• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్లపై వాహనాల నిలిపివేత.. స్థానికుల ఇబ్బందులు

ఎన్టీఆర్: కంచికచర్లలోని చెవిటికల్లు సెంటర్, నెహ్రూ సెంటర్, జుజ్జూరు రోడ్డు సెంటర్‌లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఆటోవాలాలు ఇష్టాను సారంగా రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనదారులు గందరగోళానికి గురవుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

February 21, 2026 / 02:51 PM IST

సమాచార శాఖలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ‘జీరో–వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.

February 21, 2026 / 02:49 PM IST

‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా’ తీర్చిదిద్దేటట్లు కృషి: MLA

E.G: కొవ్వూరులో శనివారం జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించి స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:42 PM IST

‘హిందువుల మనోభావాలను వైసీపీ ఎమ్మెల్సీలు దెబ్బతీశారు’

ఎన్టీఆర్: దేవుడు చిత్రపటాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:41 PM IST

పరిగిలో స్వచ్ఛ రథం ప్రారంభం

సత్యసాయి: పరిగి మండలంలో స్వచ్ఛ రథాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన, చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ స్వచ్ఛ రథాన్ని ప్రవేశపెట్టినట్లు టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ప్రజలు వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులు ఈ వాహనానికి అందిస్తే నిత్యవసర వస్తువులు అందిస్తారని తెలిపారు.

February 21, 2026 / 02:40 PM IST

వైసీపీ యూత్ లీడర్ ఉపాధ్యక్షుడిగా రాజు

ATP: రాయదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి వైసీపీ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడిగా తోట రాజును ఎన్నుకున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతలు అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ సమన్వకర్త మెట్టు గోవిందరెడ్డికి, వార్డు కౌన్సిలర్ సంజీవప్పకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 02:40 PM IST

‘పిచ్చాటూరులో స్వచ్ఛ రథం ప్రారంభం’

TPT: స్వచ్ఛంద్ర–స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. శనివారం పిచ్చాటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలు వినియోగించిన ప్లాస్టిక్, గాజు సీసాలను రథానికి అందిస్తే నిత్యావసర వస్తువులు ఉచితంగా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:39 PM IST

శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ సీజ్

VSP: యెద్దుల వెంకటరమణ రెడ్డికి చెందిన శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. జీవీఎంసీకి సుమారు రూ.1.90 కోట్లు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శనివారం రెవెన్యూ అధికారి రామ్ నారాయణ ఆధ్వర్యంలో ఆచ్ఐలు శివ, రెడ్డి మోహన్ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:36 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన చల్లా బాబు

CTR: రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారి పల్లెలో స్వచ్ఛ రథాన్ని పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:35 PM IST

పోలీస్ కార్యాలయాల్లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ దివస్’

అన్నమయ్య జిల్లాలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానంలో పాల్గొని ప్రాంగణాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:34 PM IST

మందకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి మండలం ఎస్సీ వెల్ఫేర్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గా శ్రీనివాస్‌కు ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు ప్రతాప్ పిర్యాదు చేశారు. మందకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

February 21, 2026 / 02:34 PM IST

వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్

TPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె లోని వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరును పరిశీలించి, వ్యర్థాల వేరు వేరు సేకరణ, శుభ్రత పరిరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:34 PM IST

టెక్నాలజీతో నేరాలకు చెక్: ఐజీ అశోక్ కుమార్

WG: పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నా సాంకేతికతతో అధిగమిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జివిజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం అచంటలో ఆయన మాట్లాడారు. నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:34 PM IST

మేరికపూడిలో పొలంబడి కార్యక్రమం

GNTR: ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి గ్రామంలో శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసంతి పాల్గొని రైతులకు పంట పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన 30 మంది రైతులకు శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వివిధ చీడపీడల నివారణ చర్యలు, పోషక యాజమాన్యంపై సూచనలు చేశారు.

February 21, 2026 / 02:33 PM IST

కరెంటు షాక్‌తో అడవిపంది మృతి

KDP: మైదుకూరు మండలం గంజిగుంట ఫారెస్ట్ పరిధిలో విద్యుత్ షాక్‌తో అడవిపంది శనివారం మృతి చెందింది. ఫారెస్ట్ ఆఫీసర్ చలపతి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, పంది కాళ్లు, మాంసం లభ్యమయ్యాయి. కరెంటు తీగలు అమర్చిన పొలం యజమానిని అధికారులు విచారిస్తున్నారు. రైతులు పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదని, వన్యప్రాణులు మృతి చెందితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరు.

February 21, 2026 / 02:32 PM IST