»Admit Card For Seven Years After Applying For Government Job Distraught Candidate
Govt Jobకి అప్లై చేసిన ఏడేళ్లకు అడ్మిట్ కార్డ్.. విస్తుపోయిన అభ్యర్థి
వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి 2016లో నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది.
పశ్చిమ బెంగాల్ (West Bengal) వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ వచ్చింది. ఓ అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నాడు.అయితే, ఆ తర్వాత నియామక పరీక్షకు సంబంధించి అతడికి ఎలాంటి అప్డేట్ రాలేదు. అడ్మిట్ కార్డు (Admit Card) రాకపోవడంతో అతడు నిరాశకు గురయ్యాడు. కొంతకాలానికి ఆ విషయం మర్చిపోయాడు.అయితే ఈ నెల 1న అతనికి ఓ మెయిల్ ఓ వచ్చింది. అదిచూసి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.
తీరా దానిని ఓపెన్ చేసి చూడగా ఏడేండ్ల కింద తాను దరఖాస్తు చేసిన అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన అడ్మిట్‌కార్డు. ఇన్నేండ్ల తర్వాత హాల్‌టికెట్ (Hall Ticket) రావడంతో షాక్ అయిన అతడు.. అసహనానికి లోనయ్యాడు. ఈ ఆలస్యానికి కారణం ఎవరు, అది ఇప్పుడు ఎందుకు వచ్చిందనే విషయమై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశాడు. 2016 మార్చి నెలలో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ (Ashish Banerjee) అని అభ్యర్థి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నియామక పరీక్ష అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. అయితే హాల్‌టికెట్ రాకపోవడంతో అతడు పరీక్షకు హాజరుకాలేకపోయాడు.