PLD: నరసరావుపేట పట్టణంలోని 6, 7వ వార్డుల పరిధిలోని SRKT కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా కలిసి పర్యటించారు. స్థానికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
E.G: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్ 2న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డి, తమ కుమార్తె డాక్టర్ డాక్టర్ సనాతని వివాహ వేడుకకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను బాలకృష్ణకు అందించారు.
ప్రకాశం: కనిగిరి మండలం చల్లగిరగల పంచాయతీలో ఇంటి పన్నుల వసూలు కార్యక్రమాన్ని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె. శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ లోపు 100% పన్ను వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. డివిజన్ పరిధిలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అందించాలని సూచించారు.
ASR: అరకులోయ మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. PHCలో ఉన్న పలు సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సూర్యనారాయణ క్రీడా స్ఫూర్తి పట్ల కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సత్కరించారు. ఇటీవల అమలాపురంలో హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో సూర్యనారాయణ 100 కేజీల బరువు ఎత్తి రెండు బంగారు పథకాలను సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్ అవగాహన ర్యాలీని మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఈ ర్యాలీలో పాల్గొని, క్షయవ్యాధి నివారణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణ సమీపంలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి నిరాహార దీక్షలను మంగళవారం ఉపాధ్యాయులు చేపట్టారు. ఉపాధ్యాయుల దీక్షలకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. యుటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. టిీీఎ, డీఎ బకాయిలు వెంటనే చెల్లించాలని, హెల్త్ స్కీమ్ సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.
SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మధుకేశ్వర స్వామిని మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోల్ల భోజ రెడ్డి స్వామిని వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను తిలకించారు. ఆయనతో పాటు పాలక మండల ఛైర్మన్ శివప్రసాద్, సభ్యులు, ఎస్సై అశోక్ బాబు ఉన్నారు.
CTR: చిత్తూరు కేంద్రీయ విద్యాలయంలో మౌలిక సదుపాయాలు, ఇతర పనులన్నీ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఇరువారంలో కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన భవనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
SS: సోమందేపల్లి YSR సర్కిల్ వద్ద ఉన్న ఓ రెస్టారెంట్‌లో గ్యాస్‌కు బదులుగా కట్టెల పొయ్యిపై బిర్యానీ వండుతూ వినియోగదారులకు ప్రత్యేక రుచిని అందిస్తున్నారు. కట్టెల మంటపై మెల్లగా ఉడికించడంతో బిర్యానీకి కమ్మని వాసనతో పాటు ప్రత్యేక రుచి వస్తుందని నిర్వాహకులు తెలిపారు. రుచికరమైన బిర్యానీని ఆస్వాదించేందుకు ఆహార ప్రియులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.
ATP: గుత్తిలోని మదీనా గ్యాస్ ఏజెన్సీ వద్ద మంగళవారం పోలీసుల పహారా మధ్య సిలిండర్ల పంపిణీ జరిగింది. గత మూడు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గ్యాస్ కోసం తెల్లవారుజాము నుంచి పడికాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా తీవ్ర తోపులాట జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
NDL: బేతంచర్ల నగర పంచాయతీ కార్యాలయంలో రేపు సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ CH. చలం రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అయితే, గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలను అధికారులు ఎంతవరకు పరిష్కరించారనే అంశంపై చర్చించనున్నారు.
SKLM: అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం CPI రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని అన్నారు.
VZM: జాతీయ క్షయవ్యాధి నిర్మూలన(NTEP) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పలువురిని ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో రాజాం మండలం పాగిరి PHC మెడికల్ ఆఫీసర్ డా.గట్టి భార్గవి అవార్డుకు ఎంపికయ్యారు. క్షయవ్యాధి నియంత్రణకు అమలుకు ఆమె చేసిన కార్యక్రమాలు ఆధారంగా ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం DMHO చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
కోనసీమ: అమలాపురం నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా ఈదరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లవరపు ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఈదరపల్లి ఎంపీటీసీ అడపా సత్తిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.