Room At Station: సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. టైమ్ ఉంటే ఫర్లేదు.. లేకుంటే కష్టం. ఎందుకంటే రూమ్ తీసుకోవడం.. ఫ్రెష్ అవడం కష్టం అవుతోంది. అలాంటి వారి చిక్కులను ఐఆర్సీటీసీ (IRCTC) తొలగించింది. అవును మీరు చదివేది నిజమే.. స్టేషన్లోనే హోటల్ లాంటి చక్కని రూమ్ ఉంటుంది. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. పదండి.
రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. తక్కువ ఖర్చుతో వసతి ఏర్పాటు చేసేందుకు రూమ్స్ బుకింగ్ సదుపాయం కల్పించింది. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మిటరీ గదులు అందుబాటులో ఉంటాయి. గంట నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి రూమ్ బుకింగ్ ఛార్జీ ఉంటాయి. రూ.100 నుంచి రూ.700 వరకు ఉంటాయి.
టికెట్ రిజర్వేషన్ అయిన వ్యక్తులు మాత్రమే రూమ్ బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్యాసెంజర్స్‌కు అవకాశం ఉండదు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ సౌకర్యం ఉంది. ఆన్ లైన్‌తోపాటు ఆఫ్ లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్ లైన్లో చేయాలంటే.. ఐఆర్సీటీసీ సైట్ లాగిన్ చేసి ఇలా చేయండి.
ముందుగా అకౌంట్ సెక్షన్లో మై బుకింగ్స్ క్లిక్ చేయాలి. కిందకు స్క్రోల్ చేయగా రిటైరింగ్ రూమ్ ఆప్షన్ కనిపిస్తోంది. క్లిక్ చేసి పీఎన్ఆర్ నంబర్, స్టే చేయాలనుకునే స్టేషన్ వివరాలు ఇవ్వాలి. చెక్ ఇన్, చెక్ అవుట్ డేట్, బెడ్ టైప్ డేటా ఇవ్వాలి. స్లాట్ డ్యూరేషన్, ఐడీ కార్డ్ టైప్ వివరాలు సరిగ్గా చూసి పేమెంట్ చేయాలి. తర్వాత రూమ్ బుకింగ్ అవుతుంది. అనివార్య కారణాల వల్ల 48 గంటల ముందే రూమ్ బుకింగ్ రద్దు చేసుకుంటే 10 శాతం మీ రూమ్ బుకింగ్ ధర నుంచి తీసివేసి ఇస్తారు. ఒకరోజు ముందు క్యాన్సిల్ చేస్తే 50 శాతం తీసివేస్తారు. ఆ తర్వాత క్యాన్సిల్ చేసిన డబ్బులు ఇవ్వరు.