• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత నుంచి ప్రాణహాని.. కలెక్టర్‌కు వినతిపత్రం

CTR: దిగువ ఎర్రమరాజుపల్లె గ్రామస్తులైన బంగారమ్మ, సౌందర్య, శ్రావణిలు టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. గత 40 ఏళ్లుగా డీకేటీ భూమి తమ అనుభవంలో ఉందని తెలిపారు. తమకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, స్థానిక టీడీపీ నాయకుడు వెంకటాద్రి రెడ్డి తమ కుటుంబంపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు.

March 3, 2026 / 03:53 PM IST

స్వామివారి కుంభాభిషేకానికి సీఎం‌కు ఆహ్వానం

GNTR: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ పాలక మండలి ఆహ్వానించింది. పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎం‌ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.

March 3, 2026 / 03:53 PM IST

గిద్దలూరులో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ

ప్రకాశం: గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని, పట్టాదారు పాసు పుస్తకములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి హక్కు రైతుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందన్నారు.

March 3, 2026 / 03:52 PM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ.1,70,000 విలువ గల CMRF చెక్కులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 03:37 PM IST

రేపు ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక

SKLM: టెక్కలి మండలం పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో 01.04.2024 నుంచి 31.03.2025 వరకు అమలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై బుధవారం సామాజిక తనిఖీల ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం. రేణుక మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉ.10 కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

‘2027 జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించాలి’

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని కలజువ్వలపాడులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొన్నారు. 2027 జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్రంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సెన్సెస్ విభాగం అధికారులు జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

వేసవి తాగునీటి సమస్యపై సర్పంచ్ ఆవేదన

KRNL: పెద్దకడబూరు(మం) పీకలబెట్టలో ఎండాకాలంలో తాగునీటి సమస్య తీవ్రమైందని గ్రామ సర్పంచ్ లక్ష్మి మూకిరెడ్డి తెలిపారు. ఇవాళ ప్రజలకు సొంత నిధులతో తాగునీటి సౌకర్యాలు అందిస్తుంటే, MPDO, అధికారులు సహకారం అందించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో ప్రజల కష్టాలను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 03:35 PM IST

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం

W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం పోలీస్ స్టేషన్లో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం, ఆరోగ్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని DSP రఘు వీర్ విష్ణు ప్రారంభించి, మాట్లాడుతూ.. పురుషులకు ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో C.I. నాగరాజు, కనకరాజు, మురళీకృష్ణ, అల్లు శ్రీనివాస్, లాబ్ md.మురళీకృష్ణ పాల్గొన్నారు.

March 3, 2026 / 03:34 PM IST

రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రమాదం

తూ.గో: నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాలతో క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు.

March 3, 2026 / 03:25 PM IST

తర్లుపాడులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి నుంచి తుమ్మలచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డుపై మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 03:23 PM IST

‘గిరిజన యువతకు ఉపాధి కల్పించండి’

ASR: ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ కోరింది. మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వారు వినతిపత్రం అందజేశారు. అలాగే, దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న తోటల్లో జీడిగింజలు కోసేందుకు గిరిజనులకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

March 3, 2026 / 03:21 PM IST

పంపనూరులో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

ATP: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా రథాన్ని లాగి ఉత్సవాన్ని పురస్కరించుకున్నారు.

March 3, 2026 / 03:20 PM IST

‘క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే’

SKLM: పొందూరు మండల పరిధిలో ఉన్న క్వారీ యజమానులతో డీఎస్పీ వివేకానంద మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాస్టింగ్ సమయంలో కార్మికులు, స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మందుగుండు నిల్వ, రవాణా, వినియోగంలో నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

March 3, 2026 / 03:19 PM IST

పెదకాకానిలో ధర్నా చేపట్టిన అంగన్వాడీలు

GNTR: పెదకాకానిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని, గత సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 03:14 PM IST

వెంకన్న ఆలయం మూసివేత

AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, పుణ్యా వచనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

March 3, 2026 / 03:11 PM IST