ప్రకాశం: వచ్చే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం పామూరు వైసీపీ కార్యాలయంలో సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు.
అన్నమయ్య: ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో వీరబల్లి ఎస్సై సుస్మిత యువతకు హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను వినోదంగా మాత్రమే చూడాలని, బెట్టింగుల మోజులో పడకూడదని సూచించారు. బెట్టింగుల వల్ల యువత ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
E.G: నిడదవోలు నియోజకవర్గం నడుపల్లి కోటలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి డా. బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు,పేదలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
NDL: ఉమ్మడి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చిన ముంపు బాధితుల న్యాయమైన హక్కులు (98GO) పరిష్కరించాలని రాయలసీమ సాగునీటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. నేడు నందికొట్కూరులో 5వ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బాధితులకు సంఘీభావం తెలిపారు. జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఉద్యమ బాట పడతమన్నారు. ఇందులో రైతు సంఘం నాయకులు ఉన్నారు.
సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత రేపు పర్యటించనున్నట్లు ఆమె పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు పెనుకొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో భువన విజయం సమావేశ మందిరంలో ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు అదే ప్రాంగణంలో స్వచ్ఛరథాలను ప్రారంభించనున్నారు.
ASR: పెదబయలు మండలం చేదుపుట్టు, పులిగొంది గ్రామాల్లో పీఎం జన్మన్ పథకం కింద గృహప్రవేశాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న RTC విజయనగరం జోన్ ఛైర్మన్ దొన్ను దొర మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 19,963 ఇళ్లను అందజేసినట్టు తెలిపారు. అలాగే గ్రామానికి రోడ్డు నిర్మాణం అనంతరం బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.
AKP: జిల్లాలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీకి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 351 మందికి మంజూరైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. డీపీఆర్వో కార్యాలయంలో పని వేళల్లో జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులను తీసుకువచ్చునని తెలిపారు. అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
TPT: నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలతో లక్షలాది కుటుంబాలకు భద్రమైన నివాసాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
KRNL: ఆదోనిలో నూర్ అహ్మద్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి సోషల్ మీడియాలో వైసీపీ పార్టీపై, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అతనిపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, మళ్లీ విమర్శలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. అతడిని తక్షణమే ఔట్సోర్సింగ్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఇవాళ మెమోరాండం ఇచ్చినట్లు చెప్పారు.
కృష్ణా: పేదరిక నిర్మూలనకు దాతల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డ రెవిన్యూ హాలులో పీ-4 ఆకాంక్ష నుంచి సాధన స్వర్ణ ఆంధ్ర-2047 సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమం సమాజంలో పేదల అవసరాలు తీర్చేలా సాగటంతో పాటు అభివృద్ధిలోనూ భాగస్వామ్యం వహిస్తోందన్నారు.
CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి 123 వినతులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రీ ఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పూణేపల్లిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. టిడ్కో గృహాల ద్వారా అర్హులైన కుటుంబాలకు భద్రమైన నివాసం కల్పించడం జరుగుతోందన్నారు.
PLD: పిడుగురాళ్ల కొండమోడు–కోనంకి రోడ్డులో నిర్మించిన ఇళ్లలో మొత్తం 2,832 ఇళ్లకు అనుమతి లభించగా, తొలి విడతగా 1,296 గృహాల పట్టాలను సోమవారం పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు గృహాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ATP: శింగనమల సీహెచ్‌సీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్విరామంగా అందుతున్నాయని వైద్యులు రోహినాథ్ తెలిపారు. ఇవాల చికిత్స పూర్తి చేసుకున్న 5 రోగులు కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు. కోలుకున్న రోగులకు వైద్యులు డిశ్‌ఛార్జ్ సమ్మరీ పత్రాలను అందజేశారు. మెరుగైన వైద్యం అందడంపై రోగులు హర్షం వ్యక్తం చేశారు.
PPM: ఎన్నికల హామీల్లో భాగంగా బెల్ట్ షాప్‌లో ఉన్న రద్దుచేసి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో విఫలమైందని CPM మండల నాయకులు R. ఈశ్వరరావు విమర్శించారు. సీతానగరం మండలంలో ఎక్సైజ్ అధికారుల కళ్ళముందే మద్యం సరఫరా జరుగుతుందని ఆరోపించారు. బెల్ట్ షాపులు కారణంగా ప్రజల ఆరోగ్యం, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.