• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మోటార్ సైకిళ్ల దొంగ దొరికాడు’

VZM: విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడిన గుమ్మడి ఆదినారాయణను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని, కోర్టు ఆదేశాలతో వాహనాలను బాధితులకు అప్పగిస్తామని చెప్పారు.

February 25, 2026 / 07:05 PM IST

అసెంబ్లీలో చేనేత స్టాళ్లకు భారీ స్పందన

GNTR: వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ సందర్శిస్తూ ఉత్సాహంగా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. బుధవారం మహిళా మంత్రులు స్టాళ్ల వద్ద సందడి చేశారు. నేతన్నల ఉత్పత్తులకు ప్రజాప్రతినిధుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.

February 25, 2026 / 07:05 PM IST

మార్కండేయ నగర్‌లో కొత్త రోడ్డుకు భూమిపూజ

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 34వ వార్డు మార్కండేయ నగర్‌లో నూతన రోడ్డు నిర్మాణానికి కూటమి నేతలు బుధవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో హిందూపురం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు.

February 25, 2026 / 07:05 PM IST

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

VZM: నెల్లిమర్ల ఈవిఎం గోదాముల‌ను క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి బుధ‌వారం త‌నిఖీ చేశారు. గోదాము ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను ప‌రిశీలించారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సీసీ కెమేరాల ద్వారా చుట్టుప్ర‌క్క‌ల‌ ప‌రిస్తితుల‌ను ప‌రిశీలించారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌...

February 25, 2026 / 07:05 PM IST

చీరాలలో పోలీసుల అవగాహన సదస్సు

BPT: చీరాల పోలీసులు మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. బాపట్లను డ్రగ్స్ రహిత (నషా ముక్త్) జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.

February 25, 2026 / 07:03 PM IST

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: MLA ప్రత్తిపాటి

PLD: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు వివరాలు తెలుపుతూ, తన రాజకీయ ప్రస్థానంలో మైనార్టీల పాత్ర కీలకమని కొనియాడారు. వారి కోసం గతంలోనే చిలకలూరిపేటలో రూ.18 కోట్లతో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

February 25, 2026 / 07:02 PM IST

‘గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి’

VSP: పేదల గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 3-4 నెలలు నిర్మాణాలకు అనుకూల కాలమని, ఈలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.

February 25, 2026 / 07:02 PM IST

అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువకుడు మృతి

కృష్ణా: గుడివాడ టిట్కో కాలనీకి మల్లేశ్వరరావు కుమారుడు అందే నాగ సతీష్ కుమార్ గత 3 నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. తలనొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో సతీష్ అపార్ట్మెంట్‌పై అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బుధవారం వైద్యులు నిర్ధారించారు.

February 25, 2026 / 07:00 PM IST

వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్, 22Aపై సమగ్ర సమీక్ష సమావేశం

KDP: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు మనసుపెట్టి పని చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 22A, మ్యూటేషన్, వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్ తదితర అంశాలపై మండలాల వారీగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.

February 25, 2026 / 06:59 PM IST

త్రో బాల్ పోటీలో ఎమ్మెల్యే పరిటాల సునీత జట్టు విజయం

ATP: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం నిర్వహించిన త్రో బాల్ మ్యాచ్‌లో MLA పరిటాల సునీత జట్టు విజయం సాధించింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి జట్టుతో జరిగిన ఈ పోటీలో సునీత జట్టు ప్రతిభ చాటి గెలుపొందింది. వృత్తిపరమైన పనులతో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఉత్సాహాన్నిచ్చాయని ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు.

February 25, 2026 / 06:57 PM IST

మూడవ రోజుకు చేరిన అంగన్వాడీల దీక్షలు

NDL: యఫ్‌లతో తంటాలు పడుతూ చంటి పిల్లలు, గర్భిణులకు సేవలు అందిస్తున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని CITU పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు. నేడు నంది కొట్కూరు ICDS కార్యాలయం వద్ద సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ.. అంగన్వాడీలు 3వ రోజు దీక్షలు చేపట్టారు. 2024లో 42 రోజులు సమ్మె చేసిన YCP ప్రభుత్వం, ప్రస్తుత కూటమి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

February 25, 2026 / 06:57 PM IST

మినీ జెట్టి నిర్మాణంపై మంత్రికి వినతి

SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష గురువారం మంత్రి అచ్చెన్నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వజ్రపుకొత్తూరు మండలం, మంచినీళ్ళపేట గ్రామంలో మత్స్యకారుల కోసం మినీ జెట్టి నిర్మాణం కోసం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 25, 2026 / 06:55 PM IST

నీటి సంపులో పడిపోయిన ఆవును రక్షించిన అగ్నిమాపక శాఖ

CTR: మేత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తు 15 అడుగుల నీటి సంపులో పాడి ఆవు పడిపోయిన ఘటన పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపాన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహకారంతో తాళ్లు నిచ్చెనలను ఉపయోగించి సంపులో నుంచి సురక్షితంగా అవును బయటికి తీశారు.

February 25, 2026 / 06:54 PM IST

ధర కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆలూరు మండలంలో ఏర్పాటు చేసిన శనగ మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. శనగ పంటను క్వింటాకు రూ. 5,875 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 06:54 PM IST

సరైన పత్రాలు లేని వాహనదారులకు పోలీసుల షాక్

ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించని వారిపై చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

February 25, 2026 / 06:52 PM IST