• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వినుకొండ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

PLD: వినుకొండ విచ్చేసిన సీఎం చంద్రబాబుకు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో స్టేడియం నిర్మాణానికి రూ. 50 కోట్లు కేటాయించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.

February 21, 2026 / 03:49 PM IST

ముంచంగిపుట్టు సంతలో రైతుల సమస్యలపై ఆరా

ASR: ముంచంగిపుట్టులోని స్థానిక వారపు సంతను అగ్రికల్చర్ మార్కెట్ ఛైర్మన్ బోరి బోరి లక్ష్మి శనివారం పరిశీలించారు. కనీస వసతులు లేక ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంతలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పలస్వామి, పోతురాజు, సుబ్బారావు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:48 PM IST

‘బొత్స సత్యనారాయణ రాజీనామ చేయాలి’

VZM: టీడీపీ కార్యాలయంలో ఇవాళ కూటమి నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. MLC బొత్స సత్యనారాయణ ఎపీ శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వరస్వామి ఫోటోని చేత్తో పట్టుకున్నామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. కౌన్సిల్ వీడియో రికార్డ్‌లో అది నిరూపణ అయింది. కావున రాజీనామ చేయాలని వారు డిమాండ్ చేశారు

February 21, 2026 / 03:47 PM IST

జిల్లాలో టీడీపీలోకి భారీగా చేరికలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 21వ డివిజన్, ఎన్టీవో కాలనీకి చెందిన కోడూరు రవి, ఖాదర్ బాష, ప్రవీణ్ వారి మిత్రబృందం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కోటంరెడ్డి సోదరులు సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా చేరిన వారికి తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు

February 21, 2026 / 03:47 PM IST

‘చిత్తూరులో మెప్మా జాబ్ మేళా ప్రారంభం’

CTR: చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ అముద, చూడ ఛైర్పర్సన్ హేమలత తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:47 PM IST

నియోజకవర్గంలో 324 డబుల్ ఓట్లు తొలగింపు

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలన అధికారి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మరణించిన , రెండుసార్లు నమోదైన 324 ఓట్లను ఫారం–7 ద్వారా తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:45 PM IST

జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

KDP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

February 21, 2026 / 03:45 PM IST

‘2027 గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలి’

E.G: 2027 గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని కలెక్టర్ వద్ద సమగ్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా SP డీ.నరసింహ కిషోర్, JC వై.మేఘా స్వరూప్ పాల్గొన్నారు. పుష్కరాల కోసం పార్కింగ్ స్థలాలు, పుష్కర నగర్‌ల ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

February 21, 2026 / 03:44 PM IST

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులను సమగ్రంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, విధుల నిర్వహణ తీరును పరిశీలించిన ఆమె, కంప్యూటర్ విభాగాన్ని సందర్శించి పట్టాదారు పాసుపుస్తకాలు, కుటుంబ సభ్యుల ధృవపత్రాల దరఖాస్తులపై సమీక్ష చేశారు.

February 21, 2026 / 03:43 PM IST

శానిటరీ వర్కర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ

PLD: సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని శానిటరీ వర్కర్లకు శనివారం ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికులకు ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెన్నకేశవరావు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:42 PM IST

పదవ తరగతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది

పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ అని ఇవాళ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శ్రీ లక్ష్మి హై స్కూల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, టెన్త్ మార్కులు ఉన్నత చదువులకు పునాది అవుతాయని తెలిపారు. ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 03:41 PM IST

ఎస్పీని సన్మానించిన దేవస్థాన అధికారులు

GNTR: వడ్లమూడి బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా సమగ్ర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. తిరునాళ్లకు భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.

February 21, 2026 / 03:40 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం ఎలకుంట్ల గ్రామంలో చింతచెట్టు పైనుంచి పడి దాసరి రాము అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధా రాఘవ శనివారం మృతుడి నివాసానికి వెళ్లి భార్య ఓబులమ్మను పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

February 21, 2026 / 03:40 PM IST

గన్నవరంలో ఫ్లైట్ నిలిపివేత.. ప్రయాణికుల ఆందోళన

NTR: గన్నవరం నుంచి బయలుదేరే షార్జా ఫ్లైట్‌ని శనివారం ఎయిర్‌పోర్ట్ అధికారులు నిలిపివేశారు. దీంతో సుమారు 163 మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. షార్జాలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సిబ్బంది వెల్లడించారు.

February 21, 2026 / 03:40 PM IST

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: ఆర్డీవో

ATP: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధమని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలని అన్నారు.

February 21, 2026 / 03:40 PM IST