• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మదర్ డెయిరీ సమస్యలపై ఎమ్మెల్యేల సమీక్ష సమావేశం

NLG: మదర్ డెయిరీలో నెలకొన్న సమస్యలపై ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో MLAలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని డెయిరీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. డెయిరీ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

February 24, 2026 / 08:31 PM IST

గుంటూరులో మహిళా గ్రీవెన్స్

GNTR: పశ్చిమ టీడీపీ ఆఫీసులో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాలతో దీన్ని నిర్వహించారు. నియోజకవర్గ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పింఛన్లు, ఇళ్లు, ఉపాధి తదితర సమస్యలపై వినతులు ఇచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, ఇతర నేతలు వీటిని స్వీకరించారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

జిల్లాలో నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: ఎస్పీ

WNP: మైనర్ మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార కేసులో నేరం రుజువవ్వడంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా, కఠిన తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఇలాంటి కఠిన తీర్పులు సమాజానికి రక్షణ కవచం లాంటివి అన్నారు. ఏ అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

సర్పంచుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

WGL: గీసుకొండ (M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో నల్లబెల్లి మండలానికి చెందిన సర్పంచుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలని సర్పంచులను కోరారు.

February 24, 2026 / 08:30 PM IST

నాటు సారా కేసులో ఇద్దరికి బైండోవర్‌

ELR: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాత నాటు సారా కేసుల ముద్దాయిలను మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో హాజరుపరిచారు. వనమా కొండలరావు, కటారి కోటేశ్వరరావులపై మండల మెజిస్ట్రేట్ సమక్షంలో 129 BNSS కింద బైండోవర్ విధించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

అంగన్వాడీల రెండు రోజుల నిరాహారా దీక్షలు

SKLM: తమ డిమాండ్ల సాధకు అంగన్వాడీ వర్కర్లు రెండు రోజుల నిరాహారా దీక్షలకు బుధవారం నుంచి సమయత్తం అవుతున్నారని సీఐటీయు ప్రతినిధి పి. తెజేశ్వరరావు మంగళవారం తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్, ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావుబాపూలే పార్క్ వద్ద నిరాహార దీక్షలకు దిగుతామన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

‘సచివాలయ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయాలి’

ASR: రోజువారీ హాజరు నమోదు చేయకుండా, సమయపాలన పాటించకుండా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయాలని కలెక్టర్ దినేష్ కుమార్, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి కుమార్‌ను మంగళవారం ఆదేశించారు. పర్యవేక్షణ చేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 08:30 PM IST

తౌశిక్ కుటుంబాన్ని పరామర్శించిన కదిరి బాబురావు

ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్‌లో ఇటీవల మరణించిన విద్యార్థి తౌశిక్ కుటుంబ సభ్యులను మంగళవారం కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

February 24, 2026 / 08:30 PM IST

క్రీడా పోటీల్లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

ATP: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యేల క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉత్సాహంగా పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పోటీలు చక్కని వేదికగా నిలిచాయి.

February 24, 2026 / 08:30 PM IST

మట్టిమిద్దే కూలి మహిళ మృతి

నంద్యాల: జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లక్ష్మీ దేవమ్మ అనే మహిళ మట్టి మిద్దె కూలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 08:29 PM IST

‘ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

JGL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించి కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.

February 24, 2026 / 08:28 PM IST

అక్రమ ఇసుక రవాణా.. ఐదు ట్రాక్టర్ల స్వాధీనం

KNR: అనుమతి లేకుండా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను మగ్దుంపూర్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు, పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 24, 2026 / 08:28 PM IST

రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనలపై ప్రభుత్వం సీరియస్

AP: రాజమండ్రిలో పాల కల్తీ, శ్రీకాకుళంలో డయేరియా ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని, దీనికి సంబంధించి అంశాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 08:27 PM IST

‘గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేయాలి’

KRNL: గూడూరు మండలం నాగులాపురం పీహెచ్సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. “జన్మనిచ్చిన తల్లి, జన్మించిన శిశువు ఎవరూ మరణించకూడదు” అనే లక్ష్యంతో సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలని, పోషకాహారం, రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు.

February 24, 2026 / 08:25 PM IST

రక్షణ కల్పించాలని ఎస్సైకు వినతి

KRNL: పెద్దకడబూరు మండలంలో దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దళితులకు రక్షణ కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆశీర్వాదం, సుమల రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌లో ఎస్సై నిరంజన్ రెడ్డికు వినతి అందజేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ, ప్రాణహాని ముప్పు ఉన్న నాయకులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

February 24, 2026 / 08:24 PM IST