• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించాలి’

AKP: వీ.మాడుగుల(మం) జాలంపల్లి పంచాయతీలో మంగళవారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు కేజీ రూ.200 మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 80 కేజీల బస్తాకు రూ.18,000 ఇవ్వాలని కోరారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు, పంట రుణాలు, భీమా, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 08:00 PM IST

‘టీడీపీలోకి చేరికలు అన్నీ భూటకమే’

కోనసీమ: మండపేట మండలం ఇప్పలపాడు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు పేర్కొన్నారు. గోరంత దానిని కొండంతగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పనపాడు గ్రామంలో వంద మందికి పైగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చేస్తున్న ప్రచారం బూటకమన్నారు.

February 24, 2026 / 08:00 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే

ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సచివాలయంలో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ప్రకాశం జిల్లా అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

February 24, 2026 / 08:00 PM IST

అతిసారం కట్టడికి కలెక్టర్ ప్రత్యేక చొరవ

శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో అతిసారం కేసులు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 24 గంటల అంబులెన్స్ సదుపాయం, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 52 కేసులు నమోదైనట్లు తెలిపారు.

February 24, 2026 / 07:55 PM IST

విజిబుల్ పోలీసింగ్.. ప్రజల్లో చట్టాల అవగాహన

CTR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత స్థాయిలో “విజిబుల్ పోలీసింగ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో, సెంటర్లలో, మార్కెట్ ప్రాంతాల్లో, పోలీసులు ప్రజలతో మమేకమై రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.

February 24, 2026 / 07:53 PM IST

ఇంటర్ సెకండియర్ పరీక్ష.. ఎంత మంది గైర్హాజరు అంటే..!

KDP: ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు.

February 24, 2026 / 07:46 PM IST

RUB నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

W.G: భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

February 24, 2026 / 07:44 PM IST

టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొంబాయి ముత్తన్న టీడీపీకి సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 07:43 PM IST

‘ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ’

ASR: మార్చి నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఈనెల 28న శనివారం లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేయడం జరుగుతుందని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. మండలంలో 7,457 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,12,79,000 సొమ్ము మంజూరైనట్లు తెలిపారు. ఈనెల 27న బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

February 24, 2026 / 07:38 PM IST

వాహనాలను తనిఖీ చేసిన సీఐ

కృష్ణా: గుడివాడలో టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 24, 2026 / 07:37 PM IST

లింగంపేటలో పర్యటించిన ఎంపీడీవో

AKP: నాతవరం(మం) లింగంపేట పంచాయతీలో మంగళవారం ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ పర్యటించారు. ముందుగా పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శించి, పౌష్టికాహారంను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.

February 24, 2026 / 07:35 PM IST

ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేత

E.G: రాజానగరం నియోజకవర్గ స్వరూప నగర్ కాలనీకి చెందిన రాధాక్రిష్ణ మూర్తి (75) కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO కృష్ణ నాయక్, రాజానగరం MRO తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:30 PM IST

గుంటూరులో ఈవీఎం గోదాము తనిఖీ

GNTR: గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము తాళాల సీళ్లు, సీసీ కెమెరాలు, ప్రాంగణాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. భద్రతా చర్యలను నిరంతరం పటిష్టంగా అమలు చేయాలని ఆమె సూచించారు.

February 24, 2026 / 07:30 PM IST

కౌతాళం కొనసాగుతున్న రాజీనామాల పర్వం

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు మాజీ ఎంపీటీసీ, టీబీపీ ఎల్ఎల్‌సీ వైస్ ఛైర్మన్ ఈరన్న టీడీపీ సభ్యత్వానికి, తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 07:27 PM IST

మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ ప‌రిధిలో డ‌యేరియా కార‌ణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్ర‌భుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇతర బాధిత కుటుంబాల‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.

February 24, 2026 / 07:25 PM IST