూరులో వైద్య పరీక్షలు నిర్వహించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రైల్వే ఎస్సై దానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

February 24, 2026 / 08:11 PM IST

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను కోహెడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనిగరం గ్రామ శివారులో తనిఖీల సందర్భంగా TG36-T-2838 నంబరు గల ట్రాక్టర్ పట్టుబడింది. డ్రైవర్ దర్శనం రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. కోహెడ ఎస్సై పి. అభిలాష్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 24, 2026 / 08:10 PM IST

రేపు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు.

February 24, 2026 / 08:10 PM IST

బడుల్లో కులవివక్షను అంతమొందించాలి: రామచందర్ రావు

NGKL. కుమ్మెర ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ నేత రామచందర్ రావు మండిపడ్డారు. గుడి, బడి వంటి బహిరంగ ప్రదేశాల్లో కులవివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే ఎక్స్రేషియా ప్రకటించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

February 24, 2026 / 08:08 PM IST

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి: కలెక్టర్

GDWL: జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని వివరించారు.

February 24, 2026 / 08:08 PM IST