గత కొంత కాలంగా ట్విట్టర్ తన వ్యాపార రంగంలో వెనకబడుతూనే ఉంది. ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ ను తన సొంతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో నగదు కొరత(Negative Cash flow) తీవ్రంగా ఉందని ఇప్పుడు ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు(Twitter Layoffs). ప్రకటనల ఆదాయం కూడా ఇప్పుడు దాదాపు 50 శాతానికి పడిపోవడం, భారీ రుణభారం కారణంగా ట్విట్టర్ ఆదాయం మరింత క్షీణించిందని ఎలాన్ మస్క్ ప్రకటించాడు.
ఈ ఏడాదిలో ట్విట్టర్ ఆదాయం 4.5 బిలియన్ డాలర్లు వస్తుందని అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను ఇప్పుడు 3 బిలియన్ డాలర్లకు తగ్గించడం విశేషం. చేసేదేమీ లేక ఇప్పుడు ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించేందుకు ఎన్బీసీ యూనివర్సల్ (NBC) కామ్‌కాస్ట్ మాజీ యాడ్ చీఫ్ అయిన లిండా యాకారినో(Linda Yaccarino)ను మస్క్ సీఈఓ(Twitter New CEO)గా నియమిస్తూ ప్రకటన చేశారు.
ట్విట్టర్ ఆదాయం పడిపోవడానికి అనేక కారణాలున్నాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ట్విట్టర్ టేకోవర్ చేశాక మస్క్ లేఆఫ్స్ నుంచి సైట్లో అనేక మార్పులు చేస్తూ వచ్చాడు. 50 శాతం మందిని తొలగించాడు. రోజుకో కండిషన్ పెట్టాడు. బ్లూటిక్, సబ్స్క్రిప్షన్ ప్లాన్(Blue Tick Subscription) అంటూ నిబంధనలు పెట్టాడు. దీంతో యూజర్లకు చిరాకు దొబ్బి ఒక్కొక్కరే క్రమంగా తగ్గిపోతూ వచ్చారు. దానికి తోడు ఇప్పుడు థ్రెడ్ యాప్ వచ్చేసింది. ఇక ట్విట్టర్ పతనం తప్పదని పలువురు చర్చించుకుంటున్నారు.