• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రేపే ప్రవేశ పరీక్షలు..!

W.G: నరసాపురం (M) ఎల్బిచర్ల బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మార్చి 1న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. శ్యాంప్రసాద్ తెలిపారు. గురుకుల పాఠశాలలో ఆదివారం ఈ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

February 28, 2026 / 12:32 PM IST

గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవన పనులను కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 28, 2026 / 12:32 PM IST

స్వయంగా పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 12:30 PM IST

‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి’

VZM: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని వేపాడ ఎంఈవో పీ బాల భాస్కరరావు కోరారు. దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలలో శనివారం జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన పలు ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

February 28, 2026 / 12:30 PM IST

కోవూరులో ప్రసన్న విజయం ఖాయం: కాకాణి

NLR: కోవూరు నియోజకవర్గంలో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబం మంచి పేరు సంపాదించుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఖాయమని YCP జిల్లా అధ్యక్షులు కాకాణి పేర్కొన్నారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద డబ్బు సంచులు లేకపోయినా, కాని జన బలం ఉందన్నారు.

February 28, 2026 / 12:27 PM IST

కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలే: MLA

KDP: కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం ఎస్.తిమ్మాపురం గ్రామంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

February 28, 2026 / 12:25 PM IST

బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

NDL: డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో కర్ణాటక కు చెందిన ప్రమోద్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కర్నూలు మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం ఆసుపత్రికి పెళ్లి బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రమోద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

February 28, 2026 / 12:23 PM IST

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి: బూరుగుపల్లి

E.G: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.

February 28, 2026 / 12:20 PM IST

15 అజెండాలను ఆమోదించిన కౌన్సిలర్లు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో చైల్డ్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 అజెండాలను ప్రవేశపెట్టారు. 15 అజెండాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.

February 28, 2026 / 12:20 PM IST

స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.

February 28, 2026 / 12:17 PM IST

మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత

సత్యసాయి: పరిగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మనేసముద్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి–రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను కూడా వివరంగా తెలుసుకున్నారు.

February 28, 2026 / 12:16 PM IST

సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు

VZM: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వాయుమార్గంలో చీపురుపల్లి మండలం రావివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంఛార్జి మంత్రి సీఎంకు స్వాగతం పలికారు.

February 28, 2026 / 12:15 PM IST

కళ్యాణదుర్గం–బొమ్మగానిపల్లి రోడ్డుకు ఎమ్మెల్యే భూమిపూజ

ATP: కళ్యాణదుర్గం నుంచి బొమ్మగానిపల్లి వరకు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తారు రోడ్డు పనులకు ఎమ్మెల్యే సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలు వేస్తోందని ఆయన అన్నారు. 143 చెరువులకు నీరు, రిజర్వాయర్ల సాధనపై మార్చి 4న సీఎంను కలుస్తామని తెలిపారు.

February 28, 2026 / 12:10 PM IST

చిత్తూరు MLAలకు ఇవి కనబడటం లేదా..?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

February 28, 2026 / 12:10 PM IST

60 ఏళ్ల స్నేహం MLA కంటతడి..!

KDP: రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.

February 28, 2026 / 12:03 PM IST