• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోమందేపల్లిలో కట్టెల పొయ్యిపై వంటలు

SS: సోమందేపల్లి YSR సర్కిల్ వద్ద ఉన్న ఓ రెస్టారెంట్‌లో గ్యాస్‌కు బదులుగా కట్టెల పొయ్యిపై బిర్యానీ వండుతూ వినియోగదారులకు ప్రత్యేక రుచిని అందిస్తున్నారు. కట్టెల మంటపై మెల్లగా ఉడికించడంతో బిర్యానీకి కమ్మని వాసనతో పాటు ప్రత్యేక రుచి వస్తుందని నిర్వాహకులు తెలిపారు. రుచికరమైన బిర్యానీని ఆస్వాదించేందుకు ఆహార ప్రియులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.

March 24, 2026 / 12:30 PM IST

పోలీసుల సమక్షంలో గ్యాస్ సిలిండర్‌ల పంపిణీ

ATP: గుత్తిలోని మదీనా గ్యాస్ ఏజెన్సీ వద్ద మంగళవారం పోలీసుల పహారా మధ్య సిలిండర్ల పంపిణీ జరిగింది. గత మూడు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గ్యాస్ కోసం తెల్లవారుజాము నుంచి పడికాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా తీవ్ర తోపులాట జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

March 24, 2026 / 12:28 PM IST

రేపే బేతంచర్ల కౌన్సిల్ సమావేశం..!

NDL: బేతంచర్ల నగర పంచాయతీ కార్యాలయంలో రేపు సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ CH. చలం రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అయితే, గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలను అధికారులు ఎంతవరకు పరిష్కరించారనే అంశంపై చర్చించనున్నారు.

March 24, 2026 / 12:27 PM IST

అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలి: సీపీఐ

SKLM: అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం CPI రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని అన్నారు.

March 24, 2026 / 12:27 PM IST

ఎన్.టీ.ఈ.పీ అవార్డు అందుకోనున్న రాజాం మెడికల్ ఆఫీసర్

VZM: జాతీయ క్షయవ్యాధి నిర్మూలన(NTEP) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పలువురిని ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో రాజాం మండలం పాగిరి PHC మెడికల్‌ ఆఫీసర్‌ డా.గట్టి భార్గవి అవార్డుకు ఎంపికయ్యారు. క్షయవ్యాధి నియంత్రణకు అమలుకు ఆమె చేసిన కార్యక్రమాలు ఆధారంగా ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం DMHO చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

March 24, 2026 / 12:23 PM IST

ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా మల్లవరపు ప్రసాద్

కోనసీమ: అమలాపురం నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా ఈదరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లవరపు ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఈదరపల్లి ఎంపీటీసీ అడపా సత్తిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

March 24, 2026 / 12:21 PM IST

చిలకలూరిపేటలో వీధి కుక్క బీభత్సం

PLD: చిలకలూరిపేట సుగాలి కాలనీలో మంగళవారం వీధి కుక్క దాడిలో ప్రవీణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా కుక్క అకస్మాత్తుగా దాడి చేయడంతో ముఖం, పెదవులపై రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

March 24, 2026 / 12:19 PM IST

‘ఉద్యాన రంగంలో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు’

మన్యం: ఉద్యానవన రంగంలో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. విభిన్న రంగాల్లో మార్పు వచ్చినా ఉద్యాన రంగానికి తిరుగులేదని అన్నారు. మంగళవారం డా. వై.ఎస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉద్యాన కళాశాల 12వ అంతర కళాశాల సంస్కృతిక, సాహిత్య సమ్మేళనం 2025-26 ఘనంగా ప్రారంభించారు.

March 24, 2026 / 12:18 PM IST

తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి: కమిషనర్

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి మంగళవారం పట్టణంలోని పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో కాలువలలో ఉన్న పైపులను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా మురుగునీటి కాలువలలో ఉన్న పైపులను తొలగించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనుల్లొ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

March 24, 2026 / 12:17 PM IST

ప్రభాకర్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: కొత్తూరు మండలం బలద గ్రామానికి చెందిన ఇరింగిల ప్రభాకరరావు అనారోగ్యంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గ్లోబల్ న్యూరో కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రభాకరరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 24, 2026 / 12:15 PM IST

రాయదుర్గంలో వలకి చిక్కిన ఎలుగుబంటి

ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓ గది బాత్రూంలో ఎలుగుబంటి చొరబడింది. అధికారులు చాకచక్యంతో బాత్రూం గడిని వేసి వలలో బంధించి కళ్యాణదుర్గంకు సురక్షితంగా తరలించారు. ఒక్కసారి ఎలుగుబంటి జనావాసంలో పల్చల్ చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వలకు ఎలుగుబంటి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

March 24, 2026 / 12:15 PM IST

హైవే కనెక్టివిటీ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం వేగవంతం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో రూ. 45లక్షలతో నిర్మిస్తున్న హైవే కనెక్టివిటీ రోడ్డును పరిశీలించారు. ఉపాధి, సాస్కి నిధులతో నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ ఉన్నారు.

March 24, 2026 / 12:15 PM IST

నిరాహార దీక్షలో పాల్గొన్న UTF ఉపాధ్యాయులు

W.G: UTF రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ కేంద్రాలు వద్ద ఒకరోజు నిరాహార దీక్షలో భాగంగా ఉండిలో UTF రణభేరిని మంగళవారం నిర్వహించింది. తక్షణమే 12 వ PRC వేసి IR 29 శాతం ప్రకటించాలని కోరుతూ నిరాహార చేస్తున్నట్టు UTF జిల్లా కార్యదర్శి P.క్రాంతి కుమార్, ప్రెసిడెంట్ విజయరామరాజు తెలిపారు. ఉండి, ఆకివీడు, పాలకోడేరు మండలాల ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పాల్గొన్నారు.

March 24, 2026 / 12:15 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీడీ

KRNL: పెద్దకడబురు(M) చిన్నకడబూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను APD లోకేశ్వర్, క్లస్టర్ టీఏ గిడ్డయ్య తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ పథకం గురించి వేతనదారులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఏ కవితకు సూచించారు. పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రతి కార్మికుడికి వివరించాలన్నారు.

March 24, 2026 / 12:14 PM IST

అరకు కేంద్రంలో యుటీఎఫ్ నిరాహార దీక్ష

ASR: యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా అరకు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు వివరించారు. పీఆర్సి కమిషన్‌ను తక్షణమే నియమించాలని, IR ప్రకటించాలని, పాత డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

March 24, 2026 / 12:08 PM IST