• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు

ASR: డుంబ్రిగూడ మండలం తూటంగిలో డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చెత్తాచెదారం, మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో గ్రామస్థులు దుర్గంధం నడుమ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 08:49 AM IST

మద్యం మత్తులో బీర్ సీసాతో దాడి

కృష్ణా: కానూరుకు చెందిన వాసిపల్లి కళ్యాణ్ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఈనెల 2వ తేదీ రాత్రి ఇద్దరు స్నేహితులతో బార్‌కు వెళ్లాడు. ఎదురుటేబుల్ వద్ద మద్యం మత్తులో కొందరు గొడవపడటాన్ని చూసి కళ్యాణ్ సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఆగ్రహించిన నలుగురు బీరు సీసాతో దాడి చేయడంతో తల, ముఖంపై గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

March 5, 2026 / 08:47 AM IST

జిల్లాకు చేరుకున్న 1,277 టన్నుల ఎరువులు

ఉమ్మడి అనంతపురం జిల్లాకు బుధవారం రైలు ద్వారా స్పిక్ కంపెనీ నుంచి 1,277 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు చేరుకున్నాయి. ఇందులో యూరియా 1,086 టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 128 టన్నులు ఉన్నాయి. వీటిని మార్క్ ఫెడ్, ప్రైవేటు డీలర్లతో పాటు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తాలకు ప్రతినిధులు, డీలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 5, 2026 / 08:40 AM IST

వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా YVU ఫలితాలు

KDP: వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా యోగి వేమన యూనివర్సిటీ(YVU) నిర్వహించే అన్ని పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చని వర్సిటీ ఉపకులపతి ఆచార్య B.రాజశేఖర్ తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను కులసచివులు పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.SV కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. వీ.సీ మాట్లాడుతూ.. ప్రభుత్వం వాట్సాప్(9552300009) ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. 

March 5, 2026 / 08:35 AM IST

‘అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి’

అన్నమయ్య: రాజంపేట మండలం మందరం కొత్తపల్లి గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 4 యానాది కుటుంబాలను యానాదుల సంక్షేమ సంఘం బుధవారం పరామర్శించింది. జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే బాధితులకు రూ.50 వేలు పరిహారం, పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి నిత్యవసర సరుకులు, బట్టలు, బియ్యం రూ.వెయ్యి అందించారు.

March 5, 2026 / 08:35 AM IST

కార్మికుల వేతనాల పెంపునకు సీఐటీయూ విజ్ఞప్తి

GNTR: అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల జీతాలు పెంచాలని కోరుతూ సీఐటీయూ నేతలు బుధవారం సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు వినతిపత్రం అందించారు. పెరుగుతున్న ధరలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేల వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

March 5, 2026 / 08:30 AM IST

రైతులకు సబ్సిడీపై టార్పాలిన్స్ అందజేత

E.G: దేవరపల్లి మండలం కురుకూరు కోకో ప్రాసెసింగ్ యూనిట్ వద్ద బుధవారం రైతులకు 35% రాయితీతో టార్పాలిన్స్, ప్లాస్టిక్ ట్రేలను పంపిణీ చేశారు.సర్పంచ్ అచ్యుతరాయుడు, సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్, ఉద్యాన అధికారి రమేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కోకో సాగులో మెరుగైన ఫలితాల కోసం ఈ పరికరాలు తోడ్పడతాయని తెలిపారు.

March 5, 2026 / 08:30 AM IST

తాగునీటి వివాదంలో ఘర్షణ.. కేసు నమోదు

NLR: విడవలూరు మండలం రామతీర్థంలో లే అవుట్‌కు పంచాయతీ తాగునీటి తరలింపునకు పైపులైను ఏర్పాటుపై వివాదం చోటు చేసుకుంది. ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా అధికారుల సమక్షంలో లే అవుట్ యజమాని నరేంద్ర, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు నరేంద్ర తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

March 5, 2026 / 08:28 AM IST

ఫోర్జరీ సంతకం కేసులో విచారణ

ప్రకాశం: రాచర్ల మండలంలో ఫోర్జరీ సంతకాలతో భూమిని కబ్జా చేసి, ప్రశ్నించిన వ్యక్తిని కులం పేరుతో దూషించిన ఘటనలో రామయ్య అనే వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బుధవారం మార్కాపురం డీఎస్పీ నాగరాజు మండలంలోని ఆకవీడు గ్రామానికి వెళ్లి బాధితులను విచారించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ విచారణలో గిద్దలూరు సీఐ రామకోటయ్య పాల్గొన్నారు.

March 5, 2026 / 08:28 AM IST

నూర్పిడి యంత్రంలో ప్రమాదం.. కార్మికుడికి చేయి కోత

బాపట్ల: చుండూరు మండలం ఆలపాడుకు చెందిన నాగేశ్వరరావు అపరాల నూర్పిడి యంత్రంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి తెగి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆర్థోపెడిక్ వైద్యుడు హనుమంతరావు బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

March 5, 2026 / 08:22 AM IST

ట్రాక్టర్, బోలెరో ఢీ.. పలువురికి గాయాలు

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 44 హైవేపై బుధవారం అర్ధరాత్రి కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 5, 2026 / 08:20 AM IST

ఒంగోలు కూటమిలో రాజకీయ రగడ

ప్రకాశం: ఒంగోలు కూటమిలో కుంపటి రాజుకుంటుందా అనే సందేహం ప్రజల్లో మొదలైంది. YCP నుంచి బాలినేని జనసేనలోకి వెళ్లగా.. అప్పటి నుంచి ఆయనపై అవాకులు, చవాకులు పేలుతూనే ఉన్నాయి. MLA దామచర్ల కూటమిలో ఉండగా.. వాస్తవానికి వీరిద్దరు కూటమిలో ఉన్నా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

March 5, 2026 / 08:18 AM IST

106 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా బామ.. కారణమిదే..!

NDL: నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితమవుతుంటే, పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

March 5, 2026 / 08:10 AM IST

ప్రమాదవశాత్తు మామిడి కొమ్మ పైనపడి వ్యక్తి మృతి

ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జలసూత్రం రంగారావు (57) మామిడి కొమ్మలు కోయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు భారీ కొమ్మ పైనపడి మృత్యువాతపడ్డాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లగా ఈ దుర్గటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 08:08 AM IST

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సత్యసాయి జిల్లాలోని దివ్యాంగులకు ఈనెల 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలోని ధర్మవరంలో 7,150 మంది, కదిరిలో 6,081, పుట్టపర్తిలో 5,983, పెనుగొండలో 5,027 మంది లబ్ధిదారులు ఉన్నారు. హిందూపురం, మడకశిర, రాప్తాడు డివిజన్ల పరిధిలోని వికలాంగులకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.

March 5, 2026 / 08:06 AM IST