• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వేంకటేశ్వర స్వామి కళ్యాణానికి అంకురార్పణ

కోనసీమ: అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలకు శనివారం రాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని నియోజకవర్గ ప్రజలందరిపై ఆ స్వామి వారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:40 PM IST

చిత్తూరు ఎంపీని కలిసిన జనసేన నాయకులు

CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును ఇవాళ ఆయన కార్యాలయంలో జనసేన నాయకులు ఎం. మహేష్ స్వేరో, తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తవణంపల్లి మండలం, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసాదాలను ఎంపీకి అందజేశారు.

February 21, 2026 / 03:39 PM IST

రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

AKP: పరవాడ మండలం జాజులవానిపాలెం, పీ.బోనంగి, కలపాక మీదుగా దళాయిపాలెం వరకు రూ 4.40 కోట్లతో 12.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:38 PM IST

‘కూల్ లిప్’పై కఠిన చర్యలు: ఎస్పీ ధీరజ్

అన్నమయ్య: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న ‘కూల్ లిప్’ వంటి నికోటిన్ మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహించాలని సూచించారు.

February 21, 2026 / 03:34 PM IST

రామాపురం గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. టిడిపి నాయకుడు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం కార్యక్రమంలో బీసీ ఇందిరమ్మ పాల్గొన్నారు. అనంతరం బీసీ ఇందిరమ్మ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 21, 2026 / 03:33 PM IST

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా

W.G: వీరవాసరం మండలం కొణితివాడ బుద్ధ రాయుడు చెరువు వద్ద రూ.3.48 కోట్లతో నిర్మించిన 33 KV ఫీడర్‌ను శనివారం MLA పులపర్తి రామాంజనేయులు, MP పాక సత్యనారాయణ ప్రారంభించారు. భీమవరం నుంచి కొణితివాడ వరకు 16.6 కి.మీ. మేర కొత్త విద్యుత్ లైన్ నిర్మించినట్లు వారు తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 03:32 PM IST

వైసీపీ మతసామరస్యాన్ని దెబ్బతీసింది: ఎమ్మెల్యే

E.G: గత వైసీపీ ప్రభుత్వంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే అంశం మొదలైందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. భారత పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనమండలిలో వైసీపీ నేతలు భగవంతుని ఫోటోలు ప్రదర్శించారని మండిపడ్డారు. చెప్పులు, బూట్లు ధరించి స్వామి వారి ఫోటోలు ప్రదర్శించడం   అపచారమన్నారు.

February 21, 2026 / 03:26 PM IST

మనోహర్ రెడ్డికి డాక్టరేట్.. ఘన సన్మానం

TPT: చిట్టమూరు మండలం కొత్తగుంటలోని టీఎంఆర్ విద్యాసంస్థల అధినేత డా. తంబిరెడ్డి మనోహర్ రెడ్డికి గ్రామీణ విద్యాభివృద్ధి, సామాజిక సేవలకు గాను అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. చెన్నైలో అవార్డు స్వీకరించిన అనంతరం శనివారం టీఎంఆర్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. కడైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ రహంతుల్లా పాల్గోన్నారు.

February 21, 2026 / 03:25 PM IST

శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం ఆటో డ్రైవర్లకు శక్తి టీం ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, తగు సూచనలు చేశారు.

February 21, 2026 / 03:24 PM IST

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు: ఎమ్మెల్యే

ATP: అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆదేశించారు. యార్డులో పాలకవర్గంతో నిర్వహించిన సమావేశంలో మార్కెట్ అభివృద్ధిపై చర్చించారు. చీనీ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కష్టపడి పంట తెచ్చే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.

February 21, 2026 / 03:21 PM IST

పీఎం సూర్య ఘర్‌ పథకంపై కలెక్టర్‌ సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో పీఎం సూర్య ఘర్‌ పథకంపై జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ శనివారం విద్యుత్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 11,987 ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచిత సోలార్‌ రూఫ్‌ టాప్‌లు మంజూరైనట్లు తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే కుటుంబాలకు ఈ అవకాశం కల్పిస్తామని తెల...

February 21, 2026 / 03:20 PM IST

గుత్తిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KRNL: గుత్తి మండల కరటికొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం ఆచారి అనే వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన ఆయన తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 21, 2026 / 03:20 PM IST

PACS ఉద్యోగుల నిరసన దీక్ష

PPM: రైతుల ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం, ప్రభుత్వ లక్ష్యాలను అమలుపరుస్తూ నిరంతరం సేవ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చలేక పోతుందని ఎఐటీయుసీ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జెఎసి) చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేశారు.

February 21, 2026 / 03:07 PM IST

రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ పిలుపు

VSP: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా డాబా గార్డెన్స్‌లోని అంబేద్క‌ర్ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని విమర్శించారు. ఒక శాతం కార్పొరేట్ల వద్ద పోగుపడిన సంపదపై పన్నులు వేసి ప్రజలకు పునర్వినియోగం చేయాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:05 PM IST

జంగారెడ్డిగూడెంలో రెడ్ బుక్స్ డే

ELR: జంగారెడ్డిగూడెం CPM భవనంలో రెడ్ బుక్స్ డే సందర్బంగా లెనిన్ రచించిన పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనే పుస్తకం మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ సూర్యారావు మాట్లాడారు. 21-2-1848,లో మార్క్స్ & ఎంగిల్స్ కలసి రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళిక విడుదల చేసిన రోజున ప్రపంచంలోని పెట్టుబడి దారి విధానానికి ఒక భూకంపం వచ్చిందన్నారు.

February 21, 2026 / 03:02 PM IST