E.G: రాజానగరం నియోజకవర్గ స్వరూప నగర్ కాలనీకి చెందిన రాధాక్రిష్ణ మూర్తి (75) కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO కృష్ణ నాయక్, రాజానగరం MRO తదితరులు పాల్గొన్నారు.
KMR: అర్హులైన మైనార్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులు పాల్గొన్నారు.
GNTR: గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము తాళాల సీళ్లు, సీసీ కెమెరాలు, ప్రాంగణాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. భద్రతా చర్యలను నిరంతరం పటిష్టంగా అమలు చేయాలని ఆమె సూచించారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి HYD వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
KRNL: కౌతాళం మండలం కుంబలనూరు మాజీ ఎంపీటీసీ, టీబీపీ ఎల్ఎల్‌సీ వైస్ ఛైర్మన్ ఈరన్న టీడీపీ సభ్యత్వానికి, తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి మంగళవారం ఆడిటర్లతో కలిసి సమీక్షించారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
KMM: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
MNCL: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియా కారణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇతర బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించగా,పెద్ద ప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా భవనం మిద్దెపై ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అధికారి శివప్ప ఆధ్వర్యంలో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వేగవంతమైన చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్లు పేర్కొన్నారు.
SRPT: HNRలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లైసెన్స్ డ్రైవర్ల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు SI తెలిపారు. మంగళవారం ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు పరిశీలించారు. డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ATP: జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది క్వింటాల్ శనగలకు ప్రభుత్వం 5,875 రూపాయల మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.
కోనసీమ: మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ తాటిపాకకు చెందిన కర్రీ సౌజన్య, కందికుప్పకు చెందిన బొజ్జ లక్ష్మీదుర్గ మంగళవారం క్షేమంగా స్వగ్రామం చేరారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ పని దొరకక అవస్థలు పడుతున్న వారిని కలెక్టర్ మహేశ్ కుమార్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా రప్పించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
BHNG: భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు.