• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ నివారణకు యాజమాన్యం చర్యలు చేపట్టాలి: సీఐ

VZM: కాలేజీలలో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను బొబ్బిలి CI కె.నారాయణరావు సూచించారు. మంగళవారం స్దానిక పోలీస్‌ స్టేషన్‌లో విద్యా సంస్దల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై విద్యార్ధినిలకు అవగాహన కల్పించాలన్నారు.

March 24, 2026 / 12:54 PM IST

‘గోకవరం పంచాయతీ వేలం పాటం వాయిదా’

E.G: గోకవరం మేజర్ గ్రామపంచాయతీ వేలం పాటలు ఈనెల 26వ తేదీకి వాయిదా పడినట్లు గ్రేడ్-1 సెక్రటరీ వై.సూరిబాబు తెలిపారు. మంగళవారం జరగాల్సిన ఈ వేలం, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ రాజమండ్రి పర్యటన నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. ఆసక్తి గల వేలంపాటదారులు ఈనెల 26న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

March 24, 2026 / 12:50 PM IST

టీబీ నివారణకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ర్యాలీ

SKLM: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత ఆధ్వర్యంలో ర్యాలీని మంగళవారం నిర్వహించారు. టీ.బీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని DMHO తెలిపారు. అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

March 24, 2026 / 12:45 PM IST

గోపులాపురంలో ఉచిత కంటి పరీక్షలు..!

KDP: కమలాపురం మండలం సి.గోపాలపురం ఎంపీపీ పాఠశాలలో మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలకు కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన మందులు అందజేశారు. త్వరలోనే అర్హులైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తామని కంటి వైద్యుడు వెంకట సురేశ్ తెలిపారు.

March 24, 2026 / 12:44 PM IST

గర్భధారణ అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

విజయనగరం: చిన్న వయస్సులో గర్భం దాల్చడంవల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కౌమార దశలో గర్భధారణ అవగాహన పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఐసీడీఎస్ పీడీతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

March 24, 2026 / 12:44 PM IST

రేపే కురబలకోటలో వేలం పాటలు..!

అన్నమయ్య: కురబలకోటలో ఈనెల 25న సంత, రూములకు వేలం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గంగయ్య యాదవ్, కార్యదర్శి రామప్ప తెలిపారు. కురబలకోటలోని వారపు, దినసంతతో పాటు పంచాయతీ అద్దెరూములకు బుధవారం వేలం జరుగుతుందన్నారు. వారపు, దినసంతకు రూ. 40,000, చిన్న అద్దె రూములకు రూ. 20.000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలని కోరారు.

March 24, 2026 / 12:41 PM IST

నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం: డీఎస్పీ

కోనసీమ: ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసుపై డీఎస్పీ ప్రసాద్ మంగళవారం మీడియాకు వివరాలు అందజేశారు. ఎదుర్లంకకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.

March 24, 2026 / 12:40 PM IST

‘ప్రభుత్వ సేవలు సులభంగా చేరేలా చర్యలు తీసుకుంటాం’

PLD: నరసరావుపేట పట్టణంలోని 6, 7వ వార్డుల పరిధిలోని SRKT కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా కలిసి పర్యటించారు. స్థానికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 24, 2026 / 12:40 PM IST

బాలకృష్ణను కలిసిన అనపర్తి ఎమ్మెల్యే

E.G: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్ 2న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డి, తమ కుమార్తె డాక్టర్ డాక్టర్ సనాతని వివాహ వేడుకకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను బాలకృష్ణకు అందించారు.

March 24, 2026 / 12:40 PM IST

‘ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి’

ప్రకాశం: కనిగిరి మండలం చల్లగిరగల పంచాయతీలో ఇంటి పన్నుల వసూలు కార్యక్రమాన్ని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె. శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ లోపు 100% పన్ను వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. డివిజన్ పరిధిలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అందించాలని సూచించారు.

March 24, 2026 / 12:39 PM IST

గన్నెల PHCను తనిఖీ చేసిన ఎస్టీ కమిషన్ సభ్యుడు

ASR: అరకులోయ మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. PHCలో ఉన్న పలు సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

March 24, 2026 / 12:38 PM IST

ఏఎస్సై క్రీడా స్ఫూర్తికి జిల్లా ఎస్పీ ప్రశంసలు

పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సూర్యనారాయణ క్రీడా స్ఫూర్తి పట్ల కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సత్కరించారు. ఇటీవల అమలాపురంలో హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో సూర్యనారాయణ 100 కేజీల బరువు ఎత్తి రెండు బంగారు పథకాలను సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

March 24, 2026 / 12:36 PM IST

మచిలీపట్నంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ర్యాలీ

కృష్ణా: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్ అవగాహన ర్యాలీని మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఈ ర్యాలీలో పాల్గొని, క్షయవ్యాధి నివారణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

March 24, 2026 / 12:35 PM IST

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: UTF

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణ సమీపంలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి నిరాహార దీక్షలను మంగళవారం ఉపాధ్యాయులు చేపట్టారు. ఉపాధ్యాయుల దీక్షలకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. యుటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. టిీీఎ, డీఎ బకాయిలు వెంటనే చెల్లించాలని, హెల్త్ స్కీమ్ సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.

March 24, 2026 / 12:32 PM IST

మధుకేశ్వర స్వామిని దర్శించిన ఎస్టీ కమిషన్ ఛైర్మన్ భోజ రెడ్డి

SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మధుకేశ్వర స్వామిని మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోల్ల భోజ రెడ్డి స్వామిని వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను తిలకించారు. ఆయనతో పాటు పాలక మండల ఛైర్మన్ శివప్రసాద్, సభ్యులు, ఎస్సై అశోక్ బాబు ఉన్నారు.

March 24, 2026 / 12:32 PM IST