• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాజుపాలెం లో స్వచ్ఛ రథం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమం స్వచ్ఛ రథం అని పేరు పెట్టారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల అన్నారు. శనివారం రాజుపాలెం నందు స్వచ్ఛ రథం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వచ్ఛ రథం ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ పనికిరాని వ్యర్థలను సేకరిస్తుందని.

February 21, 2026 / 03:02 PM IST

కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కును అందజేసిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం మండలం మేకవానిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ప్రమాద బీమా కింద రూ. 5 లక్షల చెక్కును మల్లేశ్వరరావు సతీమణి పుష్పారాణికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:01 PM IST

కొత్త బగ్గంలో అగ్నిప్రమాదం

VZM : గజపతినగరం మండలంలోని కొత్త బగ్గం గ్రామంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన దాన చంద్రరావుకు చెందిన గడ్డివాము కాలిపోయింది. సుమారు 20 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వీ రవి ప్రసాద్ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.

February 21, 2026 / 03:01 PM IST

‘అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం’

అన్నమయ్య: రాజాంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పై టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ నిధులను ఎమ్మెల్యే సొంత ఎస్టేట్ పనులకు వినియోగించారని ఆయన విమర్శించారు. అకేపాడు 56/1 సర్వే నెంబర్‌లో టీటీడీ నిధులతో నిర్మించిన కల్యాణమండపం ఇప్పటికీ ఎస్టేట్ ఆవరణంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు.

February 21, 2026 / 03:01 PM IST

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: SP

E.G: ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ శనివారం సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘా ఉంటుందన్నారు.

February 21, 2026 / 03:01 PM IST

ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలు

NDL: ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 24 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 ఫీజు. ఏప్రిల్ 27న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.

February 21, 2026 / 03:00 PM IST

పాతాలమెరక లో రూ 3 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు

W.G: కాళ్ళ మండలం ప్రాతల్లమెరక గ్రామంలో వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో రూ 3 కోట్ల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, బాపట్ల ఎంఎల్ఏ , APIIC ఛైర్మన్ మంతెన రామరాజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో వారు పాలుపంచుకున్నారని ఆయన తెలిపారు.

February 21, 2026 / 03:00 PM IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

సత్యసాయి: తలుపుల మండలం మంగివాండ్లపల్లిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ శనివారం ప్రజా దర్బార్‌ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాటికి త్వరితగతిన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 03:00 PM IST

మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తులు వేలం

KRNL: మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ శనివారం ప్రకటించింది. 2018లో తీసుకున్న రుణం వడ్డీతో కలిసి రూ.782 కోట్లకు చేరగా, చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. KPHBలోని మెరిడియన్ పాఠశాల భవనం, స్థలాన్ని మార్చి 24న వేలం వేయనున్నారు. కనీస విలువను రూ.65 కోట్లుగా నిర్ణయించారు.

February 21, 2026 / 03:00 PM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

ATP: గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలోని ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం టీడీపీ నేతలు పంపిణీ చేశారు. మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు ఇంటి వద్దకే వెళ్లి ఒకరికి రూ.72,650వేలు, మరొకరికి రూ.45 వేలు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం అన్నారు.

February 21, 2026 / 03:00 PM IST

ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి

కృష్ణా: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నంలోని బస్టాండ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, డీఎం పెద్దిరాజులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:55 PM IST

CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

BPT: కొల్లూరు మండలం వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7,87,294లు మంజూరయ్యాయి. మొత్తం 17 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో ఈ సహాయాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా అందజేశారు. పేదల వైద్య అవసరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 02:54 PM IST

‘ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలి’

శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్సై ఎం. అప్పలరాజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు.

February 21, 2026 / 02:53 PM IST

‘వెదురుకుప్పంలో స్వచ్ఛ రథం ప్రారంభం’

CTR: వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణ-ఆంధ్ర, స్వచ్ఛ-ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ప్రారంభించారు. తహసీల్దార్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు ఇంట్లో అవసరం లేని వస్తువులను ఇచ్చి అవసరమైనవి పొందవచ్చని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:52 PM IST

త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి

PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, దేవస్థాన అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

February 21, 2026 / 02:51 PM IST