విజయనగరంలో ఉన్న శక్తి వన్ స్టాప్ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ శనివారం సందర్శించారు. సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలను, బాధితులకు ముఖ్యంగా మహిళా బాధితులకు ఏ విధమైన ఆశ్రయాలు కల్పిస్తున్నది వారికి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో CSR నిధుల ద్వారా పాతపట్నం M.సీది గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సూత్ర ప్రాయ ఆమోదం లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2.41 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు.
NLR: ASపేట(M) వేల్పులగుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం, మరో రూ. 2 లక్షలతో మంజూరు చేసిన నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, రూ.31 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు.
PLD: మాచర్ల పట్టణంలోని వినాయకుని గుట్ట 28, 29వ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పరిశీలించారు. రూ.2 కోట్ల 65 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
NTR: విజయవాడ గాంధీనగర్లో శనివారం ఎస్సై సరళ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
ప్రకాశం: వెలిగండ్లలో అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన ఫ్యాన్లు, కుర్చీలు పంపిణీ చేశారు. శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ సహకారంతో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఈ సామగ్రిని అందజేశారు. చిన్నారులకు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం అందించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు, సిబ్బంది ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల(మం) కోరుమానుపల్లిలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న గుండం ఆంజనేయ స్వామి వద్ద నూతనంగా నిర్మించిన పట్టాభి రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు మండలం కరవది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్‌లో శాస్త్ర ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ మోడల్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకుని అబ్బురపరిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.
సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో పౌర సరఫరాల ఉప తహసీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం అక్రమ రవాణా చేసే వారిపై సెక్షన్ 7 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేసీ ఆదేశించారు. రేషన్ షాపులు నిర్ణీత సమయాల్లో తెరవాలని, 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు అందించాలని ఆయన సూచించారు.
BPT: మార్టూరు మండలం కొలలపూడి గ్రామంలో శనివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. రైతు స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని, అన్నదాతల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
W.G: హిందీ మాట్లాడటం, ఉపన్యాసించడంలో పెంటపాడు(M) కస్పా పెంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని నాతిరెడ్డి సిరివెన్నెల జిల్లా స్థాయిలో మూడవ స్థానం సాధించినట్లు ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్ తెలిపారు. శనివారం స్కూలు ఆవరణలో విద్యార్థిని సిరివెన్నెలను అభినందించారు. బాలికను సహచర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
NTR: మైలవరం నియోజకవర్గంలోని పలువురు మృతుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పరామర్శించారు. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుడిపూడి వెంకట నారాయణ ఇటీవల మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పుష్పములు సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని వ్యాఖ్యానించారు.
KRNL: మార్చి మాసంలో కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన 2,36,152 మంది లబ్ధిదారులకు రూ. 103.86 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం మద్దూర్ నగర్‌లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో కలెక్టర్ పలువురికి పెన్షన్లు అందజేశారు.
PLD: పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛ రథం”ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యమని, ప్రజలు చెత్త వర్గీకరణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి అలిపిరి పాదాల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు “నిజాయితీ గెలిచింది” కార్యక్రమం నిర్వహించి న్యాయస్థానం తీర్పుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నీరగట్టు నగేష్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ట్రేడ్ మార్క్ అని నేతలు పేర్కొన్నారు.