NDL: రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు నంద్యాల ఎంపీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా. బైరెడ్డి శబరికి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పునర్వికకు పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50 లక్షల వైద్య సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవా గణేష్ నాయక్ సన్ని, కుమార్, మహేంద్ర మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
GNTR: మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో “స్వచ్ఛ మంగళగిరి 2.0” పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మొదటి దశ ప్రజల్లో మంచి చైతన్యం తెచ్చిందని, రెండో దశలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిని పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మార్చాలన్నారు.
కృష్ణా: డెలివరీ బాయ్‌గా తన అనుభవాలను అసెంబ్లీలో పెనమలూరు MLA బోడె ప్రసాద్ బుధవారం పంచుకున్నారు. ఇతర దేశాల్లో డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చిన్నతనంగా చూడకుండా అందరూ చేస్తారని అదే స్ఫూర్తిని ఇక్కడ యువతలో నింపాలని తాను డెలివరీ బాయ్‌గా చేసినట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్‌కి కంపెనీల వద్ద టాయిలెట్స్, నుంచోడానికి నీడ వంటి సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ASR: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చ్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 28న పంపిణీ చేస్తారని అరకులోయ ఎంపీడీవో అడప లవరాజు పేర్కొన్నారు. కావున ఫించను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని అన్నారు. మండలంలో ఉన్న 6359 ఫించన్లకు రూ.2.75 కోట్లు మంజూరైనట్లు బుధవారం తెలిపారు. సిబ్బంది ఈ నెల 27న పింఛను అమౌంట్ బ్యాంకు నుండి వితడ్రా చేయాలన్నారు.
CTR: వెదురుకుప్పం సచివాలయ పరిధిలో జరుగుతున్న ఏకీకృత సర్వేని ఎంపీడీవో పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు, ఫుడ్ స్టాక్ వివరాలను ఆరా తీశారు. సకాలంలో పౌష్టికాహారం పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది రిషి, జయసుధ, నీరజ పాల్గొన్నారు.
SKLM: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్ అన్నారు. బుధవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈనెల 26 నుండి ప్రారంభంకానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అన్నారు.
TPT: కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఎంపీ గురుమూర్తి ఆదేశించారు. అంగన్‌వాడీలు, డెయిరీలు,హోటళ్లు, స్వీట్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాలని, కల్తీ నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని, పునరావృతమైతే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ELR: ముదినేపల్లి(మం) గురజలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న చెరువులో పడి నితీశ్(2) మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు తమిళనాడులో ఉండగా, ఇక్కడ అమ్మమ్మ వీరమ్మ వద్ద పెరుగుతున్నాడు. చిన్నారిని గమనించి స్థానికులు వెంటనే గుడివాడ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
NDL: ఆత్మకూరుకు చెందిన అబ్దుల్ రషీద్ Border Security Force (బీఎస్ఎఫ్)లో ఉద్యోగం సాధించిన సందర్భంగా బుధవారం డీఎస్పీ రామాంజి నాయక్, అర్బన్ సీఐ మహేశ్వర రెడ్డి అభినందించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పస్పిల్ మున్నా మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. దేశానికి సేవ చేసే ఉద్యోగం పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.
W.G: జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించేది లేదన్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ విభాగాలకు నిర్దేశిత గడువులోగా బియ్యం అందించాలన్నారు.
VSP: వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కే.కె రాజు ఆధ్వర్యంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో వార్డు, సచివాలయం స్థాయి పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ATP: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 22,800 మంది, ఒకేషనల్ విభాగంలో 2,469 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 810 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన బోర్డు అబ్జర్వర్ సౌజన్య పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెంటనే స్పందించారు. స్వయంగా ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకోగా, ఆమెను చూసి యువకులు పరారయ్యారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో పోలీస్ గస్తీ నిర్వహించాలన్నారు.
కాకినాడ: లండన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్దాపురం కొండయ్య పేటకు చెందిన గొంతి అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. క్రోయిడాన్ డప్పాసి హిల్ టెర్రస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. 2023లో ఎంబీఏ చదివేందుకు అభిషేక్ లండన్ వెళ్లారు. అభిషేక్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
కృష్ణా: పెనమలూరు(M) కానూరు సంతోష్ నెక్స షోరూంను కలెక్టర్ బాలాజీ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ షోరూమ్ యజమానితో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి సేవలు అందుతున్నాయి ? ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనంలో రిజిస్ట్రేషన్ బీమా పన్నులు వసూలు బోర్డులను పెట్టాలని తెలిపారు.