NDL: కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గుముఖం పట్టడంతో గర్భాలయ శిఖరాగ్రం దర్శనమిస్తోంది. దాదాపు 8 నెలలుగా నీటిలో మునిగి ఉన్న ఈ ఆలయం, 837 అడుగుల నీటిమట్టానికి చేరితే పూర్తిగా బయటకు వస్తుందని అర్చకులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రోజుకు సుమారు ఒక అడుగు మేర నీటిమట్టం తగ్గుతోంది.
VSP: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని 150 ఏళ్ల నాటి మర్రి చెట్టు వద్ద గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ రాఘవేంద్రరావు కార్యక్రమాన్ని ప్రారంభించి పిచ్చుకలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రసాయన క్రిమిసంహారకాల వినియోగం, కాంక్రీట్ భవనాల పెరుగుదలతో పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణ పరిధిలోని 17వ వార్డు ఉమా కాలనీలో చౌక ధరల దుకాణాల షాపును ఆదివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సరుకులు సక్రమంగా అందేలాగా చూడాలని డీలర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మండవ కృష్ణకుమారి, పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు: మహిళలు, పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. పని ప్రదేశాల్లో మగవారితో సమానంగా వేతనాలు పొందడం, గౌరవ ప్రదమైన వాతావరణంలో పనిచేయడం మహిళల హక్కని, ఈ దిశగా చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.
NDL: ఆత్మకూరు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాలతో డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ఓ. మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తు సాధించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
NLR: దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్భా పాఠశాల సమీప హైవే వద్ద ఆదివారం కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అవ్వగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కడప నుంచి పొదిలికి వెళ్తున్న కారు నందిపాడు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఎవ్వరికి ప్రాణ హాని జరగలేదు.
KRNL: నగరంలోని APSP 2వ బేటాలియన్‌లో మాజీ సైనికులు, వీర నారీమణులు, వారి కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మెగా ఈ.ఎం.ఎస్ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్ , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. వీర కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలను తీసుకునే విధంగా కార్యాచరణను సమీక్షించారు.
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి అధికారులు అప్రమత్తం అయ్యారు. పెనుమంట్ర మండలంలో బాణసంచా దుకాణాలను పెనుగొండ సీఐ విజయ్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యజమానులకు పలు సూచనలు అందచేశారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో మార్చి 6న మదనపల్లె గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. AU Small Finance Bank, Apollo Pharmacy తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. వివరాలకు 6301612761 నంబర్‌ను సంప్రదించవచ్చు.
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ. 40 లక్షల నిధులను స్పీకర్ మంజూరు చేయించారు. పనులను కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ఆయన పర్యవేక్షించారు. పనులు నాణ్యతపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
VZM: ఎస్ కోట మండలం గోపాలపల్లి ఎస్సీ కాలనీ వద్ద పశు మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ బాషా, సుల్తాన్‌ను ఆదివారం ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెలు పెంపకం పేరుతో షెడ్డు వేసుకొని, పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దాడులు నిర్వహించి, మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
GNTR: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొత్తపేటలో ఆదివారం మాట్లాడుతూ..యాజమాన్య కుట్రలను ఆయన తప్పుబట్టారు. బాధితులకు తక్షణమే చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తూ, మార్చి 2 నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టే రిలే దీక్షలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
KRNL: కౌతాళం గోతులదొడ్డి గ్రామ సర్పంచ్ లక్కే హనుమంతమ్మ-భర్త లక్కే గోవిందు, అధిష్టానం చర్చల అనంతరం తమ రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలన మండలి ఛైర్మన్ నియామకంలో వల్లూరి నాగేశ్వర రావు మద్దతు ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అని వారు వెల్లడించారు.
మన్యం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు చేపట్టామని ఆమె తెలిపారు.
KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం ఈనెల 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 10 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో వేండ్ర త్రినాధరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు. మరుసటి రోజు 4వ తేదీ వేకువజాము నుంచి సర్వదర్శణములు, ఇతర అన్ని వైధిక కార్యక్రమాలు, నిత్య ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.